తెలుగు మాతృ భాష కాని వాళ్ళకు కూడా కేవలం 10 రోజులలో/గంటలలో ( రోజూ ఒక గంట చొప్పున) అత్యంత సులభంగా తెలుగు చదవటం నేర్పించాను 2017 మే నెలలో, ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీ, జనక్ పూరి శాఖ, న్యూ ఢిల్లీలో! రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాథమిక స్థాయిలో తెలుగు బోధన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలలోనే కాదు, ప్రతిష్టాత్మక ప్రైవేట్, కార్పొరేట్, ఇంటర్నేషనల్ స్కూల్స్ లో కూడా 3 విద్యా సంవత్సరాలు ఎంతో కష్టపడి నేర్పిస్తున్నా, విద్యార్థులు కూడా కష్టపడుతున్నా ప్రస్తుతం 10వ తరగతి చదివే విద్యార్థులలో 15% నుంచి 60% తమ పేరు తాము తెలుగులో రాయలేక పోతున్నారు అనేది నిజం.
ఒక తెలుగు టీచర్ తన సర్వీస్ లో కనీసం 20 వేల మంది విద్యార్థులకు చదువు నేర్పుతారు. ఒకే ఒక్క విద్యా సంవత్సరంలో హోం వర్క్ ఇవ్వకుండా తెలుగు చదవటం, రాయటం అత్యంత సులభంగా నేర్పించ వచ్చు. అందుకే ఆదివారాలు, శలవు దినాల్లో రెండు గంటల పాటు తెలుగు రాష్ట్రాల్లో ప్రాథమిక స్థాయిలో తెలుగు బోధించే ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, కార్పొరేట్, ఇంటర్నేషనల్ స్కూల్స్ లో టీచర్లకు రెండు గంటల పాటు ట్రైనింగ్ ఉచితంగా ఇవ్వాలని అనుకుంటున్నాను. నాకు కేవలం రవాణా వసతి భోజన ఖర్చులు సమకూర్చితే చాలు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పాత జిల్లా కేంద్రాలలో తెలుగు కోసం మీడియా సహకారంతో ఏదైనా స్కూల్ లో ఒక పెద్ద హాలు ఉంటే చాలు. TANA ఈ విషయంలో సహాయ, సహకారాలు అందించాలని మనవి.
నేను రిటైర్డ్ పోస్టల్ అఫిషియల్ ని! నేను ఉండేది హైద్రాబాద్!
SHAIK BADE SAHEB
Cell : 00919849921322