ఇన్నిరోజులు స్వచ్చంగా ఉన్న మన బ్లాగులోకం కలుషితమవ్వసాగింది.పేరు కూడా చెప్పలేని తలకుమాసిన వెధవలు అదేనండి అనానిమాసురులు...అర్ధం పర్ధం లేని కామెంట్లు రాయడం మొదలెట్టారు. నా మీద దాడి మొదలైంది. అందుకే నా బ్లాగులో మొదటిసారిగా వ్యాఖ్యలు మోడరేషన్లో పెట్టాను. మంచిదైంది. అసభ్య వ్యాఖ్యలు మొదలయ్యాయి. మీరు ఇలా చేయడం మంచిదేమో.???ఇలాంటి వాళ్ళకు సమాధానమివ్వడం పెంటలో రాయి వేయడమే. దానికన్నా వారిని నిరోధించడం మేలు>>>
తెలుగు బ్లాగర్లందరికి నమస్కారం
గత రెండురోజులుగా నా మీద జరుగుతున్న దుష్ప్రచారం మీకందరికి తెలుసు. కాని ఎవరి స్పందన లేదు . మాకెందుకులే అని ఊరకున్నారా. నేను మొన్న ఈ విషయం కొత్తపాళిగారు చెప్తే తెలుసుకుని బాధపడ్డా . కాని వాడికి సమాధానం ఇస్తే ఇంకా రెచ్చిపోతాడని ఊరకున్నా. కాని పనికట్టుకుని అందరి బ్లాగులలొ ప్రచారం చేస్తుంటే , కోపం వచ్చింది. నా అనుమానం లలిత బ్లాగులో నేను ఇచ్చిన ఘాటైన సమాధానం ఫలితం ఇది. ఇలాంటి మానసిక రోగులనుండి రక్షించుకోవాలని నిర్ణయించుకుని ఇవాళ నా బ్లాగులో సమాధానం ఇచ్చాను. ఇలాంటివి జరుగుతుంటే ఎవరి స్పందనా , ఏమీ లేకపోతే ఎవరైనా మహిళలు బ్లాగులు రాయడానికొస్తారా . నేను ఇంతవరకు ఎంతోమందిని బ్లాగులు రాయమని ప్రోత్సహించాను. కాని ఇలాంటి విషయాలలో నా పేరు ఇలా మారుమ్రోగడం నాకిష్టం లేదు . నా మీద జరిగిన ఈ దుష్ప్రచారం చదివి ఎవరైనా మగవాళ్ళూ తమ ఆడవాళ్ళను బ్లాగులు రాయనిస్తారా??ఇంతకంటే అసభ్యంగా రాయొచ్చు . అప్పుడు ఏం చేస్తారు. ఆలోచించండి . నేను కూడా ఆడవాళ్ళని అస్సలు రాయొద్దని చెప్పవలసి వస్తుంది . నా అనుభవంతో. ఎప్పుడు గాని చెడు త్వరగా వ్యాపిస్తుంది. కాని మంచి జయిస్తుంది చివరికి కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.
ఈ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. నా చివరి ప్రయత్నం చేసాను. కాని ఇది ఇక్కడితో ఆగకపోతే , ఇంకా విషమంగా తయారైతే, దీనిని అరికట్టడానికి మీ సహాకారం లేకుంటే మాత్రం నేను బ్లాగులు రాయడం మానేద్దామనుకుంటున్నాను. భయపడి కాదు. నా పేరు ఇలా నీచంగా రాయడం నాకు ఇష్టం లేదు .
On Nov 3, 10:55 am, "jyothi valaboju" <jyothivalab...@gmail.com>
wrote:
> తెలుగు బ్లాగర్లందరికి నమస్కారం
>
> గత రెండురోజులుగా నా మీద జరుగుతున్న దుష్ప్రచారం మీకందరికి తెలుసు. కాని ఎవరి
> స్పందన లేదు. మాకెందుకులే అని ఊరకున్నారా. నేను మొన్న ఈ విషయం కొత్తపాళిగారు
> చెప్తే తెలుసుకుని బాధపడ్డా. కాని వాడికి సమాధానం ఇస్తే ఇంకా రెచ్చిపోతాడని
> ఊరకున్నా. కాని పనికట్టుకుని అందరి బ్లాగులలొ ప్రచారం చేస్తుంటే, కోపం వచ్చింది.
> నా అనుమానం లలిత బ్లాగులో నేను ఇచ్చిన ఘాటైన సమాధానం ఫలితం ఇది. ఇలాంటి మానసిక
> రోగులనుండి రక్షించుకోవాలని నిర్ణయించుకుని ఇవాళ నా
> బ్లాగులో<http://vjyothi.wordpress.com>సమాధానం ఇచ్చాను.
- నల్లమోతు శ్రీధర్
ఎట్లా చూసినా వాడు చేసింది
1) అబ్సెసివ్ కంపల్సివ్ ప్రవర్తనగానూ
2) పనిగట్టుకు చేసిన స్పామింగ్ గానూ, కనిపిస్తోంది.
ఈ ప్రవర్తన వెనుక ఉన్న విషపూరిత మన్స్తత్వాన్ని మనం సహించి ఊరుకోరాదు.
జ్యోతిగారికి మద్దతు చూపటం కోసమే కాదు, సభ్యసమాజంలో అసభ్య ప్రవర్తనకి
తావులేదని ఈ మనిషికి తెలిసొచ్చేట్టు మనం గట్టిగా సమాధానం చెప్పాలి.
నా ప్రతిపాదనలు:
1. వాడి బ్లాగుని కూడలిలోని అన్ని జాబితాల నుండి తొలగించడం.
2. వాడు ఎవరి బ్లాగుల్లో వ్యాఖ్యలు పెట్టజూసినా అనుమతించకపోవటం, ఇప్పటికే
పెట్టిన వాటిని తీసిపారెయ్యడం.
3. ఎవరూ వాడి చెత్తకుప్ప బ్లాగుకేసి చూడకుండా ఉండటం.
4. బ్లాగు గుంపులోనూ, తమ బ్లాగు టపాల్లోనూ బ్లాగరులందరూ ఈ ప్రవర్తనని
నిర్వివాదంగా ఖండించటం.
భవదీయుడు,
కొ.పా.
On Nov 3, 1:55 am, "jyothi valaboju" <jyothivalab...@gmail.com> wrote:
> తెలుగు బ్లాగర్లందరికి నమస్కారం
>
> గత రెండురోజులుగా నా మీద జరుగుతున్న దుష్ప్రచారం మీకందరికి తెలుసు. కాని ఎవరి
> స్పందన లేదు. మాకెందుకులే అని ఊరకున్నారా. నేను మొన్న ఈ విషయం కొత్తపాళిగారు
> చెప్తే తెలుసుకుని బాధపడ్డా. కాని వాడికి సమాధానం ఇస్తే ఇంకా రెచ్చిపోతాడని
> ఊరకున్నా. కాని పనికట్టుకుని అందరి బ్లాగులలొ ప్రచారం చేస్తుంటే, కోపం వచ్చింది.
> నా అనుమానం లలిత బ్లాగులో నేను ఇచ్చిన ఘాటైన సమాధానం ఫలితం ఇది. ఇలాంటి మానసిక
> రోగులనుండి రక్షించుకోవాలని నిర్ణయించుకుని ఇవాళ నా
> బ్లాగులో<http://vjyothi.wordpress.com>సమాధానం ఇచ్చాను.
రమణ అనే పేరుతో ఒక వ్యక్తి నిజం నిజం అనే పేరిట ఒక బ్లాగు సృష్టించి
అందులో జ్యోతిగారి మీద (ముఖ్యంగా ఆమె బ్లాగులో రాసే విషయాల గురించి)
అవాకులూ చెవాకులూ రాశాడు. పాడిందే పాడరా అన్నట్టు ఒకే విషయాన్ని నాలుగైదు
టపాలుగా రాసుకుని వాటిల్నే రెండు మూడేసి సార్లు పోస్టుచేసుకున్నాడు.
అదిచాలక కూడలి100 బ్లాగుల్లో ఆనాడు తాజాగా ఉన్న టపా కింద "నా బ్లాగు
చూడండి" అని ఒకే మెసేజి అన్ని బ్లాగుల్లో పెట్టాడు.
ఎట్లా చూసినా వాడు చేసింది
1) అబ్సెసివ్ కంపల్సివ్ ప్రవర్తనగానూ
2) పనిగట్టుకు చేసిన స్పామింగ్ గానూ, కనిపిస్తోంది.
ఈ ప్రవర్తన వెనుక ఉన్న విషపూరిత మన్స్తత్వాన్ని మనం సహించి ఊరుకోరాదు.
జ్యోతిగారికి మద్దతు చూపటం కోసమే కాదు, సభ్యసమాజంలో అసభ్య ప్రవర్తనకి
తావులేదని ఈ మనిషికి తెలిసొచ్చేట్టు మనం గట్టిగా సమాధానం చెప్పాలి.
నా ప్రతిపాదనలు:
1. వాడి బ్లాగుని కూడలిలోని అన్ని జాబితాల నుండి తొలగించడం.
2. వాడు ఎవరి బ్లాగుల్లో వ్యాఖ్యలు పెట్టజూసినా అనుమతించకపోవటం, ఇప్పటికే
పెట్టిన వాటిని తీసిపారెయ్యడం.
3. ఎవరూ వాడి చెత్తకుప్ప బ్లాగుకేసి చూడకుండా ఉండటం.
4. బ్లాగు గుంపులోనూ, తమ బ్లాగు టపాల్లోనూ బ్లాగరులందరూ ఈ ప్రవర్తనని
నిర్వివాదంగా ఖండించటం.
భవదీయుడు,
కొ.పా.
ఇతని బ్లాగు ఇప్పటివరకు కూడలిలో లేదు. కొత్త కూడలినుండి తీసేసా.
On Nov 3, 11:28 pm, "శిరీష్ కుమార్ తుమ్మల" <sirishtumm...@gmail.com>
wrote:
IP చిరునామా తెలిసినా మఱొకటి తెలిసినా అతని మీద ఏ ప్రాతిపదిక మీద చర్య
తీసుకోగలం, ఏ చర్య తీసుకోగలం అనేది నాకు అర్థం కావడంలేదు. అతను ఒక ఆరోపణ
చేశాడు. అంతే ! మిగతా విషయమంతా ఆ ఆరోపణకు విపులీకరణ మాత్రమే. అతని
గురించి బుఱ్ఱబద్దలు కొట్టుకోవడం నాకిష్టంలేదు. Simply ignore him and be
at peace.
On Nov 3, 11:28pm, "శిరీష్ కుమార్ తుమ్మల" < sirishtumm...@gmail.com>
wrote:
> కొత్తపాళీగారు చెప్పినవాటిల్లో మూడోది తప్ప మిగతావన్నీ చెయ్యొచ్చు. రవి,
> శ్రీనివాసరాజులు చేసినట్టు ఫ్లాగు చేస్తే దాన్ని మూసేయించవచ్చు. అయితే.., మనం
> అతడికెన్ని శాపనార్థాలు పెట్టినా, కూడలిలో పెట్టకపోయినా, అతడి గురించి
> మాటాడుకోకపోయినా, ఆ బ్లాగును చూడకుండా మాత్రం ఉండలేం."ఇవ్వాళేం రాసాడో
> చూద్దామ"న్న ఉత్సుకతను ఆపుకోలేమని నా ఉద్దేశ్యం. ఆ బ్లాగుకు ఫ్లాగేస్తే, మరో
> దుకాణం తెరుస్తాడు. అంచేత-
>
> సుధాకరు చెప్పినట్టు అతగాడెవరో మన జతగాడే ననిపిస్తోంది. ఇంత మందిమి ఉన్నాం గద..
> మనమంతా కలిసి అతగాడి ముసుగు లాగెయ్యలేమా!? మనలో కొందరి బ్లాగుల్లోనూ ఈయనగారు
> ఎప్పుడోకప్పుడు రాసే ఉంటాడు కదా! ఇతగాడు రాసాడని అనుకుంటున్న అనామక వ్యాఖ్యల
> ఐపీ అడ్రసు జ్యోతి గారు మనకు చెబుతారు. మన సభ్యులంతా - ముఖ్యంగా వర్డుప్రెస్
> వాడేవాళ్ళు - తమ తమ బ్లాగుల్లో ఆ ఐపీతో ఎవరు రాసారో కూపీ తీస్తారు.
>
> 'నిజాలు' చెప్పాక ఓ నాలుగైదు బ్లాగుల్లో వ్యాఖ్యలు రాసాడు కదా బ్లాగు
> అడ్రసిస్తూ. ఆ ఐపీ అడ్రసులూ జ్యోతిగారు, ఇతర బ్లాగరులు చెప్పేవీ ఒకటేనేమో
> చూద్దాం. ఐపీ అడ్రసు గొప్ప ఆధారమేమీ కాకపోవచ్చు. అసలేమీ లేనిదాని కంటే అది నయం
> కదూ? ఏమో, డొంకను కదిలించే తీగేమైనా దొరుకుద్దేమో! ఆలోచించండి.
ఇది ఒక క్రిటిసిజం లాంటిది.
*ఉదా:* ఎవరయినా ఒక రచన చేస్తే ఎలాగయితే దాని మీద క్రిటిక్స్ అభిప్రాయం చెప్పవచ్చో, అలాంటి దానితో దీనిని
పోల్చవచ్చు.
అలాగని నేను అతనిని సపోర్టు చేస్తున్నానని పొరబడవద్దు.
ఇంతకు ముందు కూడా మన బ్లాగులలో వేరే బ్లాగులను, టపాలను టార్గెట్ చేస్తూ టపాలు వచ్చాయి. అప్పుడు
కూడా ఇలాంటి చర్చలు జరిగాయి కానీ దాని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
కానీ ప్రస్తుత పరిస్థితి లో తేడా ఏమిటంటే విమర్శల కోసమే ఒక బ్లాగు తెరిచాడు రమణ అనే అతను.
ఇప్పటికి ఇగ్నోర్ చెయ్యచ్చేమో, ఎవరూ రెస్పాండ్ కాకుండా. బ్లాగరులో దీనిని ఫ్లాగ్ చేస్తే చెయ్యవచ్చు.
--
నా మదిలో ... | http://praveengarlapati.blogspot.com
> > పేరు ఇలా నీచంగా రాయడం నాకు ఇష్టం లేదు.- Hide quoted text -
>
> - Show quoted text -
చినికి చినికి గాలి వాన కావటం అంటే ఏమిటో ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను. అజ్ఞానంతో మొదలయిన వ్యవహారం ఆవేదనకరంగా మారి విషాదం కలిగిస్తోంది. జ్యోతిగారి పరిస్థితిని సానుభూతితో అర్థం చేసుకోవలసిందే. కాని మనం పరిశీలిస్తున్న పరిష్కారాలు మాత్రం మన స్థాయిలో లేవనిపిస్తోంది. రమణ వ్యాఖ్యలు మళ్లీ చదివాను. అందులో ఏదో ఆక్రోశం కనిపిస్తోంది. ఆ వ్యక్తి (ఆడో మగో తెలియక) చేసిన వ్యాఖ్యల్లోని తప్పు గురించి చర్చిస్తే సరిపోతుంది. కొత్తపాళి గారి బ్లాగులో ఇలాగే అనామకుడి పేరుతో వచ్చిన వ్యాఖ్యలపై మంచి చర్చ జరిగింది. కాని జ్యోతి గారి ఆవేదన చూడటంవల్ల అనుకుంటా తోటి మిత్రులు ఆవేశపడుతున్నారు. కాని దీనికి నాకు నచ్చిన పరిష్కారాన్ని జ్యొతిగారే తమ సమాధానంలో చెప్పారు. ఆ వ్యాఖ్యలు చూస్తే "కోపం రావటం లేదు, జాలి కలుగుతోందని" బ్లాగు అనేది ఇతరులను బాధ పెట్టకుండా మన ఆలోచనలను నలుగురితోను పంచుకోవటానికి. రమణ వ్యాఖ్యలకు దీటుగానే జ్యోతిగారు జవాబు చెప్పారు. రమణ వ్యాఖ్యలు ఏరకంగా తప్పు అని మనం భావిస్తున్నామో వాక్యాల వారీగా చెండాడ వచ్చు. కాని బ్లాగును కనిపించనీయకుండా చేస్తే మాత్రం పరిష్కారం దొరకదని నేను భావిస్తున్నాను. మనం బ్లాగు ప్రారంభించటం ఎంత తేలికో చెబుతూ అందర్నీ ప్రొత్సహిస్తున్నాం.రమణ కూడా వెంటనే మరో బ్లాగు ప్రారంభిస్తే ఏమి చేస్తాం. ఇలా ఎంత కాలం ఆపగలం. రామాయణం చదివినప్పుడు రావణుడు అమ్మవారిని ఎత్తుకువెళ్ళాడని చదవాల్సిందే, అది తప్పు అని ఖండించాల్సిందే, కాని కథ మార్చేస్తామంటే కుదురుతుందో లేదో పెద్దలే చెప్పాలి.
ఇక జ్యోతి గారి జవాబులోని విషయం--అనామక వ్యాఖ్యలపై వారు చేసిన విమర్శలు నేను అంగీకరించలేను. ఎంతో మంది కలం పేర్లతో తమ అభిప్రాయాలను రాస్తున్నారు. మొహమాటం వల్ల, ప్రత్యక్ష పరిచయం వల్ల తమ పేర్లతో చెప్పలేకపోయిన వాటిని అనామక వ్యాఖ్యలుగా రాస్తూన్న విషయం నాకు తెలుసు. అనామక వ్యాఖ్యలు నచ్చని వారు వాటిని తమ బ్లాగులో కనపడనియ్యకపోవటం మంచిది. కాని అలా రాసేవారందరినీ నిందించటం ధర్మం కాదని నేను భావిస్తున్నాను.
ఇక చట్ట పరంగా చర్య తీసుకోగలిగినంత విషయం గాని, అవకాశం గాని ఇందులో ఉందని నేను భావించలేకపోతున్నాను. పోలీసులు, ఫోన్లు, పరిచయాలు అంటూ అనవసరంగా ఈ విషాదాన్ని హాస్యంగా మార్చవద్దు. నా వ్యాఖ్యల్లో తప్పు వుంటే మన్నించండి.పాపం పసివాడని క్షమించండి. నా తప్పుల్ని పదాలవారీగానో వాక్యాల వారీగానో చెండాడవచ్చు. జ్యోతిగారికి వారి బాధను మళ్ళీ కదిపినందుకు మరోసారి క్షమాపణలు. కృతజ్ఞతలతో
బ్రాహ్మీఒక ప్రశ్న: ఈ గ్రూప్ ఉద్దేశాలననుసరించి, ఈ thread ఆఫ్ టాపిక్కా, కాదా?
Chandu
On Nov 4, 9:45 pm, "శిరీష్ కుమార్ తుమ్మల" <sirishtumm...@gmail.com>
wrote:
> > ఒక ప్రశ్న: ఈ గ్రూప్ ఉద్దేశాలననుసరించి, ఈ thread ఆఫ్ టాపిక్కా, కాదా?
>
> రమణమూర్తి గారూ,
> బ్లాగు సమస్యల గురించి గుంపులో చర్చించవచ్చని అనుకున్నాం. అప్పట్లో సమస్యలంటే
> సాంకేతికమైనవనే భావించినట్టున్నాం. బ్లాగు సభ్యత, మర్యాదల గురించి చర్చించొచ్చు
> అని ప్రత్యేకంగా అయితే లేదు. కానీ దానికి ఈ బ్లాగు చోటివ్వాలనే నా అభిప్రాయం.
> సభ్యులకు అభ్యంతరాలుంటే రాయగలరు.
>
> గతంలో ఇలాంటి చర్చే<http://groups.google.com/group/telugublog/browse_thread/thread/fb4d04...>ఒకటి
> జరిగింది.
> -శిరీష్
>
> On 11/4/07, Ramana Murthy <mail...@gmail.com> wrote:
>
>
>
>
>
> > > కాని ఆ వ్యక్తి నా బ్లాగులో కామెంటు చేసేవాళ్ళను కూడా చాలా దారుణమైన పదాలతో
> > అవమానించాడు.
> > ఈ మాట ఇప్పుడు చెప్పడం, మిగతా వాళ్ళందరి సపోర్ట్ ని నిలబెట్టుకునే ప్రయత్నంలా
> > కనిపిస్తోంది..
>
> > > ఇదే నా కోపానికి కారణం.
> > కాదనుకుంటాను; అదే గనక నిజమైన కారణం అయ్యుంటే, కామెంట్లు చేసేవాళ్ళని ఇక
> > నుంచి ఏమీ రాయొద్దని సలహా ఇచ్చి ఊరుకునేవారు కానీ, "..ఇక బ్లాగులు రాయడమే
> > మానేస్తాను.." అన్న ఎమోషనల్ స్టేట్ మెంట్ చేసి ఉండేవారు కాదు గదా!
>
> > > ధైర్యంగా నా బ్లాగులో చెప్పి ఉంటే అతని సందేహాలు తీర్చేదాన్ని .
> > అతను నిజంగా ఏం రాశాడో చాలా మందికి లానే నాకూ తెలీదు. కానీ, ఇక్కడ ప్రశ్న
> > ధైర్యానికి సంబంధించింది కాదు. ఆ అపరిచితుడి వైఖరి ఏమిటో అది చదవనివాళ్ళకి
> > కూడా అర్థమైపోయాక, అతను నిజాయితీతో ప్రవర్తించి ఉండాలనుకోవడం లో అర్థం ఉందా?
>
> > > ఐనా నా బ్లాగులో రాసినవన్నీ నా సొంతరచనలని నేను చెప్పలేదు. కాని మూలాలు
> > అప్పుడప్పుడు ఇవ్వలేదు.
> > ఎంత కన్వీనియెంట్ ఆర్గ్యుమెంట్!
>
> > ---
>
> > ఒక ప్రశ్న: ఈ గ్రూప్ ఉద్దేశాలననుసరించి, ఈ thread ఆఫ్ టాపిక్కా, కాదా?
>
> > - మూర్తి
>
' అనోనిమస్' పేరు మీద వ్యాఖ్యలు రాయడం తప్పు కాదు. అయితే ఆ వ్యాఖ్య అసభ్య పదజాలంతో కాకుండా నిర్మాణాత్మంకంగా, బ్లాగరు రియలైజ్ అయ్యే విధంగా వుండాలి. అనోనిమస్ అనేది పొరపాటు లేదా తెలీక తప్పు చేసిన బ్లాగరుని చీల్చి చెండాడే ' చురకత్తి' వంటిది. అలాగే మంచి బ్లాగరుని విషపూరిత వ్యాఖ్యలతో మనోవేదన పాలు చేస్తుంది. ఆ సందర్భాల్లో బ్లాగరు వేదనకి గురికాకుండా సంయమనంతో వ్యవహరించాల్సి వుంటుంది. కనుక అనోనమస్ పేరున వ్యాఖ్యలు వుండవచ్చు. తప్పుడు వ్యాఖ్యలు కాదు.
ఇక జ్యోతి గారి విషయం. విజ్ఞత గల బ్లాగర్లంతా బాగానే స్పందించారు. నేను చెప్పొదేమిటంటే, సరిగ్గా టపాలు రాసే స్త్రీ బ్లాగర్లు పట్టుమని పదిమంది కూడా లేని మన బ్లాగ్లోకంలో . . .ఏకంగా ఒక బ్లాగు ఓపెన్ చేసి ఒక వ్యక్తి (అది మగైనా ఆడైనా) జ్యోతిగారిని అసభ్యంగా విమర్శించడమే పనిగా పెట్టుకున్నఅతడి బ్లాగుని శిరీష్ గారన్నట్టు ఫ్లాగ్ చేయడమో, తోలగించడమో చేయకపోతే మనంమంతా ఎందుకున్నట్టు. ఎవరో అన్నారు రాయడం అసభ్యంగా లేదు అని. ఈ మాటలు చూడండి.
" ఆ అసలు రచనలే వారి వారి పుస్తకాలలో చదువుకుంటాం గదా ఈవిడ గారికి ఎందుకో ఇంత . . . . . . . . .(ఆ పదం నానోటితో జీవించి వుండగా అనను) "
అది అసభ్య పదం కానేరదా ? స్త్రీ విషయంలో ఆ పదానికి మనం అన్వయించుకునే అర్ధమేమిటి. ఇది అసభ్యత కాదా? నాకైతే అసభ్యంగానే వున్నది . నిజమే 'తాడేపల్లి ' వారన్నట్టు నేను కూడా నా బ్లాగులో వచ్చిన వ్యాఖ్యలు యిష్టం లేనప్పుడు వాటికి సమాధానం రాయను. అదే సమయంలో ఒక వ్యక్తి బ్లాగు ఓపెన్ చేసి మరో వ్యక్తిని అదే పనిగా వీధికి లాగే పనిని ఉపేక్షంచలేను కూడూ. ఇటువంటి పనిని కూడా Ignore చేసి, Quite గా వుండిపోవడం సమర్థనీయం కాదనుకుంటా. సుధాకర్ గారన్నట్టు "అబ్యూస్ మెంట్ సెల్ " కి Inform చేయడమో మరో రకమైన పనిష్మెంటు యిప్పించడమో పెద్ద పని కాదు. మేమూ మనుషులమే. కానీ, సుధాకర్ గారే అన్నట్టు ఒకవేళ అతడు "ఒక మంచి బ్లాగరు అయ్యుంటే " ఈ మాట ఆలోచింపజేస్తోంది. బ్లాగ్లోకంలో "మహావృక్షానికి మట్టి చెద " లాంటి రమణ వంటి వాళ్ళూ, అతడికి వంత పాడేవాళ్ళూ, వెనకేసుకొచ్చేవాళ్ళూ కొంత ఆలోచించగలరు.
ఎవరో అన్నారు. పోలీసులూ, ఫోన్లూతో హాస్యాస్పదం చేయొద్దని. కానీ, ఇటువంటి విషయాల్లో కొంత పరిజ్ఞానం ఉండే అలా అన్నాను. వ్యక్తి ఎవరో తెలిస్తే ఆ పన్లు యింకా సులభం. మామూలు మనుషులకి ఏం చేయాలో అర్ధంగాని కొన్ని రకం పనుల్ని మరో విధంగా పరిష్కరించే మార్గాలు చాలా వున్నాయి. కాకుంటే, నేనిక్కడ గ్రూపు సభ్యుడిని, బాధ్యతగా నడుచుకోవలసిన అవసరం నాకెప్పుడూ వుంది. తొందరపాటున తోటి బ్లాగర్ల కన్నెర్రకి కారణభూతమవుతానేమోననే భయమూ వుంది. అందుకే ఈ నిరీక్షణ. ఏదేమైనా రమణకి మంచి త్రోవన మంచి ప్రయాణం చేయమనే ఎప్పటికీ నా విన్నపం. అలాగే అతడికి వంత పాడేవారికి కూడా. ఎందుకంటే స్త్రీ బ్లాగర్లు లేని బ్లాగ్లోకం అభిలషించ దగ్గది కాదు. అభివృద్ధిదాయకమూ కానేరదు. అందరూ కలిసి రమణ బ్లాగును రూపుమాపుతారో, లేక రమణ ఒక్కడే యింత మంది బ్లాగర్ల వేదన చూసి రియలయజై తన బ్లాగులో పోస్టులు చెరిపి, తనూ మనిషినే ననిపంచుకుంటాడో. . .ఏదైనా మంచి జరుగుతుందనే, జరగాలనే ఆశిస్తాను.
చివరగా ఒకమాట బ్లాగ్లోకంలో జ్యోతి గారు ఒక చిన్న పొరపాటు చేసి వుండొచ్చునేమో గానీ, ఆమె చిరకాలం నుండీ బ్లాగ్లోకంలో చేస్తున్న శ్రమతో, సేవలతో పోలిస్తే ఆ పొరపాటు విలువెంతటిది ? ఏమాత్రపుది? దాన్ని ఆసరా చేసుకుని ఆమెను మనం నిలదీయాల్సిన అవసరం నిజంగా వున్నాదా ?
శోధన సుధాకర్ తో నేను ఎకీభవిస్తున్నా. ఈ ' రమణ ' అనే వ్యక్తి ఆడైనా, మగైనా సునితమైన పరిశీలనా శక్తి కల వాడు. మంచి బ్లాగరు కాగల లక్షణాలున్నాయి. ఇతనికి హెచ్చరికా లేక ఉరితీతా, ఏది సరైనది? జ్యోతక్క తన రచనలలో ముందస్తుగా Source of information ప్రకటించి ఉంటే ఇంత ఉపద్రవం రాకపోయేను.
బ్లాగు మిత్రులకు విన్నపం. ఎదైనా టపాలో మీకు నచ్చని అంశాలుంటే విమర్శించండి. భావాలను ఎలుగెత్తి తిట్టండి. మీ హక్కు నేను కాదనను.వ్యక్తులు మనస్తాపం చెందేలా, ఇలా వ్యక్తిగత వ్యాఖ్యలు చెయ్యకండి. ఈ విషయమై ఇప్పటికే చాలా చర్చ జరిగినది కావున దీనిని త్వరగా ముగించటం అభిలషణీయం.
అసలేం జరిగిందో తెలియదు కాని, మీరు ఇక్కడ ఎ ప్రయోజనం కోసం 'మహిళ' అని
తురుపు ముక్క వాడి, లింగ వివక్ష ప్రదర్సించారో మాత్రం అర్థం కాలేదు !
ముక్కు సూటి,
రవి
On Nov 2, 11:55 pm, "jyothi valaboju" <jyothivalab...@gmail.com>
Jyoti explained how the whole family gets involved / affected if a
lady blogger is questioned.
It is simply not fair to dedicate the amount of energy that seems to
have gone into Mr. Ramana's blog against the one objection he / she
might have against not mentionng / missed source.
Rao garu,
"జ్యోతక్క తన రచనలలో ముందస్తుగా Source of
information ప్రకటించి ఉంటే ఇంత ఉపద్రవం రాకపోయేను."
If that mistake makes this kind of outburst fair, what kind of
outburst suits the hurt it is causing?
Once there was someone publishing kids' stories available in
maganti.org. We requested that person to acknowledge the source, as
that is the respectful way.
There was a whole discussion about copyrights and related issues
then. That was informative.
A mistake can be an opportunity to learn, not to condemn.
Reaction could at least be proportional, not many times over?
Regards,
lalitha.
నేను పొద్దు వారితో మాట్లాడాను.' జ్యొతి గారు source గురించి వివరిస్తూ జాబు రాశారు.తన పొరబాటుకు విచారం వ్యక్తపరిచారు. ఆమె ఉత్తరం పొద్దులో ప్రచురించాము.' ఆ విషయం అయిపోయింది. No disputes.Forget it. రమణను బహిష్కరించటం వలన, మనము ఒక కాబోయే మంచి బ్లాగరును కోల్పోతాము. రమణ తన వివరాలు వెల్లడించాలని నా అభ్యర్దన. ఇక్కడ ఎవరూ తాలిబన్లు లేరు.అతనికి ఎలాంటి ప్రాణ హాని ఉండదు.జ్యొతి ఈనాడు ప్రఖ్యాత బ్లాగరు. తెలుగుబ్లాగు గుంపులో చేరిన కొత్తలో అల్లరి అక్క.నేను అప్పట్లో అక్కను విసుక్కుంటూ,గుంపునుంచి తీసేయాలని ప్రతిపాదన పంపితే, ఆది బ్లాగరుడు, భోలా శంకరుడూ ఐన చావా కిరణ్ హమీతో, నేను మౌనం వహించా.నేడు జ్యోతక్క టపాలు అందరికీ ఇష్టమయ్యాయి. ప్రసిద్ధి గాంచాయి. రమణ భవిష్యత్ లో ఒక శోధన సుధాకర్ కావచ్చేమో? ఎవరైనా ఊహించారా జ్యొతక్క ఇంత popular blogger అవుతుందని? రమణ ఒక మెరిసే నక్షత్రం కావాలని ఆశిద్దాము.
స్త్రీలు సహజంగా దయాశీలురు. జ్యోతక్కది పెద్ద మనసు. సహృదయురాలు. రమణను కూడా క్షమించగలదు. వచ్చే సమావేశంలో రమణ అక్కకు sorry చెప్పినా ఆశ్చర్య పడనవసరము లేదు.
ఈ విషయాన్ని త్వరగా ముగించాలని మనవి.