మీ విమర్శకుల నుంచి సమీక్షను ఆహ్వానిస్తున్నాను

16 views
Skip to first unread message

amaranarayana beeda

unread,
Jun 24, 2009, 4:22:49 PM6/24/09
to telug...@googlegroups.com
మిత్రులారా !
గత సంవత్సరం ఆగస్టు నుంచి  పాలవెల్లి పేరుతొ ఓ బ్లాగ్ రాస్తున్నాను . మీ విమర్శకుల నుంచి
సమీక్షను ఆహ్వానిస్తున్నాను . http://palavelli.blogspot.com/
మీ సూచనలు వినమ్రతతో స్వీకరిస్తాను.
-మీ అమర్

Ranga Sai Mamidenna

unread,
Jun 25, 2009, 8:11:23 AM6/25/09
to telug...@googlegroups.com
వందేమాతరం
అమర్ గారికి 74 సంల  ఈ  వృద్ధుడి  ఆశీర్వచనములు.
మీ పాలవెల్లి  చూసాను  బాగుంది  వరుణ జపం  చేస్తే  అది  ఒక రఖంగా  అమ్మ కి కోపం  రావచ్చేమో  ఏమంటే  'వరుణ'  పదం  ఎక్కువగా  ప్రచారం  అవడం  ఆమెకు  నచ్కాకపోవచ్ కదా.  వరుణ  యాగం  చేస్తే  వర్షాలు  కురుస్తాయో లేదో  కానీ  వరుణ్ (గాంధీ) పేరు అయాచితం గా ఎక్కువగా  ప్రచారమయ్యే ప్రమాదం  ఉందనిపించవచ్చుకదా. మీ  వానా  వానా లో అది  కూడా సూచించవలసింది    

నేను  ఈ మధ్యనే  ఈ  బ్లాగ్  గుంపు  లో  చేరాను ఎలా  చే రానో  కూడా  సరిగ్గా  అర్ధం కావడం  లేదు కారణం  కంప్యూటర్ల  గురించి  బాగా  తెలియదు.  మా మనవడి  సహాయం తో  చేరానంతే.. . నేను  బ్లాగ్గర్ని  కాను  కానీ  గుంపు లో  సభ్యుడిని  మాత్రమేనని  ఇప్పుడే తుమ్మల శిరీష్ కుమార్  గారి  లేఖ  ద్వారా తెలిసింది.  నేను  కూడా  ఒక  బ్లాగు  ప్రారంభించి  సామాజిక  దురాచారాలు  వగైరాల  గురించి  నా అభిప్రాయాలూ గట్రా రాద్దామని  ఉన్నాది.
ఒరిస్సాలో  పుట్టి  అక్కడే  60  ఏళ్ళు గడిపి  వచ్చి,  ప్రస్తుతం  దృష్టి మాంద్యం  కూడా తోడైన నాకు తెలుగు రచయితలూ, సాహిత్యం గురించి తెలియదు.  అందు వల్ల తప్పులని క్షమించండి.
భవదీయుడు
మా  వెం  రంగశాయి.
 . 

2009/6/25 amaranarayana beeda <ama...@gmail.com>



--
Maa  Ven  Rangasai

jyothi valaboju

unread,
Jun 25, 2009, 8:28:27 AM6/25/09
to telug...@googlegroups.com
 రంగ సాయి గారు నమస్కారం. మీకు ఎటువంటి సహాయం కావాలన్న ఈ గుంపు నుండి   ఎవరో ఒకరు అందిస్తారు. బ్లాగు రాయడానికి సాహిత్యం పాండిత్యం ఉండాల్సిన అవసరం  లేదండి. మీ అనుభవాలు అలా రాస్తూ ఉండండి. అంతే... చదవడానికి ఎంతో మంది రెడీగా ఉన్నారు. :)

Ranga Sai Mamidenna

unread,
Jun 25, 2009, 8:59:19 AM6/25/09
to telug...@googlegroups.com
వందే  మాతరం
నాకు  ప్రోత్సాహాం, సహాయం చేస్తున్న  మీ  అందరికీ ధన్యవాదములు .  మీలాంటి  వారి  సహాయంతోనే  నేను  కూడా  ఒక  blog  ప్రారభించి  ముఖ్యంగా  సామాజిక  దురాచారాల  గురించి  రాయాలనీ తద్వారా  కొందరైనా  మారుతారేమోనన్న  ఆశ

భవదీయుడు
మా  వెం  రంగశాయి

2009/6/25 jyothi valaboju <jyothiv...@gmail.com>

 రంగ సాయి గారు నమస్కారం. మీకు ఎటువంటి సహాయం కావాలన్న ఈ గుంపు నుండి   ఎవరో ఒకరు అందిస్తారు. బ్లాగు రాయడానికి సాహిత్యం పాండిత్యం ఉండాల్సిన అవసరం  లేదండి. మీ అనుభవాలు అలా రాస్తూ ఉండండి. అంతే... చదవడానికి ఎంతో మంది రెడీగా ఉన్నారు. :)





--
Maa  Ven  Rangasai

jyothi valaboju

unread,
Jun 25, 2009, 9:06:06 AM6/25/09
to telug...@googlegroups.com
 ఇక్కడ చెప్పినట్టుగా బ్లాగు మొదలెట్టొచ్చు.. సందేహాలుంటే అడగండి .

http://computereras.blogspot.com/2008/02/blogger.html

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Jun 25, 2009, 9:09:24 AM6/25/09
to telug...@googlegroups.com
రంగసాయిగారూ ! నమస్కారములు. మీ అనుభవమంత లేదు మా వయసు. ఏమైనా ఎక్కువ
తక్కువ మాట్లాడితే పెద్ద మనసు చేసుకొని క్షమించగలరని ప్రార్థన. సమాజంలోని
దురాచారాలు చాలా పాత టాపిక్కనుకుంటా. దురాచారాల విమర్శ పేరుతో తఱచుగా
జఱిగేది ఎక్కువ భాగం, గతించిపోయిన సమాజాల్ని ఆడిపోసుకోవడమే. సమకాలీన
నాగరికతలో జఱుగుతున్న తప్పుల్నీ, వాటికి పాల్పడుతున్న దొంగల్నీ
కనిపెట్టడమే చాలా కష్టమైన విషయం. సువిశాలమైన మీ అనుభవ రీత్యా వర్తమాన
సమాజంలోని పెడపోకడల గుఱించి వ్రాస్తే తెలుసుకుందామని ఉంది.

25-06-09, Ranga Sai Mamidenna <mvran...@gmail.com>రాసిఉంది:


--
నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి

This mail might have been sent to you in Telugu language. If you are
unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE
(UTF-8). For writing in Telugu, use http://lekhini.org

psm lakshmi

unread,
Jun 25, 2009, 9:17:17 AM6/25/09
to telug...@googlegroups.com
రంగసాయి గారికి
నమస్కారాలు
బ్లాగు మొదలు పెట్టబోతున్నందుకు శుభాకాంక్షలు.  వయసు, దానివల్ల వచ్చే ఇబ్బందులు అవి అందరికీ తప్పని ప్రకృతి ధర్మాలండీ.  కానీ వాటిని పక్కకి తోసి సరైన పధ్ధతిలో సరదాగా వుండటమనేది భగవంతుడు కొందరికే ఇచ్చిన వరం.  ఈ బ్లాగ్ లోకంలో మీ ఇబ్బందులనన్నింటినీ మరచిపోండి.  పదే పదే మీ వయసుని గుర్తుచేసుకుంటే పెద్దవారులే ఆయనజోలిమనకెందుకు అని మీమ్మల్ని పక్కన పెట్టే ప్రమాదముంది.  అందుకని అవన్నీ మరిచిపోయి ఈ నూతన ప్రయాణాన్ని ఉత్సాహంగా సాగించండి.  శుభాకాంక్షలు.
psmlakshmi
psmlakshmi.blogspot.com

2009/6/25 Ranga Sai Mamidenna <mvran...@gmail.com>

Ranga Sai Mamidenna

unread,
Jun 26, 2009, 8:20:09 AM6/26/09
to telug...@googlegroups.com
వందే  మాతరం
తాడేపల్లి  బాల సుభ్రమణ్యం  గారికి  ఆశీర్వచనములు
ఒరిస్సాలో  1934 లో పుట్టి  60  ఏళ్ళు అక్కడే  గడిపి  వచ్చిన  నాకు  తెలుగు,  సంస్కృతాలలో  మంచి  పట్టు  ఉన్న  మీకు  జవాబు  రాయడానికి  జంకు  కలిగినా  మీ  ప్రోత్సాహం  నుంచి సాహసించి  రాస్తున్నాను.
ముందు  గా  సామాజిక  దురాచారాల  గురించి  తరువాత  రాస్తాను  కానీ   నాకు  బాధ  కలిగిస్తున్న  కొన్నింటిని  ప్రస్తావిస్తున్నాను.
మన  వాళ్ళలో  చాలామంది లాగ   పిల్లలకి   దాడ్డీ  మమ్మీ  లే  నేర్పకుండా.   కనీసం  అమ్మా  నాన్నా  వంటివి  నేర్పమని  అందరికీ  మనవి. (అంకుల్  ఆంటీ పదాలు  ఎంతగా  చోచ్చుకుపోయాయంటే  అవి  మాన్పింపచడం  ఎవరి తరము  కాదనే  నా అభిప్రాయం).

రెండవది  పుట్టినరోజు  పండుగలలో  HAPPY  BIRTH  DAY  అని  అధరూ  పాడడం  కొవ్వొత్తులు  ఆర్పడం వంటివి  నాకు  కంపరం  కలుగుతుంది.  విధిలేక వెళ్ళవలసి వచ్చినప్పుడు  వాళ్ళతో  ముందుగానే  హెచ్చరిస్తాను. అంతే కాక  "బంగారు  పాపాయి  బహుమతులు  పొందాలి..." అనే
ఒక  పాత పాటని  సందర్భానుసారంగా  కొద్ది  మార్పులు  చే యించి  కొందరి చేతనైనా బృందగానంగా పాడించి ఆ తర్వాత  అక్కడకు వచ్చినవాల్లంధరిచేతా  ఒకరు  చెబుతూంటే  మిగిలినవాల్లందరి  చేతా
'" శతమానం  భవతి.."  అంటూ  నాకు వచ్చింది చేప్పించీ  అందరి చేతా అక్షంతలు   వేయించి  నేను వేల్లిపోతూం టాను.   ఇది  చదివినవారు వారి  అభిప్రాయాలు  తెలియచేయండి.  నచ్చితే  అలాగే ఇంకా  మంచి  మార్పులు  చేయించి  పుతినరోజు  పండుగలు జరపండి.
నాకు సంస్కృతం  (తెలుగు కూడా )  సరిగ్గా  రాదూ కాబట్టి  ఈ  శతమానం  భవతి  పూర్తిగా రాసి  దాని  అర్ధం  కూడా  రాయమని మిమ్మల్ని  కోరుతున్నాను  నేను ఛాcధసుడిని కాను  కానీ  మన  సాంప్రదాయంలో  దీపాలు  వెలిగిస్తాము  కానీ  దీపాలు ( కొవ్వొత్తులు )  ఆర్పివేయడం  ఎంతవరకు సమంజసం  ?.(  ఈ  ప్రశ్న నా కోడలు  ఒకామె  అడిగింది )

భవదీయుడు
మా  వెం  రంగశాయి


2009/6/25 తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com>



--
Maa  Ven  Rangasai

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Jun 26, 2009, 8:49:28 AM6/26/09
to telug...@googlegroups.com
రంగశాయిగారికి నమస్కారములు.

మీరు పుట్టినరోజు వేడుకల్ని జఱిపిస్తున్న పద్ధతి మిక్కిలి ప్రశంసనీయంగా ఉంది. మీ పద్ధతే అందఱికీ ఒజ్జబంతి కావాలని ఆశిస్తున్నాను.

మీరడిగినదాని గుఱించి నాకు తోచింది కొంత పంచుకుంటున్నాను. దీపాలార్పడం - ఇది పాశ్చాత్య పద్ధతే తప్ప భారతీయ పద్ధతి కాదు. దీపం మనకి అగ్నిదేవస్వరూపం, సకలదేవతాస్వరూపం కూడా ! ఎందుకంటే ఏ దేవునికి ఉద్దేశించిన ఆహుతులనైనా అగ్నిలోనే వ్రేలుస్తారు. అగ్నిసాక్షిగా వివాహం చేసుకుంటారు. వేదాల్లో అగ్నిదేవునికి ఉన్నన్ని సూక్తాలు ఇహ ఏ ఇతరదేవునికీ లేవు. అటువంటి అగ్నిభగవానుడి పట్ల వ్యవహరించాల్సిన విధానాన్ని మన పూర్వీకులు మనకి సమగ్రంగానే నిర్దేశించి ఉన్నారు. ముఖ్యంగా ముఖమారుతం (నోట్లోని గాలి) తో దాన్ని కొండెక్కించడం, కాళ్ళతో కట్టెల్ని సవరించడం,  అగ్నిమీద/ అభిముఖంగా పాదాలు పెట్టి వెచ్చజేసుకోవడం - ఇవన్నీ నిషిద్ధాలుగా వారు భావించారు. అయితే కొన్ని మినహాయింపులు లేకపోలేదు. శ్రీ షిరిడీ సాయిబాబావారు కాళ్ళతో కట్టెల్ని సవరించేవారు. ఆయన సాక్షాత్తు భగవంతుడు కనుక సృష్టిలోని సమస్తశక్తులూ ఆయనకి సేవకులే కనుక ఆయనకి ఈ నియమాలు వర్తించవు. మన పరిస్థితేమో అది కాదాయె.

పుట్టిన రోజుని మన పూర్వీకులు వర్ధాపనవిధి అనే పేరుతో జఱిపేవారు. అందులో - హోమం చేసి బంధువులకీ, బ్రాహ్మణులకీ భోజనం పెట్టి ఆశీర్వాదాలు తీసుకోవాలి. అయితే ఈ పద్ధతి ఇప్పుడు ఎవరికీ తెలియదు, పురోహితులతో సహా !

psm lakshmi

unread,
Jun 26, 2009, 8:57:08 AM6/26/09
to telug...@googlegroups.com
బాల సుబ్రహ్మణ్యంగారూ,

వర్ధాపనవిధి లాంటివేనా ఆయష్ హోమాలు.  మనవాళ్లు షష్టిపూర్తికి చేయించినా, తమిళిలు మొదటి పుట్టినరోజున జరుపుతారుకదా.

psmlakshmi

2009/6/26 తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com>

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Jun 26, 2009, 9:19:02 AM6/26/09
to telug...@googlegroups.com
అవును, అలాంటివేనండీ.

Ranga Sai Mamidenna

unread,
Jun 26, 2009, 12:08:19 PM6/26/09
to telug...@googlegroups.com
వందే  మాతరం 

బాల  సుభ్రమణ్యం గారూ
ఆశీర్వచనములు
వెంటనే  జవాబు  రాసినందుకు  ధన్యవాదాలు.
నేను  అడిగిన  " శతమానం  భవతి  "  పూర్తిగా  రాసి  దాని  అర్ధం  కూడా  రాయమని  కోరాను  దయ  చేసి  పంపండి.
భవదీయుడు
మా  వెం  రంగశాయి .                                                                      '

2009/6/26 తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com>



--
Maa  Ven  Rangasai

amaranarayana beeda

unread,
Jun 26, 2009, 8:17:52 PM6/26/09
to telug...@googlegroups.com
చాలా సంతోషం గా వుంది . రంగ సాయి గారు . మీ ఆశీర్వచనాలు నన్నేతగానో ఆనంద పర్చాయి. ముందుగా మీ ఓపికకు ధన్యవాదాలు . మీకు బ్లాగ్ రాసేందుకు ఏ సహాయం కావాలన్న ఫోన్ చేయండి . నా నెంబర్ :+919291541948. మీ లాంటి పెద్దలు చెప్పాల్సింది చాలావుంది. మీ అనుభవాలు రాస్తే చాలు . పాండిత్యం అక్కర్లేదు. మీ అనుభవాలే మా లాంటి యువతకు మార్గదర్శకాలు . ఈ బ్లాగ్ గుంపు లోని మిత్రులంతా మీకు సాయపడతారు. ధన్యవాదాలతో - అమర్ .(www.palavelli.blogspot.com)

2009/6/25 Ranga Sai Mamidenna <mvran...@gmail.com>
వందేమాతరం

vadali sarma

unread,
Jun 28, 2009, 2:31:08 AM6/28/09
to తెలుగుబ్లాగు
mitrulu ranga sai gariki vandanalu
YENDARO MAHANU BHAVULU !! ANDARILO MERU OKKARU !!!
MEE TELUGU BLOCK EE MADHYANUNCHI CHUSTUNNANU
BAGUNDI.
BAGUNDI ANDAM KANTE MAHA BHESHUGGA VUNDI
MARO SARI ABHINANDANALU ..

IKA POTE, GOTAM LO KUDA, NENU YENNO SARLU NA MATTER TELUGU LO PAMPADA
YELAGA
ANI ADIGANU. NAA BAD LUCK, NENU KUDA (VISAKHA) STEEL PLANT VUDYOGA
BADHYATA LLO MARCHI POYA. LEDA EE TELUGU BLOCK KE RAVADAM LEDU.
KAANA MERANTA SAHAYAM CHEYYANDI
HOW TO SEND MY FREE TELUGU IN TELUGU SCRIPT. ? OK

ALL THE BEST ALL WAYS TO AND UR TEAM.

THANKS..

On Jun 24, 11:22 pm, amaranarayana beeda <amar...@gmail.com> wrote:
> మిత్రులారా !

> గత సంవత్సరం ఆగస్టు నుంచి  పాలవెల్లి <http://palavelli.blogspot.com/> పేరుతొ


> ఓ బ్లాగ్ రాస్తున్నాను . మీ విమర్శకుల నుంచి

> సమీక్షను ఆహ్వానిస్తున్నాను .http://palavelli.blogspot.com/

jyothi valaboju

unread,
Jun 28, 2009, 2:46:33 AM6/28/09
to telug...@googlegroups.com
 sharma garu,,

use http://lekhini.org/  to type in telugu.. its very easy and free too...
Reply all
Reply to author
Forward
0 new messages