సందేహం: టపా కిందనే వ్యాఖ్యలడబ్బా ఎలా?

1 view
Skip to first unread message

రానారె

unread,
Sep 8, 2007, 1:46:23 PM9/8/07
to తెలుగుబ్లాగు
ప్రియ మిత్రులారా,

బ్లాగ్‌స్పాట్‌ బ్లాగుల్లో కూడా కొన్ని వర్డ్‌ప్రెస్ బ్లాగుల్లో లాగా
టపా కిందనే వ్యాఖ్యలడబ్బా ఉంటే బాగుండునని నా కోరిక. కొన్ని క్లిక్కులూ
కొన్ని పెజీలను తెరవడాలూ కొన్ని కిటికీలను మూయడాలూ తగ్గించుకోవచ్చు.
దీనికేదైనా మార్గం ఉన్నదా?.

కృతజ్ఞతలు,
రానారె

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Sep 9, 2007, 9:53:24 AM9/9/07
to తెలుగుబ్లాగు
బ్లాగర్ కార్యక్రమణం ఈ సౌకర్యాన్ని అందించడంలేదు. అయితే ఇందుకోసం బాహ్య
మృదు సామానుల (softwares)ని మన బ్లాగుకు జతచేర్చవచ్చు. అలాంటివాటిల్లో
ఒకదాని లంకె ఇక్కడ ఇస్తున్నాను. కాని ఇందుకు కొంత "కరుసవుద్ది"".

http://pearlcrescent.com/pearlcomments/software/

రాకేశ్ ఆచంట

unread,
Sep 10, 2007, 5:49:07 AM9/10/07
to తెలుగుబ్లాగు
గూగుల్ వాడు మెయిళ్లలో ఇలాంటి అద్భుత సౌకర్యం ఇచ్చాడు కాని. బ్లగులలో
ఇవ్వలేదు.
స్పాం ఎక్కువస్తుందని భయమేమో ...

అందం.బ్లాగుస్పాటు.కామ

రాకేశ్వర రావు

unread,
Oct 8, 2007, 2:31:37 PM10/8/07
to తెలుగుబ్లాగు
రానారె,

కొన్ని రోజుల క్రితం మీరడిగిన టపా క్రింద వ్యాఖ్యల డబ్బా వచ్చేటట్టు చేసే
ఉపాయం...
http://www.jackbook.com/2007/06/how-to-make-readers-leave-comment.html

ఇది బానే పనిచేస్తుందనుకుంట, మీ మనిషి మీద ప్రయత్నించి చూడండి, ఎవన్నా
సైడ్ఎఫెక్ట్స్ వస్తే మాకూ చెప్పండి :)

రాకేశ్వర
అందం.బ్లాగుస్పాటు.కాం

On Sep 8, 10:46 pm, రానారె <iamramuh...@gmail.com> wrote:

బ్లాగేశ్వరుడు

unread,
Oct 8, 2007, 8:23:32 PM10/8/07
to telug...@googlegroups.com
రాకేశ్వరా!!
కొన్ని రోజుల క్రితం మీరడిగిన టపా క్రింద వ్యాఖ్యల డబ్బా వచ్చేటట్టు చేసే
ఉపాయం...
http://www.jackbook.com/2007/06/how-to-make-readers-leave-comment.html

ఇది బానే పనిచేస్తుందనుకుంట, మీ మనిషి మీద ప్రయత్నించి చూడండి, ఎవన్నా
సైడ్ఎఫెక్ట్స్ వస్తే మాకూ చెప్పండి :)
 
నో ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ మాట ప్రక్కన, చాలా కష్టపడి వాడు ఇచ్చిన కోడు వెతికి పట్టి దాని ప్రదేశం వాడు అంటించమన్న కోడు అంటించాను ఫలితం శూన్యం
--
బ్లాగేశ్వరుడు
www.blogeswaradu.blogspot.com

రాకేశ్వర రావు

unread,
Oct 12, 2007, 7:30:40 AM10/12/07
to తెలుగుబ్లాగు
పని చేయట్లేదా ?
హూఁ... బహు విచారకరము !

అన్నట్టు మాటలబాబు నుండి బ్లాగేశ్వరుడిగా కొత్త అవతారం దాల్చారా ఎంటి ?
బ్లాగ్ + ఈశ్వరుడు = బ్లాగీశ్వరుడు అవుతుందిగా ?
యక్ష ప్రశ్నలకు మన్నించగలరు.

విధేయుడు
ఆచంట వీర వెంకట సత్య మహమ్మద్ సుబ్రహ్మణ్య సాయి లక్షీసమేత
శ్రీసింహాద్రిఅప్పలనరసింహస్వామి వరప్రసాద సీతారామాంజనేయలక్షణుల మేరీతనయ
యేసు ప్రభువుల రాకేశ్వర రావు రెడ్డి నాయిడు శాస్తి అప్ప సాయిబు
http://అందం.blogspot.com/


On Oct 9, 5:23 am, "బ్లాగేశ్వరుడు" <s172142230...@googlemail.com>
wrote:


> రాకేశ్వరా!!
> కొన్ని రోజుల క్రితం మీరడిగిన టపా క్రింద వ్యాఖ్యల డబ్బా వచ్చేటట్టు చేసే

> ఉపాయం...http://www.jackbook.com/2007/06/how-to-make-readers-leave-comment.html

బ్లాగేశ్వరుడు

unread,
Oct 15, 2007, 12:50:49 AM10/15/07
to telug...@googlegroups.com

> పని చేయట్లేదా ?
> హూఁ... బహు విచారకరము !
>
> అన్నట్టు మాటలబాబు నుండి బ్లాగేశ్వరుడిగా కొత్త అవతారం దాల్చారా ఎంటి  ?
> బ్లాగ్ + ఈశ్వరుడు = బ్లాగీశ్వరుడు అవుతుందిగా ?
> యక్ష ప్రశ్నలకు మన్నించగలరు.
>
ఏ సంధో ముందు పరవస్తు వారి దగ్గరకి వెళ్ళి అడగాలి.

> విధేయుడు
> ఆచంట వీర వెంకట సత్య మహమ్మద్ సుబ్రహ్మణ్య సాయి లక్షీసమేత
> శ్రీసింహాద్రిఅప్పలనరసింహస్వామి వరప్రసాద సీతారామాంజనేయలక్షణుల మేరీతనయ
> యేసు ప్రభువుల రాకేశ్వర రావు రెడ్డి నాయిడు శాస్తి అప్ప సాయిబు
> http://అందం.blogspot.com/
>
--
బ్లాగేశ్వరుడు

మాకినేని ప్రదీపు

unread,
Oct 15, 2007, 1:10:41 AM10/15/07
to తెలుగుబ్లాగు
> బ్లాగ్ + ఈశ్వరుడు = బ్లాగీశ్వరుడు అవుతుందిగా ?

బ్లాగే ఈశ్వరుడు = బ్లాగేశ్వరుడు :)

--
మాకినేని ప్రదీపు

బ్లాగేశ్వరుడు

unread,
Oct 15, 2007, 1:51:15 AM10/15/07
to telug...@googlegroups.com
ఇంకా ఇక్కడే ఈ చర్చ జరిపితే  నన్ను ఈ గుంపు నుండి  తంతారు . రాకేశ్వరుడు ప్రశ్న లేవనెత్తాక ఒకసారి వికీ లొ ఉన్న సంధులు పేజి చూశను. సంధి విడదీయడానికి సంస్కృత సంధిగా కుదరడం లేదు, తెలుగు సంధిగా  కూడా కుదరడం లేదు. బ్లాగ్ (?సంస్కృతం) బ్లాగు (తెలుగు) అనుకొంటే రెండు విధాలుగా సంధి విడబడదు. ఒకసారి చదువరి గారు , రాకేశ్వరుడూ జరిపిన చర్చ  దీని కూడా చూడండి. నిర్వాహుకులు మన్నించాలి ఈ చర్చకు....

--
బ్లాగేశ్వరుడు
http://blogeswaradu.blogspot.com
Reply all
Reply to author
Forward
0 new messages