ఇంగ్లీషు మీడియం -తెలుగు బోధన

0 views
Skip to first unread message

Yerra Naidu

unread,
Jul 17, 2025, 11:29:33 AMJul 17
to telug...@googlegroups.com
తమాషా ఏమిటంటే చదువులు ఇంగ్లీష్ మార్చములోనట పుస్తకాలు ఇంగ్లీషు మాధ్యమంలోనే ఉంటాయట చదువు చెప్పేది మటుకు తెలుగు మాధ్యంలో చెబుతున్నారు. పరిక్షరాయుడం ఇంగ్లీషులో నట ఇదెక్కడి విచిత్రమో అర్థం కావడం లేదు. ఓ అయిదు రోజుల క్రిందట మా మనవరాలు తను ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతుంది ఏదో ఒక పాఠ్య పుస్తకం పట్టుకొని ఉన్నాది. చేతిలో ఫోను కూడా ఉంది. ఫోనులోనుండి పాఠాలు చెబుతుంటే ఆలకిస్తుంది. ఆ పాఠాలు తెలుగులో చెబుతున్నారు. చేతిలో ఉన్న పుస్తకం మేమో ఇంగ్లీషులో ఉంది. నీకు తెలుగులో చెబితే అర్థం అవుతుందా అని అడిగాను. అవుతుంది అని అన్నాది. మరి బడిలో కూడా తెలుగులో చెబుతారా ఇంగ్లీషులో చెబుతారా పాటలు అని అడిగితే తెలుగులోనే చెబుతారు ఇంగ్లీషులో అయితే మాకు అర్థం కాదు తెలుగులో కూడా గబగబా చెప్పుకుపోతుండడం వలన పూర్తిగా అర్థం కాక ఆన్లైన్లో ఉన్న పాఠాలను ఆలకించి నేర్చుకుంటున్నాము అని అంది. మరి పాఠ్యపుస్తకం తెలుగులో ఉంటే బాగుంటాదా అని అడిగితే చాలా బాగుంటాది ఇంకా బాగా అర్థం అవుతాది అని అన్నాది. ఎంత మోసం ఎంత మోసం. పేరుకి ఇంగ్లీష్ మీడియం చదువులు. పుస్తకాలు ఇంగ్లీష్ మీడియం. చెప్పేది తెలుగు మీడియం. ఇదండీ మన ఇంగ్లీష్ మీడియం చదువులు. చెప్పేది తెలుగులో రాసేది ఇంగ్లీషులో. ప్రభుత్వాలే గుడ్డి ప్రభుత్వాలు అని అనుకుంటుంటే తల్లిదండ్రులు కూడా గుడ్డోలు లాగానే ఉన్నారు. ఇంగ్లీష్ మీడియం పాఠాలు ఇంగ్లీషులో చెప్పే సేవ చెప్పేవాళ్ళకి లేదు నేర్చుకునే వాళ్ళకి అంతకన్నా లేదు. అలాంటప్పుడు పాఠ్యపుస్తకాలు తెలుగులోనే ఉంటే చెప్పే పాఠాలు మరింత తేలికగా అర్థం అవుతాయి కదా? పరీక్ష కూడా తెలుగులోనే రాస్తే ఇంకా బాగుంటుంది కదా? మనకి ఇవేవీ అక్కరలేదు ఇంగ్లీష్ మీడియం అనే పేరు ఉంటే చాలు పిల్లలు ఆ చదువులతో ఎన్ని కుస్తీలు పడుతున్నారో ఎన్ని బాధలు పడుతున్నారు ప్రభుత్వానికి లేదు కాలేజీలకు లేదు తల్లిదండ్రులు మీరేం చేస్తున్నారు. ఆ పాఠ్య పుస్తకాలు తెలుగులో ఉంటే పరీక్షలు తెలుగులో రాస్తే మీ పరువు పోతుందా మీకు నా మోసిగా ఉంటుందా? మరి పాఠాలు తెలుగులో చెబితే మీ పరువు పోదా. ఇంతటి అరాచకమైన విద్య మన రాష్ట్రంలోనే ఉన్నట్లుంది. ఇంగ్లీష్ మీడియం కాలేజీలలో తెలుగులో పాఠాలు చెప్పడం ప్రభుత్వానికి సిగ్గులేదు కాలేజీలకు సిగ్గులేదు తల్లిదండ్రులకు అంతకన్నా సిగ్గులేదు.
Reply all
Reply to author
Forward
0 new messages