పిలుపు / తెలుగు కూటమి - రచ్చబండ / 09-05-2026

5 views
Skip to first unread message

రామప్రసాద్ పురాణం

unread,
May 7, 2026, 10:29:16 AMMay 7
to తెలుగు మాట, Dharma K
ప్రియమైన నేస్తాలకు , 

*”తెలుగు కావ్య సాహిత్యానికి పెద్ద పీట నాటి భువనవిజయం - తెలుగు భాష మనుగడకు పెట్టని కోట నేటి మన తెలుగు విజయం”*
__________________
తెలుగు భాషా సాహిత్యాలపై నిరంతర పరిశోధనలు చేస్తూ , ఫలితాలను భాషాభివృద్ధికి, పరిరక్షణకు వాడడం వీరి నిత్యకృత్యం. జాతీయ , అంతర్జాతీయ పరిశోధక పత్రికల(జర్నల్స్) లో 95కి పైగా పరిశోధన వ్యాసాలు ప్రచురించారు. ఇంటర్మీడియట్ విద్యలో రాష్ట్ర ప్రభుత్వ తెలుగు పుస్తకాలకు రచయితగా , సంపాదకుడిగా ఉన్నారు.
_____________________
జిల్లా , రాష్ట్ర స్థాయిల్లో పలు మార్లు ఉత్తమ బోధకులుగా పురస్కారాలు అందుకున్నారు. విద్యార్థుల్లో తెలుగు పట్ల ఆసక్తి, మమకారం పెంపొందించే దిశలో చురుకుగా పనిచేసే వీరు, వందకు పైగా అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయి తెలుగు భాషా సదస్సుల్లో పాల్గొని తెలుగు భాష పరిరక్షణకై పత్రాలు సమర్పించి , పలు పూనికలకు దన్నుగా నిలిచారు.
_______________________
తమ వ్యాసాల సంకలనం, “వ్యాస విపంచి,” గా ప్రచురించిన వీరి ఇతర రచనలు, “శత జయంతి సాహితీమూర్తులు,” “మన సంప్రదాయ తెలుగు సాహిత్యం - పర్యాలోచనం,” “తెలుగు భాషా శాస్త్రం - మౌలిక భావనలు,” “తెలుగు బోధన పద్ధతులు,” “నేటి తెలుగు సినిమా సాహిత్యం - విభిన్న ధోరణులు,” మొదలైనవి.
_________________________
కవి, రచయిత , విద్యావేత్త, పురికొల్పరి, తెలుగు భాష పరిరక్షణ ఉద్యమాలకు నడుం కట్టి సాగుతున్న హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ సహ ఆచార్యులు (అసోసియేట్ ప్రొఫెసర్ )
డా॥ పి. విజయకుమార్ గారు, *”తెలుగు భాష - అభివృద్ధి,పరిరక్షణ”* అన్న అంశంపై మన తెలుగు సంఘాల ఉమ్మడి వేదికపై, శనివారం,
09-05-2026, మాపులు 7 గం. లకు జరిపే రచ్చబండలో, మాట్లాడుతారు.

కార్యక్రమంలో పాల్గొనటానికి ఎప్పటి లాగా ఈ క్రింది లంకెపై నొక్కండి.
వీడియో కాల్ లింక్:
https://meet.google.com/ste-jdoz-xbs
______________________
తెలుగు నుడి ఊడిగంలో మీ అనుగరి(అభిమాని),
*పురాణం రామప్రసాద్ ,*
ఊరట వంౘ మరకాను(రసాయన సాంకేతిక యంత్రశాస్త్రం)
చేపలుకు : 9505255100
telugukootami.org
తెలుగును బతికించుకోవాలంటే తెలుగు భాషా ప్రాధికార సంస్థ ఏర్పాటు తో పాటు 1. ప్రతి కొలువుకు తెలుగులోనే పరీక్ష పెట్టాలనీ 2. ప్రతి బడి/కళాశాలలో తెలుగును ఒక తప్పనిసరి మందల [విషయం] గా నేర్పాలని 3. ఇతర రాష్ట్రాల్లో/దేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలుగు చదివే వీలు మనం కలిగించాలని 4. అన్ని రాష్ట్రాల్లోనూ చనిపోతున్న తెలుగు మాటలను సేకరించి బతికించుకోవాలని, వాడాలని మనం జరుపుతున్న ఎసపు [ఉద్యమం] లో మీరు చురుకుగా పాల్గొనాలని విన్నపం.
======================

Reply all
Reply to author
Forward
0 new messages