తేది : 24 జులై 2025
గౌరవనీయులు కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి
విషయం : కలెక్టర్ గారికి అభినందనలు
ప్రజల భాషలో పరిపాలన జరగాలి. అందుకు సర్వజనులు తమ తమ స్థాయిల్లో పనిచేయాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లటానికి గుడిలో, బడిలో, ఏలుబడిలో, పలుకుబడిలో, న్యాయస్థానాలలో స్థానిక భాషను ఉపయోగించటం చాలా అవసరం.
ఈ సందర్భంగా పరిపాలనలో తెలుగు భాష అమలుజేయడానికి, తెలుగు భాష ద్వారా ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పడానికి మీరు చేస్తున్న కృషిని మరియు ఎక్స్ వేదిక లో మీరు తరచూ మీ కార్యక్రమాలు పంచుకుంటున్న తీరు కూడా ప్రజలు హర్షిస్తున్నారు.
తెలుగు భాషను కాపాడుకునేందుకు ఒక ఉద్యమంగా పనిచేస్తున్న పలు సంస్థల్లో “ తెలుగు కూటమి” సంస్థ ముందున్నది. తెలుగు భాషా ఉద్యమం ప్రజల్లోకి తీసుకువెళ్ళేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పలు కార్యక్రమాలు ఈ సంస్థ నిర్వహిస్తున్నది .
వేలాదిమంది తెలుగు భాషా ప్రియుల తరఫున మీరు చేస్తున్న కృషిని తెలుగు కూటమి నుంచి అభినందిస్తున్నాము .
జిడుగు రవీంద్రనాథ్
తెలుగు కూటమి కార్యదర్శి
విజయవాడ
చేపలుకు :9440801883