పిలుపు / తెలుగు కూటమి - రచ్చబండ / 27-09-2025

2 views
Skip to first unread message

రామప్రసాద్ పురాణం

unread,
Sep 25, 2025, 7:32:18 AM (7 days ago) Sep 25
to తెలుగు మాట, Kodanda Ramaiah Parupally
ప్రియమైన నేస్తాలకు, 

*”రంగోయి గ్రామీణుడికి ఆర్థికశాస్త్ర  బోధన వృత్తి - కళలు , సంస్కృతి ప్రభల  ప్రసరణ ప్రవృత్తి  ”*
              ==============
ప్రపంచీకరణ నేపథ్యంలో , నేటి తెలుగు సమాజం , ఆంగ్లంపై వ్యామోహంతో , తెలుగు పై చిన్నచూపు చూడడం తగదని వీరు నొక్కి చెబుతారు. తెలుగు జాతి మనుగడకు , తెలుగు భాష, సంస్కృతులకు  ప్రతీకలైన  జానపద కళలను కాపాడుకుంటూ, భావి తరాలకు తెలుగు ను అందజేయవలసిన బాధ్యత ప్రజలు , ప్రభుత్వము రెంటి పై ఉన్నదని చాటి చెబుతారు. 
________________________
 తోలుబొమ్మలాట , ఒగ్గు కథలు , తప్పెట గుళ్ళు మొదలైన వందలాది తెలుగు జానపద కళారూపాలను , కళాకారులను  తెలుగు సమాజానికి చేరువ చేయడంలో అలుపెరుగని కృషి చేయడంలో వీరి వలె మరొకరు లేరు అని చెప్పుకోవచ్చు.
——————————————-
పాఠశాల విద్య తెలుగు మాధ్యమంలో ఉండి తీరాలని, ఇది తెలుగు నుడి , సంస్కృతుల మనుగడ, పెంపులకు కీలకమని పలు భాషోద్యమ వేదికలపై ఎలుగెత్తి చాటుతున్నారు. 
_____________________
తెలుగు జానపద సాహిత్య పరిషత్ స్వర్ణోత్సవ ప్రత్యేక సంచికలో వీరు రాసిన *గై(గౌ)రమ్మ పాటలు (ఉత్తరాంధ్ర, రాయలసీమ, తెలంగాణ) ప్రాంతాల తులనాత్మక పరిశీలన* వ్యాసం కొనియాడదగినది. 

ఆంధ్ర , ఒడిశా సరిహద్దు జిల్లాలోని ఊరికాపరిగా ఉన్న *దండాసి కులస్థుల వృత్తి నేపథ్యంలో వీరు రాసిన “చంద్రయ్య కథ”*, తెలంగాణా భాష , సాంస్కృతిక శాఖ వారి “ముళ్ళ చినుకులు” దళిత కథాసంకలనం లో చోటు చేసుకోవడం ముదావహం. 
______________________
*గిడుగు రామమూర్తి  తెలుగు భాష, జానపద కళాపీఠం, విజయనగరం- వ్యవస్థాపక అధ్యక్షులు బద్రి కూర్మారావు గారు* మన తెలుగు కూటమి వేదిక పై శనివారం, 
27-09-2025 నాడు, మాపులు 7 గం. లకు జరిపే రచ్చబండలో,
 *” తెలుగు సంస్కృతి , జానపద కళల పరిరక్షణ“*  అన్న ఊసు పై మాట్లాడతారు.  
____________________
సమావేశంలో  పాల్గొనటానికి ఎప్పటి లాగా ఈ క్రింది లంకెపై నొక్కండి. 
వీడియో కాల్ లింక్: 

*ఎటువంటి దాటుమాట(పాస్వర్డ్) వాడే పని లేదు.*
__________________________
 తెలుగు నుడి ఊడిగంలో మీ అనుగరి(అభిమాని),
*పురాణం రామప్రసాద్ ,*
ఊరట వంౘ మరకాను(రసాయన సాంకేతిక యంత్రశాస్త్రం)
చేపలుకు : 9505255100
తెలుగును బతికించుకోవాలంటే తెలుగు భాషా ప్రాధికార సంస్థ ఏర్పాటు తో పాటు 1. ప్రతి కొలువుకు  తెలుగులోనే పరీక్ష పెట్టాలనీ  2. ప్రతి బడి/కళాశాలలో తెలుగును ఒక తప్పనిసరి మందల [విషయం] గా నేర్పాలని 3. ఇతర రాష్ట్రాల్లో/దేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలుగు చదివే వీలు మనం కలిగించాలని 4. అన్ని రాష్ట్రాల్లోనూ చనిపోతున్న  తెలుగు మాటలను సేకరించి బతికించుకోవాలని, వాడాలని మనం జరుపుతున్న  ఎసపు [ఉద్యమం] లో మీరు చురుకుగా పాల్గొనాలని విన్నపం.
          ==================

Reply all
Reply to author
Forward
0 new messages