పిలుపు / తెలుగు కూటమి - రచ్చబండ / 14-02-2026

0 views
Skip to first unread message

రామప్రసాద్ పురాణం

unread,
Feb 11, 2026, 7:17:43 PMFeb 11
to తెలుగు మాట
ప్రియమైన నేస్తాలకు, 

*”తెలుగు పరిరక్షణలో సాంకేతిక చర్యల ఒరవడి - తీయని తెలుగు పలుకుల పరిరక్షణలో తొట్టెంపూడి!*
__________________
ఎల్లలు లేనిది మన తెలుగు భాష అని చెబుతూ, తెలుగు సంస్కృతి , సంప్రదాయాల పరిరక్షణతో పాటు వాటిని నేటి తరానికి తెలియజేసే పలు వేదికలకు జర్మనీ దేశం నుండి గట్టి తోడ్పాటు అందిస్తుంటారు వీరు. 
__________________
 పలు అచ్చ తెలుగు పలుకులు సంస్కృత పదాల వెల్లువలో కొట్టుకుపోయాయి. సంస్కృతియే పునాదిగా ఉన్న సమాజ అస్తిత్వానికి భాష కీలకం. ఏ భాషలో అయినా ఒక పదం పుట్టి సమాజంలో దాని మనుగడకై పడే శ్రమ భాషాశాస్త్రవేత్తలకే తెలుస్తుంది అంటారు వీరు. 
____________________
తెలుగు భాషా భాగాల పై ఆంగ్లంలో వీరు రాసిన *”పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ తెలుగు”* జర్మనీ దేశంలో ప్రచురింపబడింది. తరచుగా వాడే తెలుగు పదాలపై లోతుగా విశ్లేషణ చేసి *”తెలుగు ఫ్రీక్వెన్సీ డిక్షనరీ”* అన్న పుస్తకాన్ని కూడా  వెలువరించారు. 
______________________
కనుమరుగైన పలు తెలుగు పలుకులు ప్రాచీన కావ్యాల్లో ఉన్నాయని, వాటిని వెలికి తీసే పనిని పాశ్చాత్యులే చేస్తున్నారని, సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని అందరికీ అందుబాటులోకి తేవచ్చన్న గట్టి నమ్మకమే వీరి కృషికి మూలం. 
—————————————
పలు పరిశోధక పత్రాలు విడుదల చేసిన నిరంతర అన్వేషి, జర్మనీ దేశపు హీడిల్ బర్గ్ విశ్వవిద్యాలయ ఆచార్యులు, సాంకేతికతతో భాషకు పట్టం కడుతున్న *డా. శ్రీ గణేశ్ తొట్టెంపూడి* గారు, *” డిజిటలీకరణ - ఒక సామాజిక అవసరం”* అన్న అంశంపై  మన   తెలుగు సంఘాల ఉమ్మడి వేదికపై, శనివారం, 14-02-2026, మాపులు 7 గం. లకు జరిపే రచ్చబండలో, మాట్లాడుతారు. 

కార్యక్రమంలో  పాల్గొనటానికి ఎప్పటి లాగా ఈ క్రింది లంకెపై నొక్కండి.
వీడియో కాల్ లింక్: 
______________________
 తెలుగు నుడి ఊడిగంలో మీ అనుగరి(అభిమాని),
*పురాణం రామప్రసాద్ ,*
ఊరట వంౘ మరకాను(రసాయన సాంకేతిక యంత్రశాస్త్రం)
చేపలుకు : 9505255100
తెలుగును బతికించుకోవాలంటే తెలుగు భాషా ప్రాధికార సంస్థ ఏర్పాటు తో పాటు 1. ప్రతి కొలువుకు  తెలుగులోనే పరీక్ష పెట్టాలనీ  2. ప్రతి బడి/కళాశాలలో తెలుగును ఒక తప్పనిసరి మందల [విషయం] గా నేర్పాలని 3. ఇతర రాష్ట్రాల్లో/దేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలుగు చదివే వీలు మనం కలిగించాలని 4. అన్ని రాష్ట్రాల్లోనూ చనిపోతున్న  తెలుగు మాటలను సేకరించి బతికించుకోవాలని, వాడాలని మనం జరుపుతున్న  ఎసపు [ఉద్యమం] లో మీరు చురుకుగా పాల్గొనాలని విన్నపం.
======================

Reply all
Reply to author
Forward
0 new messages