"దెళ్ళు", "దవణము" ,
"ఒల్లాటలేస్తా" , "గిరిమింద",
"సుద్దకుంట్ల" , "సొద్ద కూడు",
"కొర్ర కూడు" ఇలాంటివి ఇంకా
చాల ఉన్నాయి - ఎవరయినా
వీటికి అర్ధం చెప్పగలరా
http://www.maganti.org/DecPDFdoc/rayala1.pdf
గిరిమింద: గురువింద: గురువింద గింజ ఎర్రగా వుండి ఒకవైవు నల్లగా వుంటుంది.
సొద్ద కూడు : సజ్జలతో చేసిన అన్నము: సజ్జలనే సొజ్జలు, సొద్దలు అని అంటారు
కొర్ర కూడు: కొర్రలతో చేసిన అన్నము: కొర్రలు చిన్నగా(నువ్వుగింజ కంటే చిన్నగా), తెల్లగా వుంటాయి. నేను నా చిన్నప్పుడు ఒకేఒక్కసారి తిన్నట్లు గుర్తు. కొర్రలకు ఇంకో పేరు ఉన్నట్లు తెలియదు.
--ప్రసాద్
http://blog.charasala.com
బాగా పండితే మామాంచి బార్యొస్తుందనో, మొగుడొస్తాడనో అనేవాళ్ళు కదూ!
--ప్రసాద్
http://blog.charasala.com
On 12/28/06, Ramanadha Reddy Yarrapu Reddy < iamra...@gmail.com> wrote:చిన్నప్పుడు సెలవుల్లో మాయింట్లో బంధువుల పిల్లలంతా చేరినపుడు వక్కాకువేస్కుని "ఎవరి నోరు బాగా పండుతుందో చూద్దాం" అని చిన్న పందెంలాంటిది పెట్టుకొనేవాళ్లం. పెద్దల (అవ్వ) ఆధ్వర్యంలోనే జరిగేదిది. అపుడు మాకు ఆకు,వక్క,సున్నం మాత్రమే ఇచ్చేవాళ్లు. మా నాయన ఆ ధోరణిని సున్నితంగా నిరసించడంలో మానేశాం. పొగాకు మాకంత ఇష్టంకూడా లేకపోవడంతో ఎవరమూ దానికోసం అడిగేవాళ్లం కూడా కాదు. నానోరు అంతగా పండేది కాదు. మళ్లీ ఎప్పుడైనా ఒకసారి చూడాలి.On 12/28/06, Prasad Charasala < char...@gmail.com > wrote:అయుండచ్చు. మా అమ్మమ్మకు వచ్చిన కాన్సర్ కారకము ఆ పొగాకే!
తాంబూలసేవనంతో ఇంకో చిక్కుంది. ఇంటి అరుగుల మీద కూర్చుని విచక్షణారహితంగా అటూ ఇటూ వుమ్మేస్తారు. తెల్లటి సున్నం పూసిన గోడలు చూస్తుండగానే ఎర్రబడతాయి.
--ప్రసాద్
http://blog.charasala.com
--
Prasad
కొర్రలతో చేసిన పాయసం అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ హైదరాబాదులో చాలా డిపార్ట్ మెంటల్ దుకాణాలలో చూసాను.
నేనైతే ఆ పదా లే వినలేదు ఇంతవ రకు
కొర్రలు, సామలు, తైదలు, రాగులు ఇవి అన్నీ చిరు ధాన్యాలు.కొన్ని ఏళ్ళ కింది వరకు వరి అన్నం అనేది చాలా తక్కువ వాడకం. జరం వస్తెనే బువ్వ జేజేకు ఎక్కితేనే బువ్వ అనేవారంట. అంటే వరి వాడకం అంత తక్కువ. ఎక్కువగా కొర్రన్నం తినేవాళ్ళు.కొర్రలు నువ్వులకంటె చిన్నగా ఆవాలలాగా గుండ్రంగా పచ్చగా ఉంటాయి.ఇందులో చక్కెర శాతం తక్కువగ ఉంటుంది కనుక మధుమేహం కలవారికి చాలా మంచిది అంటారు వరి అన్నం బదులు.
పాయసం రెడీ మీదే ఆలస్యం
కొర్రలు, సామలు, తైదలు, రాగులు ఇవి అన్నీ చిరు ధాన్యాలు.కొన్ని ఏళ్ళ కింది వరకు వరి అన్నం అనేది చాలా తక్కువ వాడకం. జరం వస్తెనే బువ్వ జేజేకు ఎక్కితేనే బువ్వ అనేవారంట. అంటే వరి వాడకం అంత తక్కువ. ఎక్కువగా కొర్రన్నం తినేవాళ్ళు.కొర్రలు నువ్వులకంటె చిన్నగా ఆవాలలాగా గుండ్రంగా పచ్చగా ఉంటాయి.ఇందులో చక్కెర శాతం తక్కువగ ఉంటుంది కనుక మధుమేహం కలవారికి చాలా మంచిది అంటారు వరి అన్నం బదులు.
పాయసం రెడీ మీదే ఆలస్యం
జ్యోతి గారూ,
థ్యాక్యూ, కానీ మాకిక్కడ కొర్రలు దొరుకుతాయో లేదో చూడాలి. దొరికినా వాటిని పోల్చుకోగలనో లేదో! వాటిని ఆంగ్లంలో లేదా హిందీలో ఏమంటారో!
On Dec 29, 9:19 am, "Prasad Charasala" <charas...@gmail.com> wrote:
> జ్యోతి గారూ,
> థ్యాక్యూ, కానీ మాకిక్కడ కొర్రలు దొరుకుతాయో లేదో చూడాలి. దొరికినా వాటిని
> పోల్చుకోగలనో లేదో! వాటిని ఆంగ్లంలో లేదా హిందీలో ఏమంటారో!
>
> --ప్రసాద్http://blog.charasala.com
>
> On 12/29/06, Sudhakar S <sudha...@gmail.com> wrote:
>
>
>
>
>
> > మీరు కొద్దిగా రాజధాని ఎక్స్ ప్రెస్లా ఉన్నారే :-)
>
> > -సుధాకర్
>
> > On 12/29/06, jyothi valaboju <jyothivalab...@gmail.com> wrote:
>
> > > కొర్రలు, సామలు, తైదలు, రాగులు ఇవి అన్నీ చిరు ధాన్యాలు.కొన్ని ఏళ్ళ కింది
> > > వరకు వరి అన్నం అనేది చాలా తక్కువ వాడకం. జరం వస్తెనే బువ్వ జేజేకు ఎక్కితేనే
> > > బువ్వ అనేవారంట. అంటే వరి వాడకం అంత తక్కువ. ఎక్కువగా కొర్రన్నం
> > > తినేవాళ్ళు.కొర్రలు నువ్వులకంటె చిన్నగా ఆవాలలాగా గుండ్రంగా పచ్చగా
> > > ఉంటాయి.ఇందులో చక్కెర శాతం తక్కువగ ఉంటుంది కనుక మధుమేహం కలవారికి చాలా మంచిది
> > > అంటారు వరి అన్నం బదులు.
>
> > > *పాయసం రెడీ మీదే ఆలస్యం*
On Dec 28, 12:36 pm, "Ramanadha Reddy Yarrapu Reddy"
<iamramuh...@gmail.com> wrote:
> తాంబూల సేవనం Anti-septic మరియు mouth freshner. అందులోని సున్నం, ఆకు, వక్క
> ఇవన్నీ ఆ ప్రభావం కలిగినవే. కానీ అందులో పొగాకు కలపడం మాత్రం
> హానికరమైనది. పొగాకు కలయిక తాంబూలసేవనాన్ని ఒక వ్యసనంగా మార్చి, అనారోగ్యకారకం
> చేస్తుంది. మన డాక్టర్ చింతూగారేమంటారో వినాలనుంది.
>
> -రానారె
>
rAyalaseema padAlaku sambandhinci, mee samAdhAnam mAku maTuku
andalEdu.. :)
avunU mI blaagu lO ekkaDO cadivinaTTu gurtu meedi penugonDa ani...ee
paina unna jAnapadAllO penukonDa ani tagilinaTTu gurtu...aa penukonDa,
mI penugonDa okaTEnA ?
Dr Chintu garu
rAyalaseema padAlaku sambandhinci, mee samAdhAnam mAku maTuku
andalEdu.. :)
avunU mI blaagu lO ekkaDO cadivinaTTu gurtu meedi penugonDa ani...ee
paina unna jAnapadAllO penukonDa ani tagilinaTTu gurtu...aa penukonDa,
mI penugonDa okaTEnA ?
drchinthu wrote:
> నా సమాధానం అందిందా రానారే!
>
> On Dec 28, 12:36pm, "Ramanadha Reddy Yarrapu Reddy"
నా సమాధానం అందిందా రానారే!
On Dec 28, 12:36pm, "Ramanadha Reddy Yarrapu Reddy"
On Dec 29, 1:40 pm, "Prasad Charasala" <charas...@gmail.com> wrote:
> మీరు మీరు పంపుకోవడమేమిటి? మాకు చెప్పకూడదా??
> --ప్రసాద్http://blog.charasala.comOn 12/29/06, Ramanadha Reddy Yarrapu Reddy <
>
> iamramuh...@gmail.com> wrote:
>
> > లేదు డాక్టర్!! ఇంకోసారి పంపించండి దయచేసి.
>
బంగారానికి తావి(సువాసన)
అబ్బినట్టు, తరుణి
అందానికి తాంబూలం
అటువంటిది. ఇప్పటి
మాటకాదండోయ్ ఇది ఒకప్పటి
మాట. మీరు నమ్మకుంటే మన
'అల్లసాని' వారినడగండి...మన
తొలి తెలుగు ప్రబంధమైన
'మనుచరిత్ర'లో ప్రవరుడు
దారితెన్నూ తెలియక అడవిలో
తిరుగుతూన్నప్పుడు...
"మృగమద సౌరభ విభవ
ద్విగుణిత ఘనసార సాంద్ర
పీటీగంధ
స్థగితేతర పరిమళమై
మగువ పొలుపుఁదెలుపు నొక్క
మారుతమొలసెన్."
(నా తాత్పర్యం: ఒక పాలు
కస్తూరి, రెండు పాళ్ల
కర్పూరంతో కూరబడిన తాంబూలం
ఇతర వాసనలన్నిటినీ
మరుగుపరుస్తూ, తన
సౌరభాన్ని విరజిమ్ముతూ
అక్కడ ఓ వనిత ఉన్నదని
తెలియజేసింది.)
"అతడావాత పరంపరా పరిమళ
వ్యాపారలీలన్ జనా
న్విత మిచ్చోటని చేరఁబోయి
కనియెన్ విద్యుల్లతా
విగ్రహన్
శతపత్రేక్షణఁజంకరీకచికురన్
జంద్రాస్యఁ జక్రస్తనిన్
నతనాభిన్ నవలా నొకనొక
మరున్నారీ శిరోరత్నమున్."
(నా తాత్పర్యం: అతడు చల్లటి
పిల్లతెమ్మెరల మీదుగా అలలు
అలలుగా వస్తూన్న ఆ
పరిమళాన్ని (తాంబూల)
అఘ్రాణించి ఇక్కడెవ్వరో
మనుష్యులున్నారని
అనుకున్నంతలో : 'మెఱుపుతీగ
లాంటి మేని, విరబూస్తున్న
కుసుమాల్లాంటి కళ్లు,
తుమ్మెదల్లాంటి పొడవైన
నల్లటి కురులు, అందంతో
వెలిగిపోతున్న మోము,
గర్వంతో వంపుదిరిగిన వ***,
లోతైన బొ* కలిగి మరోలోకం
నుంచి దిగివచ్చిందా
అనుకొనే ఆ వనితను చూశాడు.)
పెద్దన గారి శృంగారాన్ని
మరోసారి చెప్పుకుందాం
కానీ, పై పద్యాల్లో స్త్రీ
శృంగార సాధనాల్లో
తాంబూలానికి అగ్రస్థానం
ఉందని తెలుస్తుంది.
ఇక మన లోకంలో
కొస్తే...తాంబూలం 'రానారె'
అన్నట్టు నోటి దుర్వాసన
పోగొట్టే 'మౌత్ ఫ్రెషనరే'
కాకుండా 'క్రిమినాశిని'
మరియు ఆహార జీర్ణక్రియలో
తోడ్పడే సాధనం. మామూలు
తాంబూలాన్ని ఏదైనా పెళ్లి
విందుకెళ్లినప్పుడు
సుష్టుగా భోంచేసాక
కస్తూరి, జవ్వాజి, చందనాది
చక్కెర పలుకులతో లేత
తమలపాకుల మధ్య, నున్నటి
వక్కలతో, ఎర్రటి సున్నంతో
కలిపి ఆస్వాదించండి.
కానీ పొగాకుతో కూడిన
తాంబూలం మన ఆరోగ్య
నాశనానికి హేతువు
అవుతుంది. నాకిప్పటికీ
గుర్తే మా పెద్దవ్వ
ఎప్పుడూ దీన్ని నములుతూ
అనారోగ్యానికి గురయ్యింది.
పొగాకులో ఉండే 'నికోటిన్'
చాలా ప్రమాదకారి, ఈ
వ్యసనాన్ని ఒక పట్టాన
వదులుకోలేము.
పళ్లూడిపోయినా 'ఇనుముతో
చేసిన గ్లాసు లాంటి (పేరు
గుర్తుకు రావడం లేదు)
దానిలో ఆకు, వక్క, సున్నం,
పొగాకు వేసి నున్నగా దంచి
మరీ వేసుకొనేది.ఇదే
కాకుండా ఇప్పటి గుట్కా,
ఖైనీలు ఇంకా
ప్రమాదకరమైనవి. వీటి వల్ల
నోటిలో క్యాన్సర్లే
కాకుండా కడుపులో,
మూత్రాశయంలో ఇంకా ఎన్నో
చోట్ల కణితులు వచ్చే
అవకాశముంది. అందుకు పొగాకు
నుంచి ఎప్పుడూ దూరంగా
ఉండాలి.
On Dec 29, 1:40 pm, "Prasad Charasala" <charas...@gmail.com> wrote:
> మీరు మీరు పంపుకోవడమేమిటి? మాకు చెప్పకూడదా??
> --ప్రసాద్http://blog.charasala.comOn 12/29/06, Ramanadha Reddy Yarrapu Reddy <
>
> iamramuh...@gmail.com> wrote:
>
> > లేదు డాక్టర్!! ఇంకోసారి పంపించండి దయచేసి.
>
manucharitra mAtetunnA, dr.chintu gAri...samdarbhOchita vivaraNa..bAgumdi...
dAtrugAramdI....idEmannA mandula sITInA?...bAgumdi....
Anil Chimalamarri