ఆహ్వానం : తెలుగు వికీపీడియా అవగాహన - ఉచిత ఆన్లైన్ తరగతులు

46 views
Skip to first unread message

Kaśyap కశ్యప్

unread,
Jan 17, 2023, 4:17:40 AM1/17/23
to telugublog
నమస్కారం ,

వికీపీడియా, ఒక బహుభాషా, అంతర్జాల (వెబ్) – ఆధారిత స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము , ఇక్కడ సమాచారం గురించి తెలుసుకోవడమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పులు చేయవచ్చు, కొత్త సమాచారాన్ని కూడా చేర్చవచ్చు కార్యక్రమంలో  చేర గోరే వారు ఈ ఆదివారం 22 జనవరి 2023 లోపల మీ వివరాలు ఇవ్వగలరు.

నమోదు (google form link)  : https://forms.gle/FhunUNEErND2gnc27  

ఈ సారి శిక్షణా తరగతులు ప్రధానంగా మొబైల్ లో తెలుగు వికీ ఉపయోగించటం  ప్రధానంగా సాగుతుంది, మీరు ఇంతకు మునుపు శిక్షణకు హాజరు అయినా కూడా ఈ తరగతులు ఉపయోగకరంగా ఉంటాయి,  జనవరి 23 సోమవారం నుండి శనివారం 26 జనవరి 2023 వరకు ఆరు రోజుల పాటు  సాయంత్రం 7 నుండి 8 గంటల వరకు  zoom app ద్వారా ఆన్లైన్ లో జరుగుతాయి.

అందరికీ అన్నీ విషయాలు తెలియక పోవచ్చు, కాని ప్రతి ఒక్కరూ ఏదో ఒక అంశం పై కొంత విషయ జ్ఞానం కలిగి ఉంటారు . అలా అందరికీ తెలిసిన విశేష జ్ఞానాన్ని ఒక చోట చేర్చడం వల్ల విజ్ఞాన సర్వస్వం తయారవుతుంది. అలా కూర్పు చేసిన విజ్ఞానసర్వస్వం ఉచితం గా, స్వేచ్చగా అందించటమే వికిపీడియా లక్ష్యం. వికీపీడియాలో ఇప్పటికే పలు వ్యాసాలు ఉన్నాయి. అయినప్పటికీ ముఖ్యమైన సాహిత్య విషయాలు, రచయితలు రచనల వివరాలు తెలుగు వికీపీడియాలో అంతంత మాత్రంగానే ఉన్నాయి లేక కొన్ని అసలు లేనే లేవు. వికీపీడియాలో విషయాన్ని తాజాగా ఉంచడానికి, ప్రస్తుతం మొలకలుగా ఉన్న వ్యాసాలు విస్తరించడానికి మరియు కొత్త వ్యాసాలను సృష్టించడానికి మీలాంటి వారిపై ఆధారపడుతుంది. మీ వికీ కృషి వందలూ, వేలూ, ఒక్కోసారి లక్షలాది ప్రజలకు ప్రపంచ వ్యాప్తంగా అవగాహన పెంచడానికి తోడ్పడుతుంది.

నమోదు చేసుకున్న వారందరికీ ఈ జనవరి 23 సోమవారం ఉదయం జూమ్ లింక్ వివరాలు తెలియచేస్తాం. ఈ లోపల  ఏమైనా సందేహాలు లేదా మరింత సమాచారం కోసం 9014120442 or tew...@iiit.ac.in ను సంప్రదించండి . ఈ కార్యక్రమం లో పాల్గొనువారు వివిధ తెలుగు సాంకేతిక ఉపకరణాల సహాయంతో వికీకి తోడ్పడటం నేర్చుకుని తద్వారా తెలుగులో కూడా అపూర్వ విజ్ఞాన సంపదను పోగేసే మహా ప్రయత్నంలో భాగస్వాములవుతారని ఆశిస్తున్నాం.

దయచేసి  మీకు తెలిసిన తెలుగు  ఔత్సాహికులతో ఈ సమాచారం పంచుకోగలరు
మీ శ్రేయోభిలాషి 
కశ్యప్
Reply all
Reply to author
Forward
0 new messages