*” తెలుగు నుడి - జాతుల మనుగడ , పెంపు కోసం మడమ తిప్పని పూనికల నాయుడు గారు ”*
==============
మన దేశంలో ఉద్యోగం నుండి ఊరట (2010) పొందగానే ఊరక ఉండక తాను పుట్టిన బర్మా దేశంలోని తెలుగువారిని తెలుగుకు దూరం కాకుండా వారికి తెలుగు నేర్పిస్తూ ఒక జాతి మనుగడ , కొనసాగింపుకై అలుపెరుగని కృషి చేస్తున్నారు వీరు.
_____________________
తెలుగు వచ్చిన పెద్దవారు తమ పిల్లలతో తెలుగులోనే మాట్లాడాలి, లేకపోతే తెలుగు భాష , సంస్కృతి , జాతి ముందు తరాలకు కొనసాగవు అని గట్టిగా చెబుతారు వీరు. పర రాష్ట్రాల్లో, పర దేశాల్లో ఉన్న తెలుగువారి కోసం మన తెలుగు రాష్ట్రాల వారు- ఆర్థిక సాయంతో తెలుగు బడులు , తెలుగు వాచకాలు అందుబాటులోకి తేవడమే కాక, తాము స్వయంగా తెలుగు నేర్పించడంలో సైతం గట్టి దన్నుగా నిలబడాలని వీరి గట్టి తలపు. వీరు రూపొందించిన బర్మీస్ - తెలుగు - బర్మీస్ నిఘంటువు ఎంతో మేలైన తోడ్పాటును అందిస్తున్నది.
_______________________
తెలుగువారే భస్మాసురులై తమకు ఒక జాతిగా గుర్తింపు ఇచ్చిన తెలుగు భాషామతల్లిని కాల్చి బూడిద చేస్తుంటే , ఈ బర్మా వీరుడు తన తల్లి వేరుని మరింత దిటవు పరచి , బర్మా తెలుగు పిల్లలకు తెలుగు నేర్పుతూ , జాతి అంతరించకుండా అలుపెరుగని పనిలో ఉన్నారు. పుట్టుకతో వృద్ధులైన పలు తెలుగువారికి, ఈ ముదిమి పైబడిన వ్యక్తి వయసును లెక్కచేయక చేస్తున్న సేవలు ఒక కనువిప్పు కాక మానవు.
______________________
బర్మా నాయుడు గా పేరుపడిన యర్రా అచ్చన్నాయుడు గారు మన తెలుగు కూటమి వేదిక పై శనివారం, 23-08-2025 నాడు, మాపులు 7 గం. లకు జరిపే రచ్చబండలో,
*”బర్మా లో తెలుగు”* అన్న ఊసు పై మాట్లాడతారు.
____________________
సమావేశంలో పాల్గొనటానికి ఎప్పటి లాగా ఈ క్రింది లంకెపై నొక్కండి.
వీడియో కాల్ లింక్:
https://meet.google.com/ste-jdoz-xbs *ఎటువంటి దాటుమాట(పాస్వర్డ్) వాడే పని లేదు.*
__________________________
తెలుగు నుడి ఊడిగంలో మీ అనుగరి(అభిమాని),
*పురాణం రామప్రసాద్ ,*
ఊరట వంౘ మరకాను(రసాయన సాంకేతిక యంత్రశాస్త్రం)
చేపలుకు : 9505255100
telugukootami.org తెలుగును బతికించుకోవాలంటే తెలుగు భాషా ప్రాధికార సంస్థ ఏర్పాటు తో పాటు 1. ప్రతి కొలువుకు తెలుగులోనే పరీక్ష పెట్టాలనీ 2. ప్రతి బడి/కళాశాలలో తెలుగును ఒక తప్పనిసరి మందల [విషయం] గా నేర్పాలని 3. ఇతర రాష్ట్రాల్లో/దేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలుగు చదివే వీలు మనం కలిగించాలని 4. అన్ని రాష్ట్రాల్లోనూ చనిపోతున్న తెలుగు మాటలను సేకరించి బతికించుకోవాలని, వాడాలని మనం జరుపుతున్న ఎసపు [ఉద్యమం] లో మీరు చురుకుగా పాల్గొనాలని విన్నపం.
==================