*”ప్రాచీన గిరిజన సంగీత వాద్యాల సేకరణ మహాయజ్ఞ సోమయాజి ”*
__________________
మన సమాజపు మనుగడకు కనుమరుగవుతున్న మూల సంగీతాన్ని పదిలం చేయడమే కీలకం అంటారు వీరు.
ఫిబ్రవరి 2020లో గుంటూరులో నాలుగు దినాలపాటు “ఆదిధ్వని” పేరుతో నిర్వహించిన గిరిజన జానపద సంగీత వాద్య ప్రదర్శన వీరి గట్టి పూనికకు తార్కాణం.
_____________________
భాషా సాహిత్యాలను పరిరక్షించుకోవలసిన బాధ్యత
రచయితలపై ఉందని అంటారు ఈ జానపద సాహిత్య మౌలిక పరిశోధకులవారు.
_______________________
అట్టడుగు ఉపకులాల నుండి , నాలుగు దశాబ్దాలు పాటుపడి సేకరించిన సామాజిక సాంస్కృతిక కళాఖండాల ప్రదర్శన , ఫిబ్రవరి 2017 లో హైదరాబాద్ లో నిర్వహించడం ఎన్నదగినది.
_________________________
ప్రజాకళా రూపాలు, పొది (సంభాషణలు-అక్షర చిత్రాలు), జానపద చారిత్రక గేయాలు, తొవ్వ ముచ్చట్లు (రెండు భాగాలు) మొదలైన వీరి రచనలు వీరి సామాజిక సాంస్కృతిక ఆసక్తిని, పరిశోధక ప్రవృత్తిని , చైతన్య దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయి.
——————————————-
పలు చదువుల బడులలో బోధకులు, ఉమ్మడి ఆం.ప్ర. రాష్ట్ర ప్రాచ్య వ్రాతప్రతులు , పరిశోధన విభాగపు పూర్వ సంచాలకులు అయిన విశ్రాంత ఆచార్యులు జయధీర్ తిరుమలరావు గారు, *” ‘ఆద్య కళ’ మ్యూజియం - సేకరణ, అనుభవాలు”*
అన్న అంశంపై మన తెలుగు సంఘాల ఉమ్మడి వేదికపై, శనివారం, 25-04-2026, మాపులు 7 గం. లకు జరిపే రచ్చబండలో, మాట్లాడుతారు.
కార్యక్రమంలో పాల్గొనటానికి ఎప్పటి లాగా ఈ క్రింది లంకెపై నొక్కండి.
వీడియో కాల్ లింక్:
https://meet.google.com/ste-jdoz-xbs ______________________
తెలుగు నుడి ఊడిగంలో మీ అనుగరి(అభిమాని),
*పురాణం రామప్రసాద్ ,*
ఊరట వంౘ మరకాను(రసాయన సాంకేతిక యంత్రశాస్త్రం)
చేపలుకు : 9505255100
telugukootami.org తెలుగును బతికించుకోవాలంటే తెలుగు భాషా ప్రాధికార సంస్థ ఏర్పాటు తో పాటు 1. ప్రతి కొలువుకు తెలుగులోనే పరీక్ష పెట్టాలనీ 2. ప్రతి బడి/కళాశాలలో తెలుగును ఒక తప్పనిసరి మందల [విషయం] గా నేర్పాలని 3. ఇతర రాష్ట్రాల్లో/దేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలుగు చదివే వీలు మనం కలిగించాలని 4. అన్ని రాష్ట్రాల్లోనూ చనిపోతున్న తెలుగు మాటలను సేకరించి బతికించుకోవాలని, వాడాలని మనం జరుపుతున్న ఎసపు [ఉద్యమం] లో మీరు చురుకుగా పాల్గొనాలని విన్నపం.
======================