సహాయం కావలెను: Logical Fallacy

13 views
Skip to first unread message

అష్టావక్ర

unread,
Nov 20, 2008, 8:46:04 AM11/20/08
to తెలుగుబ్లాగు
Logical Fallacy తెలుగు సమానర్థకం ఏమన్నా ఉందా?

బ్రౌణ్య ఆంగ్లము-తెలుగు నిఘంటువు లో వారిచ్చిన పదములు గానీ, దానిని
వివరించటానికి వాడిన ఉదాహరణ గానీ నాకు సుతరామూ సరి అయినవని అనిపించటం
లేదు.

నిఘంటువులో ఉన్న వివరణ ఇది:

మోసము, మాయ, భ్రమ, వంచన, కృత్రిమము, పితలాటకము, టక్కు. It is a mere * to
say that education in English will not shake the prejudices of the
Hindus యింగ్లీషు చదవడము చేత హిందువులయొక్క మతమునకు భంగము కాదని చెప్పడము
వట్టి భ్రమ.

Narayanaswamy

unread,
Nov 20, 2008, 10:38:47 AM11/20/08
to telug...@googlegroups.com
ఇక్కడ రెండు మార్గాలు ఉన్నాయని నాకు అనిపిస్తోంది.
మీ రచన ఉద్దేశ్యం ఏవిటన్న దాన్ని బట్టి మీకు తగిన మార్గాన్ని ఎంచుకోవచ్చు.
మీరు ఉపయోగించే సందర్భం సైద్ధాంతిక నేపథ్యం గలది ఐతే, మీరు సరి అయిన (అంటే అపార్ధం చేసుకోడానికి వీలు లేని) పరిభాష పదం (technical jargon) ఉపయోగించాలి. Logical fallacyకి సరిపోయే అటువంటి పారిభాషిక పదం మరి నాకు తెలియదు, తర్కశాస్త్రం కొద్దిగా అయినా చదివిన వారికి తెలియ వచ్చు.
మీ సందర్భం మీ వాదనని వినిపించడం (a rhetorical use) తెలుగు నుడికారపు సమానార్ధాలు ఏవైనా సరిపోతాయి. సరిపోవడమే కాదు, చదవడానికి, అర్ధం చేసుకోడానికీ బావుంటాయి కూడానూ.
ఉదాహరణకి కింది ఉదాహరణ వాక్యాన్ని మన సమకాలీన నుడికారంలో ఇలాక్కూడా చెప్పొచ్చు:
ఇంగ్లీషు విద్య వల్ల హిందువుల మతానికి ఏమీ భంగం జరగదని చెప్పడం చెవుల్లో పూలు పెట్టడమే!
అభినందనలతో
నారాయణస్వామి
 


 
2008/11/20 అష్టావక్ర <jnana...@gmail.com>

Yogi

unread,
Nov 20, 2008, 10:58:31 AM11/20/08
to telug...@googlegroups.com
ప్రత్యుత్తరానికి కృతజ్ఞతలు!!
మీరన్నట్లు సందర్భం సైధ్ధాంతిక  నేపధ్యం గలదే, అందుకే అపార్థం చేసుకోలేనికి వీలులేని పరిభాషా పదం కావాలి.
ఇక్కడెవ్వరయినా తర్కశాస్త్రం చదివిన వాళ్ళు ఉంటే, తెలుగు పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయో తెలుపగలరు.
అన్నట్లు, మీరు వాడిన ఉదాహరణ బాగుంది

స్నేహపూర్వక అభినందనలతో,
యోగి

2008/11/20 Narayanaswamy <kott...@gmail.com>

తాడేపల్లి Lalitha Bala Subrahmanyam Tadepalli

unread,
Nov 20, 2008, 11:56:14 AM11/20/08
to telug...@googlegroups.com
పదాలకేం ? చాలా ఉన్నాయి తెలుగులో. కానీ వాటిని అంగీకరించి ఉపయోగించే మానసిక సంసిద్ధత మనలో ఉందా ? లేదా ? అనేది ఎక్కువ ముఖ్యమైన విషయం. నా అనుభవం ఏంటంటే - గతంలో నేను చాలా మంచి పదాల్ని సూచించిన సందర్భాల్లో వారివారి ప్రిజుడీసుల మూలంగా (అంటే వాడుకభాష మొ|| దురభిమానాలు) సరిపోలని, ఇప్పటికే ఒక అర్థంలో స్థిరపడ్డ, తక్కువ నాణ్యత గల పాత వాడుక పదాల వైపు కొందఱు మొగ్గు చూపడం జరిగింది.

కొత్తపాళీగారన్నట్లు మీరు ఏ సందర్భంలో వాడాలనుకుంటున్నారో తెలిస్తే మన పని సులభమవుతుంది. Logical fallacy కి యుక్తివ్యాఘాతం సరైన పదంలా నాకు తోస్తున్నది.

౨౦౦౮ నవంబర్ ౨౦ ౨౧:౨౮ న, Yogi <jnana...@gmail.com> ఇలా రాసారు :



--
నెనర్లు. (Thanks)

Yours Truly
T. Lalitha Bala Subrahmanyam

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org
Reply all
Reply to author
Forward
0 new messages