*” వైద్యశాస్త్ర బోధన , చరిత్ర రచనల్లో వన్నె తెచ్చినవారు - అడుగడుగునా తెలుగు కు పట్టం కట్టిన పొత్తూరి వారు!”*
_________________________________
తెలుగువారు తెలుగులోనే ఉన్నతవిద్యలు చదువుకోవాలని, ఇతర భాషలను కూడా నేర్చుకున్నా ఆ పరిజ్ఞానం తెలుగు భాషకు ఉపయోగపడాలని వీరి గట్టి తలపు.
ఒకటవ తరగతినుంచి స్నాతకోత్తర విద్యవరకూ తెలుగు మాధ్యమంలో చదువుకున్న వీరు తమ పిహెచ్ డి థీసీస్ సైతం తెలుగులోనే రాయబూనితే విశ్వవిద్యాలయం వారు ఒప్పుకోలేదు.
తెలుగు మాధ్యమంలోనే ఆయుర్వేద శాస్త్ర బోధన
చేసేవారు. అయితే దానిని కూడా ఆంగ్లంలోనే బోధించాలని నిర్దేశించడంతో, సంస్కృతం - ఆంగ్లం ఆయుర్వేద నిఘంటువు తయారుచేసి విద్యార్థులకు, ఆచార్యులకు అందుబాటులోకి తెచ్చారు. ఆ పై భారత ప్రభుత్వ కమిటీ ఆధ్వర్యంలో ఆయుర్వేద బృహన్నిఘంటువు రచనలో కూడా పాల్గొన్నారు.
_________________________
అంతర్జాతీయ భాష ఎస్పెరాంటో లో నిష్ణాతులైన మన పొత్తూరి వారు దేశదేశాలు పర్యటించారు. ప్రపంచ ఎస్పెరాంటో అకాడెమీలో సభ్యులుగా పనిచేసిన తెలుగు తేజం వీరు. ఎస్పెరాంటో , తెలుగు, ఆంగ్ల భాషలలో అనేక గ్రంథాలు రచించారు.
__________________________
రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలుగు మహానిఘంటువుల నిర్మాణంలో సంపాదకులు, ఆయుర్వేద వైద్యులు, విశ్రాంత ఆచార్యులు, డా॥ పొత్తూరి వెంకట రంగనాయకులు గారు, *”నిఘంటువుతో నా ప్రయాణం”* అన్న అంశంపై మన తెలుగు సంఘాల ఉమ్మడి వేదికపై, శనివారం, 13-12-2025, మాపులు 7 గం. లకు జరిపే రచ్చబండలో, మాట్లాడుతారు.
కార్యక్రమంలో పాల్గొనటానికి ఎప్పటి లాగా ఈ క్రింది లంకెపై నొక్కండి.
వీడియో కాల్ లింక్:
https://meet.google.com/ste-jdoz-xbs _____________________________
తెలుగు నుడి ఊడిగంలో మీ అనుగరి(అభిమాని),
*పురాణం రామప్రసాద్ ,*
ఊరట వంౘ మరకాను(రసాయన సాంకేతిక యంత్రశాస్త్రం)
చేపలుకు : 9505255100
telugukootami.org తెలుగును బతికించుకోవాలంటే తెలుగు భాషా ప్రాధికార సంస్థ ఏర్పాటు తో పాటు 1. ప్రతి కొలువుకు తెలుగులోనే పరీక్ష పెట్టాలనీ 2. ప్రతి బడి/కళాశాలలో తెలుగును ఒక తప్పనిసరి మందల [విషయం] గా నేర్పాలని 3. ఇతర రాష్ట్రాల్లో/దేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలుగు చదివే వీలు మనం కలిగించాలని 4. అన్ని రాష్ట్రాల్లోనూ చనిపోతున్న తెలుగు మాటలను సేకరించి బతికించుకోవాలని, వాడాలని మనం జరుపుతున్న ఎసపు [ఉద్యమం] లో మీరు చురుకుగా పాల్గొనాలని విన్నపం.
======================