తేటగీతి
*శ్రీ శుభకరమగు తెలుగు సిరుల భాష*
*తరతరాల చరితమున్న తల్లి భాష*
*వేన వేల యేండ్ల నుడుల వెలయు భాష*
*కమ్మనైన తెలుగు మన అమ్మ భాష*
*అమ్మ లాలి పాటలవోలె హాయిగొల్పి*
*తేట తేనియ పలుకుల తీపి గలిగి*
*మనసు పరవశించెడి మన మధుర భాష*
*కమ్మనైన మన తెలుగు అమ్మనుడిర*
*రాఘవ మాస్టారు కేదారి*
జాతీయ తెలుగు పరిరక్షణ సమితి అధ్యక్షులు