*”ఖండాలు దాటిన తరగని సృజనల హాస్యబ్రహ్మ - ఎల్లలెరుగని సేవలతో తెలుగు మనసులలో నిలిచిన చెరగని బొమ్మ”*
_____________________
తెలుగు భాష , సాహిత్యాలను పరిరక్షించడానికి వీరు అమెరికాలో స్థాపించిన ఒక లాభాపేక్ష లేని సంస్థ, *వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా.* ఇది పలు సామాజిక సేవలు అందిస్తున్న *వేగేశ్న ఫౌండేషన్ , హైదరాబాద్,* కు , పలు గ్రామీణ మంచినీటి పథకాలకు , కాకినాడ లోని పి ఆర్ కళాశాల , జె ఎన్ టి యు కళాశాలలకు గట్టి తోడ్పాటును ఇస్తున్నది.
_____________________
తెలుగులో పలు కథలు , వ్యాసాలు, హాస్యనాటికలు, 25 పైగా నాటకాలు రచించారు . నాటకరంగంలో నటనతో పాటు, దర్శకత్వం కూడా చేసిన వీరు, టీ వీ ధారావాహికలో కూడా నటించారు. 2013 లో “లోక్ నాయక్ పురస్కారం” తో పాటు పలు ప్రసిద్ధ పురస్కారాలు అందుకున్నారు.
_____________________
అమెరికా (డయాస్పోరా) కథానిక 19 సంకలనాలతో పాటు 138 పుస్తకాలు ప్రచురించారు. అందులో పారుపల్లి వారి *”తెలుగే గొప్ప భాష - కానీ…”* కూడా ఒకటి.
______________________
అమెరికాలోని తొలి తెలుగు పత్రికలలో ఒకటైన “మధురవాణి” ని 1976లోనే స్థాపించి 25 సం.లు నడిపారు. తెలుగువారి మనసులను చూరగొన్న *అమెరికామెడి కథలు* ప్రచురింపబడిన అలనాటి ఇంటింటి మాసపత్రిక *రచన* కు వీరు గట్టి దన్ను. *అమెరికాకమ్మ కబుర్లు* మరొక విశేష రచన.
______________________
అత్యున్నత స్థాయి సాంకేతిక , పారిశ్రామిక రంగాలలో
మూడు దశాబ్దాలకు పైబడి అనుభవం గడించిన వీరు , *హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి* ని
స్థాపించారు. పలు ఇతర అమెరికా తెలుగు సంస్థల స్థాపనలో వీరి కీలక పాత్ర ఎన్నదగినది.
______________________
*అమెరికాలో ‘కథా వ్యాసం’ సాహిత్య ప్రక్రియకు ఆద్యులు, హ్యూస్టన్(టెక్సస్) - అమెరికా దేశ నివాసి, డా॥వంగూరి చిట్టెన్ రాజు గారు, *”తెలుగు మనుగడకు చేయవలసిన నాలుగు…”* అన్న అంశంపై మన తెలుగు సంఘాల ఉమ్మడి వేదికపై, శనివారం, 23-05-2026, మాపులు 7 గం. లకు జరిపే రచ్చబండలో, మాట్లాడుతారు.
కార్యక్రమంలో పాల్గొనటానికి ఎప్పటి లాగా ఈ క్రింది లంకెపై నొక్కండి.
వీడియో కాల్ లింక్:
https://meet.google.com/ste-jdoz-xbs ______________________
తెలుగు నుడి ఊడిగంలో మీ అనుగరి(అభిమాని),
*పురాణం రామప్రసాద్ ,*
ఊరట వంౘ మరకాను(రసాయన సాంకేతిక యంత్రశాస్త్రం)
చేపలుకు : 9505255100
telugukootami.org తెలుగును బతికించుకోవాలంటే తెలుగు భాషా ప్రాధికార సంస్థ ఏర్పాటు తో పాటు 1. ప్రతి కొలువుకు తెలుగులోనే పరీక్ష పెట్టాలనీ 2. ప్రతి బడి/కళాశాలలో తెలుగును ఒక తప్పనిసరి మందల [విషయం] గా నేర్పాలని 3. ఇతర రాష్ట్రాల్లో/దేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలుగు చదివే వీలు మనం కలిగించాలని 4. అన్ని రాష్ట్రాల్లోనూ చనిపోతున్న తెలుగు మాటలను సేకరించి బతికించుకోవాలని, వాడాలని మనం జరుపుతున్న ఎసపు [ఉద్యమం] లో మీరు చురుకుగా పాల్గొనాలని విన్నపం.
======================