పిలుపు / తెలుగు కూటమి - రచ్చబండ / 13-09-2025

5 views
Skip to first unread message

రామప్రసాద్ పురాణం

unread,
Sep 12, 2025, 12:16:18 AMSep 12
to తెలుగు మాట, Kodanda Ramaiah Parupally
ప్రియమైన నేస్తాలకు, 

*” అమెరికా దేశపు దక్షిణ భాగంలో  సాగుతున్న తెలుగు సేవల  ఉరవడి - డాలర్ల వర్షంలో డాబులేని డాలస్ ప్రవాసి ఊరిమిండి”*
              ==============
తెలుగు మనుగడ పెంపులకు సాగే పనులకు  పరస్పరం కలిసి పాల్గొనే తీరుతెన్నులకు దిక్సూచి  వీరు. దేశం కాని దేశంలో తెలుగు భాషాసంస్కృతుల పచ్చదనం కోసం పలు ఫలవంతమైన పూనికలకు దన్ను వీరు. 
_____________________
ప్రతి ఏటా డిశంబర్ మాసంలో తాను పుట్టిన గడ్డ భారతదేశాన్ని సందర్శించి, పలు స్థానిక విద్యాసంస్థల్లో విద్యార్థులకు అవసరమైన ఆత్మవిశ్వాసం, చదువు సులువుగా నేర్వడానికి మెళకువలు , వ్యక్తిత్వ వికాసం మొదలైన వాటి మీద ప్రసంగించి , ప్రోత్సహిస్తున్నారు. 
______________________
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సస్ - టి ఏ ఎన్ టిఇఎక్స్) పూర్వ (2015) అధ్యక్షులు, తెలుగు కోసం మేటిగా పాటుపడుతున్న డా॥ఊరిమిండి నరసింహారెడ్డి   గారు మన తెలుగు కూటమి వేదిక పై శనివారం, 
13-09-2025 నాడు, మాపులు 7 గం. లకు జరిపే రచ్చబండలో,
 *”మన తెలుగు సిరిసంపదలు - వైవిధ్య భాషాప్రయోగాలు”*  అన్న ఊసు పై మాట్లాడతారు.  
____________________
సమావేశంలో  పాల్గొనటానికి ఎప్పటి లాగా ఈ క్రింది లంకెపై నొక్కండి. 
వీడియో కాల్ లింక్: 

*ఎటువంటి దాటుమాట(పాస్వర్డ్) వాడే పని లేదు.*
__________________________
 తెలుగు నుడి ఊడిగంలో మీ అనుగరి(అభిమాని),
*పురాణం రామప్రసాద్ ,*
ఊరట వంౘ మరకాను(రసాయన సాంకేతిక యంత్రశాస్త్రం)
చేపలుకు : 9505255100
తెలుగును బతికించుకోవాలంటే తెలుగు భాషా ప్రాధికార సంస్థ ఏర్పాటు తో పాటు 1. ప్రతి కొలువుకు  తెలుగులోనే పరీక్ష పెట్టాలనీ  2. ప్రతి బడి/కళాశాలలో తెలుగును ఒక తప్పనిసరి మందల [విషయం] గా నేర్పాలని 3. ఇతర రాష్ట్రాల్లో/దేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలుగు చదివే వీలు మనం కలిగించాలని 4. అన్ని రాష్ట్రాల్లోనూ చనిపోతున్న  తెలుగు మాటలను సేకరించి బతికించుకోవాలని, వాడాలని మనం జరుపుతున్న  ఎసపు [ఉద్యమం] లో మీరు చురుకుగా పాల్గొనాలని విన్నపం.
          ==================

రామప్రసాద్ పురాణం

unread,
Sep 12, 2025, 12:37:16 AMSep 12
to తెలుగు మాట, Kodanda Ramaiah Parupally
ప్రియమైన నేస్తాలకు 
సమావేశంలో  పాల్గొనటానికి ఎప్పటి లాగా ఈ క్రింది లంకెపై నొక్కండి. 
వీడియో కాల్ లింక్: 

*ఎటువంటి దాటుమాట(పాస్వర్డ్) వాడే పని లేదు.*
__________________________
 మీకు తెలిసినవారు అందరికీ పంపండి. *పల్వురు పాల్గొను పేరెన్నిక గల  పేరోలగమే మన రచ్చబండ* అని చాటండి.

 తెలుగు నుడి ఊడిగంలో మీ అనుగరి(అభిమాని),
*పురాణం రామప్రసాద్*
Reply all
Reply to author
Forward
0 new messages