http://www.maganti.org/

72 views
Skip to first unread message

cbrao

unread,
May 4, 2007, 10:21:39 PM5/4/07
to telug...@googlegroups.com
వంశీ మాగంటి - మీ వెబ్సైట్ గురించి చాలా మంది చెప్పుకోవటమూ, కాపీ హక్కులపై తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. మాలిని మీ వెబ్ సైట్ లోని విశేషాలు తరచూ రాస్తుంటారు. మీరు ఇక్కడ సభ్యులు కాక మునుపే మంచి కాఫీ లాంటి మీ వెబ్సైట్ పరిమళాలు ఇక్కడకు వ్యాపించాయి. జీన్ పాల్ సాత్రె చెప్పినట్లుగా ఆయన existentialism సిద్ధాంతం ప్రకారం మీ వెబ్ సైట్ ఉంది కాబట్టి మీరు ఉన్నట్లే. కల్పిత వ్యక్తి కారు. మీ సైట్ పై కాఫీ హక్కులు లేవనుకోవటానికి కారణం కాఫీ పై సర్వ హక్కులూ Coorg వారివే అని ఒక ముద్ర మీలో ఉండి ఉంటుంది. మీ self introduction కోసం ఎదురు చూస్తాము. నలుగురికీ ఉపయోగ పడేలా సైట్ చెయ్యటానికి మీకు ప్రేరణ ఏమిటి?  ఇంత పెద్ద పని ఎలా చేశారు?  

Vamsi Maganti

unread,
May 5, 2007, 9:16:11 PM5/5/07
to తెలుగుబ్లాగు
సీ బీ రావు గారు

గొప్ప ఇరకాటంలో పడేసారు రెండే రెండు ప్రశ్నలతో.. మీలో మంచి హాస్యం కూడా
దాగుంది.

సరే అనవసర ఉపోద్ఘాతం లేకుందా, మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పే
ప్రయత్నం చేస్తాను.

నా మొదటి సమాధానం ఇరుకున పెట్టిన మీ రెండవ ప్రశ్నకి - "ఇంత పెద్ద పని
ఎలా చేసారు" - అని అన్నదానికి సమాధానం చెప్పటం కొంచెం కష్టమే. ఎందుకంటే
నాకు సంబంధించినంత వరకు ఇది పనిగా కాక, ఒక బాధ్యత గా భావించి చేసాను,
చేస్తున్నాను, చేస్తూ ఉంటాను. బాధ్యత ఎందుకు అన్నాను అంటే దానికి
కారణాలు చాలా ఉన్నాయి. ఇక్కడ వాటి అన్నిటిని గురించి రాయాలి అంటే ఒక
చాంతాడు అవుతుంది. టూకీగా ఒక్క మాటలో చెప్పాలి అంటే తెలుగు వాడిగా
పుట్టినందుకు అని ఒక్క కారణం మాత్రం చెప్పగలను. ఇంక అంత కన్నా ఎక్కువ
రాయలేను ఇక్కడ.

ఇక మీ మొదటి ప్రశ్నకి నా సమాధానం - "మీకు ప్రేరణ ఏమిటి?" అన్నదానికి
ముఖ్యం గా ముచ్చటగా మూడు కారణాలు. ఇంకా కారణాలు చాలా ఉన్నాయి కానీ ఈ మూడు
మటుకు నా వెబ్సైటు తయారు అవ్వటానికి ముఖ్య మూలాలు.

1) మా అమ్మమ్మ కమలమ్మ గారు,తాతయ్య కాశీభట్ల వీర రాఘవయ్య గారు, నానమ్మ
రామలక్ష్మి గారు, తాతగారు మాగంటి రామస్వామి శాస్త్రిగారు. మా అందరు
పిల్లల పట్ల వారు చూపించిన వారి పేమ అభిమానాలు ఆప్యాయతలు, ఎలాంటి
స్వార్ధం లేకుండా - వాళ్ళ స్వంతానికి ఉన్నదో లేదో కూడా చూసుకోకుండా
వాళ్ళు చేసిన సంఘసేవ అనేది మొదటి ప్రేరణ.

2) మా నాన్న శివరామ శర్మ గారి సాహిత్యాభిలాష. ఆయన దగ్గర వందలాది మంచి
మంచి పుస్తకాలు ఉండేవి. వాటితో పాటు పెరిగిన వాతావరణం రెండవ ప్రేరణా
సాధనం.

3)మూడవది, నా వెబ్సైటు తప్పటడుగులు వేస్తున్న రోజుల్లో జరిగిన ఒక సంఘటన.
ఒక ఆయన మన భాష గురించి, తెలుగువారి గురించి చేసిన ఒక హేళణాత్మకమయిన
వ్యాఖ్య. పేర్లు, జరిగిన సంఘటన అవీ ప్రస్తుతం అప్రస్తుతం అనుకోండి. ఆ
సంఘటనని ప్రేరణ అనొచ్చో లేదో నాకు తెలీదు కానీ - నాలో ఒక విధమయిన కసిని
మాత్రం రెచ్చ గొట్టింది. ఒక విధంగా ఆ సంఘటనకి కారణమయిన వ్యక్తి కి
ధన్యవాదాలు చెప్పుకోవాలి కూడా. అదే జరగకపోయి ఉంటే మీ అందరి తో పరిచయం
జరిగేది కాదు. మీ అభిమానాన్ని సంపాదించుకునే వాడిని కానేమో.

అవండి టూకీగా నా సమాధానాలు.

త్రివిక్రం, చందు, చావా కిరణ్ లాంటి కొంత మంది మన తెలుగు బ్లాగ్మిత్రులకి
ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకో వారికి తెలుసు, నాకు తెలుసు. :)

ఇంక ఇంత కన్నా ఎక్కువ రాస్తే మీ అందరి సమయాన్నీ వృధా చేసిన వాడిని
అవుతాను. తరువాతి జాబులో మళ్ళీ ఎప్పుడన్నా...


సెలవు

విధేయుడు
వంశీ
www.maganti.org/index1.html


Vamsi Maganti

unread,
May 7, 2007, 12:57:00 PM5/7/07
to తెలుగుబ్లాగు

ఈ జీన్ పాల్ సాత్రే గారు ఎవరు , ఆయన కథా కమామీషు ఏమిటో కొంచెం
వివరిస్తారా ?

Regards
Vamsi M Maganti
www.maganti.org/index1.html

cbrao

unread,
May 7, 2007, 1:56:34 PM5/7/07
to telug...@googlegroups.com
జీన్ పాల్ సాత్రె

గులాబీ వాసన మీ ముక్కులకు తగిలిందా?  వాసన ఉంది కాబట్టి పువ్వు ఉండి తీరాలి. పరిమళం ద్వారా గులాబీ ఉనికిని గుర్తించటం existensialism. తన సిద్ధాంతాలకు దూరం కావాల్సొస్తుందని నొబెల్ బహుమతి తిరస్కరించాడు సాత్రె.  ఎక్కువ వివరాల కోసం

http://en.wikipedia.org/wiki/Jean-Paul_Sartre
http://www.iep.utm.edu/s/sartre-ex.htm  
Reply all
Reply to author
Forward
0 new messages