పిలుపు / తెలుగు కూటమి - రచ్చబండ / 09-08-2025

2 views
Skip to first unread message

రామప్రసాద్ పురాణం

unread,
Aug 8, 2025, 12:24:33 AMAug 8
to తెలుగు మాట, Kodanda Ramaiah Parupally
ప్రియమైన నేస్తాలకు , 


*”సామాజిక , ఆర్థిక వెనుకబాటుతనానికి వెరవక తెలుగుకు వన్నె తెచ్చిన వైతాళికుడు ”*
==============
వృత్తిరీత్యా విశ్రాంత తెలుగు ఉపన్యాసకులు అయినా, ప్రవృత్తి రీత్యా తనకంటూ ఒక ప్రత్యేకమైన దారి గల కవి వీరు. వీరి కవిత్వం పలు భాషల లోనికి అనువాదం అయినా, వీరి “దూదిమేడ” (హిందీ: కపాస్ కీ అటారీ) తెలుగు విశ్వవిద్యాలయంలో బొమ్మూరు సాహిత్య పీఠం లో ఎం.ఫిల్ చదువుకు ఒక విషయంగా ఉండడం విశేషం.
_____________________
బాల్యంలో పలు తీరుల్లో తమ చదువుకు ఎదురైన అడ్డంకులు అన్నీ అధిగమించి, తనను తాను పోషించుకుంటూ ముందుకు సాగి, చలం సాహిత్యం పై విశిష్ట పరిశోధనలు చేసి, ఆచార్య పట్టా సాధించారు. పలు ప్రభుత్వ కళాశాలల్లో తెలుగు ఉపన్యాసకుడిగా పనిచేసి , విద్యార్థులకు తెలుగుపై ఆసక్తి పెంపొందేలా చేయడం వీరి ప్రత్యేకత.
_______________________
2014 లో మరల తిరిగి మొదలై పుంజుకున్న తెలంగాణ రచయితల సంఘం(తెరసం)లో వీరు చాల చురుకుగా పనిచేస్తున్నారు. పలు రచయితలకు గుర్తింపు, తెలుగు సాహిత్య ప్రచురణ మొ॥పనులు ఎన్నో చేస్తున్నారు.
______________________
పేరుపడిన తెలంగాణ కవి, సాహిత్య విమర్శకులు , పదవీ విరమణ తరువాత కూడా స్నాతకోన్నత విద్యార్థుల కోసం తెలుగు ఉపన్యాసకులుగా కొనసాగుతున్న డా.నాళేశ్వరం శంకరం గారు మన తెలుగు కూటమి వేదిక పై శనివారం, 09-08-2025 నాడు, మాపులు 7 గం. లకు జరిపే రచ్చబండలో,
*”తెలుగు కోసం తెరసం”* అన్న ఊసు పై మాట్లాడతారు.
____________________
సమావేశంలో పాల్గొనటానికి ఎప్పటి లాగా ఈ క్రింది లంకెపై నొక్కండి.
వీడియో కాల్ లింక్:
https://meet.google.com/ste-jdoz-xbs

*ఎటువంటి దాటుమాట(పాస్వర్డ్) వాడే పని లేదు.*
__________________________
తెలుగు నుడి ఊడిగంలో మీ అనుగరి(అభిమాని),
*పురాణం రామప్రసాద్ ,*
ఊరట వంౘ మరకాను(రసాయన సాంకేతిక యంత్రశాస్త్రం)
చేపలుకు : 9505255100
telugukootami.org
తెలుగును బతికించుకోవాలంటే తెలుగు భాషా ప్రాధికార సంస్థ ఏర్పాటు తో పాటు 1. ప్రతి కొలువుకు తెలుగులోనే పరీక్ష పెట్టాలనీ 2. ప్రతి బడి/కళాశాలలో తెలుగును ఒక తప్పనిసరి మందల [విషయం] గా నేర్పాలని 3. ఇతర రాష్ట్రాల్లో/దేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలుగు చదివే వీలు మనం కలిగించాలని 4. అన్ని రాష్ట్రాల్లోనూ చనిపోతున్న తెలుగు మాటలను సేకరించి బతికించుకోవాలని, వాడాలని మనం జరుపుతున్న ఎసపు [ఉద్యమం] లో మీరు చురుకుగా పాల్గొనాలని విన్నపం.
=================

 మీకు తెలిసినవారు అందరికీ పంపండి. *పల్వురు పాల్గొను పేరెన్నిక గల పేరోలగమే మన రచ్చబండ* అని చాటండి.

Reply all
Reply to author
Forward
0 new messages