తెలుగు టైపు నేర్చుకోడం కోసం కంప్యూటర్ ఆట

10 views
Skip to first unread message

Duvvuri Venu Gopal

unread,
Sep 26, 2009, 8:34:27 AM9/26/09
to telug...@googlegroups.com

బ్లాగు మిత్రులకు నమస్కారం


చాలా రోజులనుండి మనం మన తెలుగుబ్లాగు పోస్టులలో ఇన్స్క్రిప్ట్ నేర్చుకోవడం గురించి చాలా చర్చలు జరిగాయి. ఈరోజే నేను చూసిన ఒక కంప్యూటర్ ఆట గురించి మీకు తెలియచేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇది పూర్తిగా ఉచితం. దీని పేరు Tux Typing. ఇంతవరకు నేను ఇది ఇంగ్లీషు కోసంమాత్రమే అని అనుకున్నాను. కాని ఈరోజు ఎందుకో దాన్నిలోని ఆప్షన్లు చూస్తుంటే భారతీయభాషలలో కూడా ఇన్స్క్రిప్ట్ కీబోర్డు సాయంతో ఈ ఆటను ఆడవచ్చని చూసాను. తెలుగు లో కూడా ఆటలు ఉన్నాయి. ఇలాంటి ఆటలు ఆడుతే త్వరగా తెలుగు టంకణం వంటబడుతుంది. ఉత్సాహవంతులైన మన ప్రోగ్రామింగ్ మిత్రులు దీనిని ఇంకా బాగా అభివృద్ధి చెయ్యడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆంగ్లభాషలో కుంజీ పటలం (గాభరా పడవద్దు key board కు ఇది హిందీ) నేర్చుకోవడం కోసం ఒక పాఠం ఇచ్చారు. దానితో asdfjkl; వరుస నేర్చుకోవచ్చు. మిగతావి ఎలా తయారు చేసుకోవాలో చెప్పారు. దానిప్రకారం నేను రెండురోజులుగా asdfgf ;lkjhj మరియు qwertr poiuyu వరుసలకు పాఠాలు తయారు చేసాను. దీనివల్ల తెలిసినదేమిటంటే తెలుగుకు కూడా ఇటువంటి పాఠాలు తయారుచేసుకోవచ్చని.


ఇంక మరి ఆలస్యం ఎందుకు. త్వరగా జాలం నుండి దీనిని దింపుకోండి.


మీ వేణుగోపాల్


--
Duvvuri VLKDP Venu Gopal
TeX Guru
Banaras Hindu University
visit my blog : http://telugutex.blogspot.com
http://kashikedar.blogspot.com

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Sep 26, 2009, 9:30:51 AM9/26/09
to telug...@googlegroups.com
టంకణం - టైపింగా ?
అద్భుతంగా ఉంది.

నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి



This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Sep 26, 2009, 9:31:45 AM9/26/09
to telug...@googlegroups.com
కుంజీపటలం
బాలేదు.
మనం మీటకం అంటున్నాం (మీటేది)

గిరి

unread,
Sep 27, 2009, 4:37:51 AM9/27/09
to తెలుగుబ్లాగు
వేణుగోపాల్ గారు, టక్స్ 'టంకణం' ఆట ని ఆడడానికి ప్రయత్నించాను కానీ,
కష్టంగా ఉంది. నాకు ఇస్క్రిప్టు బాగా వచ్చు - వేగంగానే వ్రాయగలను కానీ
సదరు ఆటలో అక్షరాలు సరిగా లేకపోవడం వల్లే వచ్చింది చిక్కు (ఉదా, తెలుగు త
ె ల ు గ ు లా కనబడడం)

(కీ బోర్డు కి అక్షరపేటిక అని వాడుతున్నాను నేను.)

గిరి

రాకేశ్వర రావు

unread,
Sep 27, 2009, 12:52:51 PM9/27/09
to తెలుగుబ్లాగు

నేను బొత్తాల పట్టి అనువాడుతున్నాను. :) తలో కీబోర్డు తలో కీబోర్డు పేరు
అన్నట్టుంది మన పని!!
ఆ Tux కి లంకె కూడా ఇక్కడే ఇచ్చేస్తే బాగుండేది.

ఇంకో దురదృష్టం ఏమిటంటే, మొన్న నేను హైదరాబాదులో ఎంత తిరిగినా తెలుగు
కీబోర్డు స్టిక్కర్లు దొరకలేదు.
ఉరుదూ కీబోర్డు వుందంట ఓ కాడ. కానీ తెలుగు లేదంట.

ఇంటర్నెట్ లో స్టిక్కర్లు దొరుకుతున్నాయిగానీ, మరీ 12 డాలర్లు.
ఎవరైనా ఈ స్టిక్కర్లు ఎక్కడ దొరుకుతాయో చెప్పగలిగితే బాగుంటుంది.
http://www.datacal.com/telugu-overlays.htm

రాకేశ్వరా

రాకేశ్వర రావు

unread,
Sep 27, 2009, 12:54:24 PM9/27/09
to తెలుగుబ్లాగు

స్టిక్కర్లే నిజంగా దొరికితే, ఈ-తెలుగోత్సాహం వున్నవారికి చాలా మంచి
కానుక అవుతుంది.
వేంటనే స్టిక్కర్లు అతికించుకొని, వేంటనే ఆంగ్లంలాగా తెలుగునీ టైపు
చేసేయగలుగుతారు.
barriers to entry వుండనేవుండవు. ఈ ఒక్క దానిని అధిగమిస్తే...

On Sep 27, 9:52 pm, రాకేశ్వర రావు <rakesh...@gmail.com> wrote:
> నేను బొత్తాల పట్టి అనువాడుతున్నాను. :) తలో కీబోర్డు తలో కీబోర్డు పేరు
> అన్నట్టుంది మన పని!!
> ఆ Tux కి లంకె కూడా ఇక్కడే ఇచ్చేస్తే బాగుండేది.
>
> ఇంకో దురదృష్టం ఏమిటంటే, మొన్న నేను హైదరాబాదులో ఎంత తిరిగినా తెలుగు
> కీబోర్డు స్టిక్కర్లు దొరకలేదు.
> ఉరుదూ కీబోర్డు వుందంట ఓ కాడ. కానీ తెలుగు లేదంట.
>
> ఇంటర్నెట్ లో స్టిక్కర్లు దొరుకుతున్నాయిగానీ, మరీ 12 డాలర్లు.

> ఎవరైనా ఈ స్టిక్కర్లు ఎక్కడ దొరుకుతాయో చెప్పగలిగితే బాగుంటుంది.http://www.datacal.com/telugu-overlays.htm

arjuna rao chavala

unread,
Sep 27, 2009, 1:37:57 PM9/27/09
to telug...@googlegroups.com

psm lakshmi

unread,
Sep 27, 2009, 2:11:13 PM9/27/09
to telug...@googlegroups.com
మీ కీ బోర్డు తెల్లదయితే దానిమీద పెన్నుతో అక్షరాలు రాసుకోండి. టైపు చేస్తుంటే చెరిగి పోతాయనుకోండి, మళ్ళీ రాసుకోవచ్చు. ఇలా కొన్ని సార్లు అయ్యేసరికి మీరు చూడకుండా చేసేస్తారు.  ఇది మావారి ఐడియా.  దానితోనే నేను ఇన్ర్స్కిప్ట్ నేర్చుకున్నా.  అసలు లేనిదానికన్నా నయం కదా.
psmlakshmi



2009/9/27 రాకేశ్వర రావు <rake...@gmail.com>

Duvvuri Venu Gopal

unread,
Sep 28, 2009, 12:26:06 AM9/28/09
to telug...@googlegroups.com
 

అర్జున గారూ


మీ ప్రయత్నం చాలా బాగుంది. వీలయితే ఆంగ్లభాషకు ఒకరంగు తెలుగు అక్షరాలకు వేరొకరంగు వాడండి.


అలాగే ౠ ౄ ఌౡ (అలు అలూలు) మరియు ZWNJ (Zero width non joiner)మరియు JWJ (Zero width joiner?) కూడా ఎలా టైపుచెయ్యాలో చెపితే బాగుంటుంది.


ఇంత క్రితం ఒక సైటులో pdf లో మీటకం యొక్క చిత్రం దొరికింది. వారు కూడా పైన చెప్పినవి కావాలంటే ఎలా టైపుచేసుకోవాలో వ్రాస్తే ఇంకా బాగుంటుంది.


దీన్ని A4 ఆకారంలో దొరికే స్టికర్ పేపరు మీద ప్రింటు చేసుకుని కీబోర్డు మీద అతికించు కోవచ్చు.


దువ్వూరి వేణుగోపాల్



2009/9/27 arjuna rao chavala <arjun...@googlemail.com>

Duvvuri Venu Gopal

unread,
Sep 28, 2009, 12:29:11 AM9/28/09
to telug...@googlegroups.com
 

నేను iLeap కొన్నప్పుడు (1999 లో అనుకుంటా) C-DAC వాడు దానితో పాటు ఇన్స్క్రిప్ట్ స్టిక్కర్లు కూడా ఇచ్చాడు (తెలుగో హిందీయో గుర్తులేదు). అలాగే నాకు ఇన్స్క్రిప్ట్ కీబోర్డు వచ్చింది.


వేణుగోపాల్



2009/9/27 రాకేశ్వర రావు <rake...@gmail.com>

arjuna rao chavala

unread,
Sep 28, 2009, 8:58:47 PM9/28/09
to telug...@googlegroups.com
నా జవాబు మీ జాబులో వుంది.
అర్జున

2009/9/28 Duvvuri Venu Gopal <dvg...@gmail.com>

 

అర్జున గారూ


మీ ప్రయత్నం చాలా బాగుంది. వీలయితే ఆంగ్లభాషకు ఒకరంగు తెలుగు అక్షరాలకు వేరొకరంగు వాడండి.


ధన్యవాదాలు.

అలాగే ౠ ౄ ఌౡ (అలు అలూలు) మరియు ZWNJ (Zero width non joiner)మరియు JWJ (Zero width joiner?) కూడా ఎలా టైపుచెయ్యాలో చెపితే బాగుంటుంది.


ఇవి ఇంకా ప్రామాణీకరించలేదు.

ఇంత క్రితం ఒక సైటులో pdf లో మీటకం యొక్క చిత్రం దొరికింది. వారు కూడా పైన చెప్పినవి కావాలంటే ఎలా టైపుచేసుకోవాలో వ్రాస్తే ఇంకా బాగుంటుంది.


దీన్ని A4 ఆకారంలో దొరికే స్టికర్ పేపరు మీద ప్రింటు చేసుకుని కీబోర్డు మీద అతికించు కోవచ్చు.


ఔను. అలానే చేశాను.
Reply all
Reply to author
Forward
0 new messages