కొత్త బ్లాగు

21 views
Skip to first unread message

PANTULA JOGARAO

unread,
Nov 15, 2009, 4:57:42 AM11/15/09
to telug...@googlegroups.com
అందరికీ నమస్కారం. నా పేరు పంతుల జోగారావు. విశ్రాంత తెలుగు ఉపాధ్యాయుణ్ణి. నా కథలను మీ అందరితో పంచుకోవాలని బ్లాగు మొదలెట్టాను. చూసి మీ అమూల్యమైన అభిప్రాయములు ఇవ్వగలరని ఆశిస్తున్నాను. తప్పులున్న సరిదిద్దగలరు. ఇప్పుడే కదా అన్నప్రాసన జరిగింది..
 
 
 
 

hanu rao

unread,
Nov 15, 2009, 5:07:53 AM11/15/09
to telug...@googlegroups.com

అన్నప్రాసన రోజే ఆవకాయ తినడం అనేది మీలాంటి గొప్పవారికే చెల్లుతుంది, అంత బాగుంది,
ఒక విన్నపం మీదాంట్లో పోస్ట్ ఎటం తేసేసి పోస్ట్ కామెంట్ పెట్టండి.

raki gollapelli

unread,
Nov 15, 2009, 6:14:21 AM11/15/09
to telug...@googlegroups.com

పంతులుగారు..మీరు నిజంగానె పంతులు....!

కవితా నిత్యవసంతులు...!

విశ్రాంత జీవన ప్రశాంతులు...!

సుమనశ్శాంతులు..!!

వేదాంతులు..మేధావంతులు!            

లలిత పదములు సదా మీ పాదాక్రాంతులు!!

ఉడతాభక్తిగ నేనూ రాస్తానంటే అవుతాయేమో వదంతులు

నా బ్లాగ్ వైపు కాస్త తొంగి చూడమని నా వినతులు

శిరోధార్యాలు మీ దీవెనాక్షింతలు!!

సదా మీ స్నేహాభిలాషి

రాఖీ.......www.raki9-4u.blogspot.com

 



2009/11/15 hanu rao <hanu...@gmail.com>

అనిలు

unread,
Nov 15, 2009, 8:24:30 AM11/15/09
to తెలుగుబ్లాగు
బాగుంది, మీ కవిత..అక్కడ వ్యాఖ్యానించడానికి comment ని enable చెయ్యండి.

jyothi valaboju

unread,
Nov 15, 2009, 8:41:21 AM11/15/09
to telug...@googlegroups.com
 పోస్ట్ టైటిల్ పక్కన ఒక బుడగ  ఉందిగా.అందులో నంబర్ క్లిక్ చేస్తే వ్యాఖ్యానించవచ్చు

kv ramana

unread,
Nov 17, 2009, 2:07:43 AM11/17/09
to telug...@googlegroups.com
జోగారావుగారు కథ అని చెప్పి బ్లాగులో ఒక కవిత రాశారు. బ్లాగుకి 'కధామంజరి' అని పేరు పెట్టారు. 'కథామంజరి' అంటే బావుంటుంది కదా.  అనుభవం గల రచయితా అందునా తెలుగు పండితుడు - తన బ్లాగులో ఇలా ఉండడం ఏమిటో? 

2009/11/15 jyothi valaboju <jyothiv...@gmail.com>

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Nov 17, 2009, 2:37:11 AM11/17/09
to telug...@googlegroups.com
జనం అలా పలుకుతారు. చిన్నవిషయాలు వదిలెయ్యండి.


నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి



This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org

jyothi valaboju

unread,
Nov 17, 2009, 3:36:51 AM11/17/09
to telug...@googlegroups.com
 రమణ గారు,

ఇలా చెప్తున్నందుకు మన్నించాలి. పంతుల జోగారావుగారు  అరవై దాటినవారు. పెద్దలు.ఇప్పుడు దొరికిన తీరిక సమయంలో కంప్యూటర్ నేర్చుకుని బ్లాగు మొదలుపెట్టారు. ఓనమాలు దిద్దుతున్నారు.వారు వాడేది అను. యూనికోడ్ లో రాయడం ఇంకా అభ్యాసం కాలేదు. టైటిల్ లో చిన్న తప్పు జరిగింది . అలాగే  కథలు మాత్రమే రాస్తాను అని వారు అనలేదు. ట్యాగ్ లైన్ లో చెప్పినంత మాత్రాన కవితలు రాయొద్దని రూల్ లేదనుకుంటా.  అనుభవం గల రచయితా అందునా తెలుగు పండితుడు - తన బ్లాగులో ఇలా ఉండడం ఏమిటో అని దెప్పి పొడవడం భావ్యమా.కొత్త బ్లాగర్లను ఇలా నిరుత్సాహ పరచడం మంచిది కాదు అనుకుంటా.తప్పులు ఉంటే సరిదిద్దుకోమనాలి..ఈ సాంకేతిక విషయాలు తెలుసుకుని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలా అంటే బాధపడతారు  కదా.

PANTULA JOGARAO

unread,
Nov 17, 2009, 3:56:38 AM11/17/09
to telug...@googlegroups.com
జ్యోతి గారి వివరణ చూసారు కదా? ప్రమాదో ధీమతామపి .జ్యోతి గారు చూపిన సంయమనం బ్లాగర్లు అందరూ చూపిస్తే కొత్త వారు ముందుకొస్తారు.  తాడేపల్లి వారికి నా ధన్యవాదాలు.

17 నవంబర్ 2009 2:06 pm న, jyothi valaboju <jyothiv...@gmail.com> ఇలా రాసారు :

kv ramana

unread,
Nov 17, 2009, 8:27:16 AM11/17/09
to telug...@googlegroups.com
ఫొరపాటే. క్షంతవ్యుణ్ణి.
బహుశా బ్లాగు జొగారావు గారు తయారించి వుండరు. మరెవరిచేతో చేయించి
వుంటారని అనుకుంటున్నాను. రచయిత చేతిలో కధ అని పడితే గమనించి కథ అని
దిద్దుకొని వుందురు.
రెండొది - కథలని చెప్పి ఒక కవిత మాత్రమే ఇచ్చారెందుకోనని నా సందేహం.
అంతేతప్ప నా మెయిల్ విమర్శగా తీసుకోవద్దని జోగారావు గారిని కోరుతున్నాను.
నేనూ చిన్నవాడిని కాను. నా వయసు అరవైయేడు.

PANTULA JOGARAO

unread,
Nov 17, 2009, 11:02:31 AM11/17/09
to telug...@googlegroups.com
అంత మాట ఎందుకు లెండి. ఇక వదిలేయండి. నా బ్లాగులో కథను పెట్టే ప్రయత్నం లోనే ఉన్నాను. అందుకు అనుభవజ్ఞుల సలహాలను స్వీకరిస్తున్నాను. బ్లాగులు చూడడం ఇదే తొలిసారి. త్వరలోనే నా కథలు బ్లాగులో చదవగలరు. ఒక చిరంజీవి సహృదయంతో  నాకు సహకరించడానికి పూనుకున్నారు. కాస్త వేచి చూడండి.  

17 నవంబర్ 2009 6:57 pm న, kv ramana <kvje...@gmail.com> ఇలా రాసారు :
Reply all
Reply to author
Forward
0 new messages