తెలుగు కథల భాండాగారం కథానిలయం పన్నెండవ వార్షికోత్సవం ఈ నెల రెండో
శనివారం, ఆదివారం శ్రీకాకుళంలో జరగనుంది. ఈ కార్యక్రమానికి
సాహితీప్రియులందరికీ ఆహ్వానం. శనివారం అంటే 14వ తేదీ రచయితల ఇష్టగోష్టి
వుంటుంది. కథానిలయం మేడమీద జరిగే ఈ కార్యక్రమం సాయంత్రం ఆరంభమవుతుంది.
అదేరోజు విజయనగరం నుంచి ఈ-తెలుగు మిత్రులు చివుకుల కృష్ణమోహన్
(9000343539) సంక్షిప్త ప్రసంగం వుంటుంది. వివినమూర్తి గారిని మరిన్ని
వివరాలకు సంప్రదించడానికి వీలుగా ఆయన నెంబరు కూడా ఇస్తున్నాను.
9705471377. ఇక ఆదివారం అంటే 15వ తేదీ ముఖ్య అతిథిగా వకుళాభరణం రామకృష్ణ
హాజరుకానున్నారు. కవి శివారెడ్డి ప్రత్యేక సాహితీ ప్రసంగం చేస్తారు.
కవనశర్మ, కారా, తదితర ప్రముఖ రచయితలంతా ఈ పాల్గొనే సాహితీ గోష్టిలో
పాల్గొనమని ఇదే ఆహ్వానం. అన్నట్టు ఆదివారం పుస్తక ప్రదర్శన, అమ్మకాలు
వుంటాయి. ఇరవై, ఇరవైఐదు శాతం తగ్గింపు ధరలతో అందివ్వగల రచయితలు తమ
పుస్తకాలను అమ్మదలచుకుంటే వెంటనే నా నెంబరుకు (9989265444) సంప్రదించాలి.
నమస్తే.
-రవికుమార్
http://chaduvu.wordpress.com