*” అడుగడుగున భాషాసంస్కృతులకు వైభవాలు - అడుగిడిన ప్రతి చోట తెలుగు పూలవానలు!”*
_________________________________
నాలుగున్నర దశాబ్దాల చరిత్ర, అనుభవం వీరివి, పత్రికారంగంలో , న్యాయవాద వృత్తిలో , సాంస్కృతిక రంగంలో , విమర్శనాత్మక తెలుగు సాహిత్య రచనలో.
_________________________
అంతర్జాతీయ , జాతీయ , రాష్ట్ర రాజకీయాలు, న్యాయ వ్యవస్థ మొదలైన వాటిపై నైపుణ్యంతో , లోతైన అవగాహనతో ప్రసార మాధ్యమాల్లో విశ్లేషణలు చేయడం , వార్తా కథనాలు వెలువరించడం వీరికి కొట్టిన పిండి.
_________________________
దేశవిదేశాల్లో పలు సాహిత్య సంస్కృతి సేవలు చేసి,
పలు పురస్కారాలు పొంది మన్ననకు పాత్రులైన వీరు తెలుగు భాషా సౌందర్యానికి , మన్నికకు , మనుగడకు, భాషావేత్తలు, భాషాభిమానుల మధ్య ఒక బలీయమైన , నిలకడ గల ముడి ఉండి తీరాలని భావిస్తారు.
__________________________
సీనియర్ జర్నలిస్ట్, రచయిత , మీడియా విశ్లేషకులు,న్యాయవాది, ఆం.ప్ర. అధికార భాషా సంఘం పూర్వ అధ్యక్షులు అయిన డా.పి.విజయ బాబు గారు, *” తరిగిపోతున్న తెలుగు మాటలు”* అన్న అంశంపై మన తెలుగు సంఘాల ఉమ్మడి వేదికపై, శనివారం, 27-12-2025, మాపులు 7 గం. లకు జరిపే రచ్చబండలో, మాట్లాడుతారు.
కార్యక్రమంలో పాల్గొనటానికి ఎప్పటి లాగా ఈ క్రింది లంకెపై నొక్కండి.
వీడియో కాల్ లింక్:
https://meet.google.com/ste-jdoz-xbs _____________________________
తెలుగు నుడి ఊడిగంలో మీ అనుగరి(అభిమాని),
*పురాణం రామప్రసాద్ ,*
ఊరట వంౘ మరకాను(రసాయన సాంకేతిక యంత్రశాస్త్రం)
చేపలుకు : 9505255100
telugukootami.org తెలుగును బతికించుకోవాలంటే తెలుగు భాషా ప్రాధికార సంస్థ ఏర్పాటు తో పాటు 1. ప్రతి కొలువుకు తెలుగులోనే పరీక్ష పెట్టాలనీ 2. ప్రతి బడి/కళాశాలలో తెలుగును ఒక తప్పనిసరి మందల [విషయం] గా నేర్పాలని 3. ఇతర రాష్ట్రాల్లో/దేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలుగు చదివే వీలు మనం కలిగించాలని 4. అన్ని రాష్ట్రాల్లోనూ చనిపోతున్న తెలుగు మాటలను సేకరించి బతికించుకోవాలని, వాడాలని మనం జరుపుతున్న ఎసపు [ఉద్యమం] లో మీరు చురుకుగా పాల్గొనాలని విన్నపం.
======================