2 views
Skip to first unread message

రామప్రసాద్ పురాణం

unread,
Jul 25, 2025, 8:29:43 AMJul 25
to తెలుగు మాట
ప్రియమైన నేస్తాలకు , 

*”తెలుగు బాగు కోసం బ్లాగులతో మెరుగైన పని తీరు - వికీపీడియాలో విలువైన తెలుగు ఊసులు నింపే వీవెన్ గారు”*
==============
తెలుగు, అంతర్జాలం , కంప్యూటర్ల త్రివేణీ సంగమంలో ఇష్టంతో మునకలేసే సాఫ్ట్ వేర్ ఔత్సాహికులు వీరు. తెలుగు బ్లాగుల వ్యాప్తి కై వీరు రూపొందించిన ‘లేఖిని’ (తెలుగు టైపింగ్ పరికరం),కూడలి (తెలుగు బ్లాగుల కలివిడి), మొదలైనవి మేలైన ప్రేరణలు.
_____________________
పలు సాఫ్ట్ వేర్ ఉపకరణాలను తెలుగుకు అనువుగా తీసుకురావడంలో ఎల్లప్పుడూ ముందుంటారు. ఇటీవల ఎగసి పడుతున్న కృత్రిమ మేధ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడి, “తెలుగు కు ఒక మహా నుడి నమూనా (లార్జ్ లాంగ్వేజ్ మోడల్) “ రూపకల్పనలో సాగుతున్న పనుల్లో కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
______________________
వికీపీడియా, ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ వంటి స్వేచ్ఛా విజ్ఞాన వనరులకు తన గట్టి చేయూత కొనసాగిస్తున్న వీవెన్ గారు మన తెలుగు కూటమి వేదిక పై శనివారం,
26-07-2025 నాడు, మాపులు 7 గం. లకు జరిపే రచ్చబండలో,
*”భాషోద్యమం గాడి తప్పిందా ? గతి తప్పిందా?”* అన్న ఊసు పై మాట్లాడతారు.
____________________
సమావేశంలో పాల్గొనటానికి ఎప్పటి లాగా ఈ క్రింది లంకెపై నొక్కండి.
వీడియో కాల్ లింక్:
https://meet.google.com/ste-jdoz-xbs

*ఎటువంటి దాటుమాట(పాస్వర్డ్) వాడే పని లేదు.*
__________________________
తెలుగు నుడి ఊడిగంలో మీ అనుగరి(అభిమాని),
*పురాణం రామప్రసాద్ ,*
ఊరట వంౘ మరకాను(రసాయన సాంకేతిక యంత్రశాస్త్రం)
చేపలుకు : 9505255100
telugukootami.org
తెలుగును బతికించుకోవాలంటే తెలుగు భాషా ప్రాధికార సంస్థ ఏర్పాటు తో పాటు 1. ప్రతి కొలువుకు తెలుగులోనే పరీక్ష పెట్టాలనీ 2. ప్రతి బడి/కళాశాలలో తెలుగును ఒక తప్పనిసరి మందల [విషయం] గా నేర్పాలని 3. ఇతర రాష్ట్రాల్లో/దేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలుగు చదివే వీలు మనం కలిగించాలని 4. అన్ని రాష్ట్రాల్లోనూ చనిపోతున్న తెలుగు మాటలను సేకరించి బతికించుకోవాలని, వాడాలని మనం జరుపుతున్న ఎసపు [ఉద్యమం] లో మీరు చురుకుగా పాల్గొనాలని విన్నపం.
==================

Reply all
Reply to author
Forward
0 new messages