పిలుపు / తెలుగు కూటమి - రచ్చబండ / 28-03-2026

2 views
Skip to first unread message

రామప్రసాద్ పురాణం

unread,
Mar 26, 2026, 1:25:23 PM (10 days ago) Mar 26
to తెలుగు మాట
ప్రియమైన నేస్తాలకు , 

*” ఏదో ఒకటి రాయనిదే పూట గడవని పత్రికా రచనల త్రివిక్రముడు ”*
__________________
తొలి నుంచి తెలుగు భాష , సంస్కృతి పట్ల , తెలుగు పత్రికారంగంపై ఎక్కువ మక్కువ ఉన్న వీరు పలు వార పత్రికలు, దినపత్రికల్లో పనిచేశారు. కథలు రాశారు. కాలమ్స్, అనువాదాలు, రేడియో టాక్స్, యూ ట్యూబ్ ఇంటర్వ్యూ లు వంటివి చేశారు.
_____________________
ఇతర భాషల ప్రభావం ఎక్కువగా ఉన్న తెలుగును కాపాడుకుంటూ, ప్రభుత్వ పాలనలో ఆంగ్ల భాష వాడకాన్ని అదుపు చేస్తూ, తెలుగు వాడకాన్ని పెంపొందించే పనుల్లో తలమునకలుగా ఉంటారు వీరు.
_______________________
గొప్ప గొప్ప సాహితీ వేత్తలతో, రచయితలతో, కవులతో, ఉన్నతాధికారులతో,రాజకీయ నాయకులతో సాన్నిహిత్యం, స్నేహం లభించడం ,తనకు ఎంతో మేలు చేసిందని, రచయితగా గత నాలుగు దశాబ్దాలుగా తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని అంటారు .
——————————————-
పలువురి రాజకీయ ప్రసంగాలు , ఆత్మకథల సంకలనకర్త అయిన వీరి రచనలలో *మహా స్వాప్నికుడు* ఎన్నదగినది.
—————————————
పేరెన్నక గల పాత్రికేయులు, ఆం.ప్ర. రాష్ట్ర అధికార భాషా సంఘ అధ్యక్షులు, *త్రివిక్రమ్ పూల గారు,*
*” అధికార భాషా సంఘ అధ్యక్షుడిగా నా బాధ్యతలు ”* అన్న అంశంపై మన తెలుగు సంఘాల ఉమ్మడి వేదికపై, శనివారం, 28-03-2026, మాపులు 7 గం. లకు జరిపే రచ్చబండలో, మాట్లాడుతారు.

కార్యక్రమంలో పాల్గొనటానికి ఎప్పటి లాగా ఈ క్రింది లంకెపై నొక్కండి.
వీడియో కాల్ లింక్:
https://meet.google.com/ste-jdoz-xbs
______________________
తెలుగు నుడి ఊడిగంలో మీ అనుగరి(అభిమాని),
*పురాణం రామప్రసాద్ ,*
ఊరట వంౘ మరకాను(రసాయన సాంకేతిక యంత్రశాస్త్రం)
చేపలుకు : 9505255100
telugukootami.org
తెలుగును బతికించుకోవాలంటే తెలుగు భాషా ప్రాధికార సంస్థ ఏర్పాటు తో పాటు 1. ప్రతి కొలువుకు తెలుగులోనే పరీక్ష పెట్టాలనీ 2. ప్రతి బడి/కళాశాలలో తెలుగును ఒక తప్పనిసరి మందల [విషయం] గా నేర్పాలని 3. ఇతర రాష్ట్రాల్లో/దేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలుగు చదివే వీలు మనం కలిగించాలని 4. అన్ని రాష్ట్రాల్లోనూ చనిపోతున్న తెలుగు మాటలను సేకరించి బతికించుకోవాలని, వాడాలని మనం జరుపుతున్న ఎసపు [ఉద్యమం] లో మీరు చురుకుగా పాల్గొనాలని విన్నపం.
======================

రామప్రసాద్ పురాణం

unread,
Mar 26, 2026, 1:29:46 PM (10 days ago) Mar 26
to తెలుగు మాట
ప్రియమైన నేస్తాలకు , 

కార్యక్రమంలో  పాల్గొనటానికి ఎప్పటి లాగా ఈ క్రింది లంకెపై నొక్కండి.
వీడియో కాల్ లింక్: 
______________________
 తెలుగు నుడి ఊడిగంలో మీ అనుగరి(అభిమాని),
*పురాణం రామప్రసాద్ ,*
Reply all
Reply to author
Forward
0 new messages