*🙏పద్య మనిన....*
🌹🌹🌹🌹🌹🌹🌹
*తేటగీతి*
*శ్రీకరమగు పద్యము తెల్గు సిరుల వాణి*
*తెలుగు సాహితీ వీధుల దివ్య రాణి*
*పద్యమనిన తెల్గు కవుల వలపు జాణ*
*భక్తి రక్తి శక్తుల భావ భవ్య లహరి*
*పద్యమెపుడు చదివినను హృద్యముగను*
*ప్రజకు మంచి పెంచెడి రీతి వ్రాయ వలయు*
*ప్రజల వాడుక భాషనే వాడవలయు*
*జనులకర్థమౌ రీతిగ చాట వలయు*
*చిన్నచిన్న మాటలతోడ వన్నె గలిగి*
*గొప్ప భావన చక్కగా చెప్పవలయు*
*నచ్చి పద్యాలు జనులెల్ల మెచ్చవలయు*
*నపుడె కవిగారి మనసుకు హాయి గలుగు*
సహజ కవి
*రాఘవ మాస్టారు కేదారి*
జాతీయ తెలుగు పరిరక్షణ సమితి అధ్యక్షులు