తేటగీతి
(33)
తెలుగు సాహితీ లోకాన వెలుగు లొలుకు
తెలుగు గొప్పని అప్పయ్య దీక్షితులును
చెప్ప తెలుసుకొనర భాష గొప్పతనము
*కమ్మనైన మన తెలుగు అమ్మనుడిర*
(34)
కన్నడ విభుడు మెచ్చిన కమ్ర భాష
సుబ్రహ్మణ్య భారతి మెచ్చు సొబగు బాష
బ్రౌను దొర మెచ్చి మురిసిన జాను భాష
*కమ్మనైన తెలుగు మన అమ్మనుడిర*
*రాఘవ మాస్టారు కేదారి*