రావు గారూ,
గుజరాత్ లో భూటకపు ఎన్కౌంటరులో చనిపోయిన సొహ్రాబుద్దీన్ "మువ్వన్నెల జెండా పడగ" కాటుకే కదా బలయ్యింది.
బహుశా నిర్మల గారు అలాంటి వాటి గురించే చెబుతున్నారనుకుంటానిక్కడ.
--ప్రసాద్
http://blog.charasala.com
స్వార్ధంతో ఒక రాజకీయ పార్టీ తన వన్నెలనే
జాతీయ వన్నెలుగా మార్చి, అవే వన్నెలను తమ పార్టీకి కూడా వాడుకుంటూ,
సామాన్య మానవునకు అవి పార్టీ వన్నెలో, జాతీయ వన్నెలో తెలియక
తికమకమవుతుంటే
ఇక జాతీయ వన్నెలకీ, ఆ జెండాకి గౌరవం ఏముంటుంది ఈ దేశంలో!
> > పోలీసు కళంకాన్ని దేశానికి ఆపాదించడమెంత సమంజసం?- Hide quoted text -
>
> - Show quoted text -
surya...@gmail.com Vraasenu:
నాకైతే ఇందులో నెగటివ్ భావనలు కలిగించేదేముందో అర్థం కావట్లేదు.
అసలు ఏ వుద్దేశ్యంతో ఆ పదం వ్రాశారన్నది రచయిత్రి చెబితే తప్ప మనకు అర్థం కాదు. మనం ఎన్ని రకాలుగానైనా దాన్ని అర్థం చేసుకోవచ్చు.
మనకు కల్పవృక్షం నీడలా అంపించేది ఇంకొకరికి పాము పడగ నీడలా అనిపించొంచ్చు. అందుకు కారణాలేమిటో చూడాలిగాని అసలలా అననే వద్దు అంటే ఎలా?
అయినా మన ఈ వాదోపవాదాలు అక్కడే ప్రజాకళలోనే చేస్తే బాగుంటుందేమొ!
> On May 9, 7:57am, drchinthu <drchin...@gmail.com> wrote:
> > సామాన్య ప్రజానీకం దృష్టిలో ప్రభుత్వం అంటే పోలీసు కాబట్టి...ఇక్కడ జెండా
> > ప్రభుత్వాన్ని సూచిస్తుంది దేశాన్ని కాదేమో...
> > (నా దేశభక్తిని శంకించవద్దని మనవి!)
> > అన్నట్ట్టు చెప్పడం మరచాను...రవి గారూ 'శుభాకాంక్షలు' మాలో చేరినందుకు!!!
> > On May 8, 3:20pm, "రవి వైజాసత్య" < vyzasa...@gmail.com> wrote:
> >
> >
> >
> > > పోలీసు కళంకాన్ని దేశానికి ఆపాదించడమెంత సమంజసం?- Hide quoted text -
> >
> > - Show quoted text -
కానీ అక్కడ కూడా చిన్న సమస్య ఉన్నది, అది మోడరేటెడ్ కామెంట్సు స్వేచ్చ
లేదు :(
On May 10, 12:44 am, Kiran Kumar Chava The Oremuna
మోడరేటెడ్ ప్రజా కళ? :) అది కొండేపూడి నిర్మల గారి కన్నీటి చుక్క...
క్షమించు అబ్బాజాన్
On May 10, 12:44am, Kiran Kumar Chava The Oremuna
<chavaki...@gmail.com> wrote:
> అవును ఈ వాదోపవాదములు అక్కడే ప్రజాకళలో చేస్తే బాగుంటుంది.
>
> కానీ అక్కడ కూడా చిన్న సమస్య ఉన్నది, అది మోడరేటెడ్ కామెంట్సు స్వేచ్చ
> లేదు :(
అయ్యో! అవునా? అయితే మనకిష్టమొచ్చిన చోట మన అభిప్రాయాలు పంచుకోవడంలో తప్పులేదు. అసభ్యంగా /spam వుంటే తప్ప ఏ కామెంటునీ తొలగించవసరం లేదు అన్నది నా అభిప్రాయం. ఎవరినైనా ఏమైనా చెప్పనివ్వాలి. చదివిన వారే దాని విలువను నిర్ణయించుకుంటారు.
మా బంధువులల్లో ఒక ఆవిడని ఏవొ చిన్న ఆస్తి తగాదాల కారణం గా చైనా భూతం అని
పిలుస్తారు ఇప్పటికీ.
క్రికెటు కామెంట్రీ చదివండి ,వాళ్ళూ ఓడినప్పుడు మట్టి కరిచారని ,మనం
ఓడినప్పుడు కాలు నొప్పి వల్ల గెలవ లేక పోయామని మీడియా వార్తలు రాస్తుంది.
ఒక దేశాన్ని/జాతిని/కులాన్ని/ప్రాతీయాన్ని గురించి ద్వేషం ఇలా ఉగ్గు
పాలతొ రంగరించి పోయడం ఒక నాగరికతగా మనం ఒప్పుకుంటున్నాం.
మరి రాగ ద్వేషాలతో సంబంధం లేకుండా అన్ని యుద్ధాల లోనూ బలవుతున్నది
స్త్రీలు.
గెలుపు ఓటమి లతో కాకుండా కేవలం ఫలితాలు భరిస్తున్నదీ వీళ్ళే.
మొన్న గుజరాత హింసలో ఒక రాజ్యం ఒక మతం చట్టబద్ధంగా చేసిన హింస మీరు చూసే
వుంటారు.అటువంటి మంత్రై గొప్ప పాలకుడు గా బహౌమతి పొందడం కూడా మీకు
తెలుసు.
28 మంది రచయితలం కలిసి ఆ భీభత్సాలు చూసి వచ్చాం.
ముస్లిమ కవయిత్రి షాజహానా తన కవితలో అంటుంది.
;నా మొగవాడూ,నా దేవుడే బాధిస్తున్నాడనుకుంటే
ఇప్పుడు నీ మగవాడూ నీ దేవుడూ కూడానా...."అక్కడి అత్యాచారానికి గురయిన
వాళ్ళ స్వరంలో...
దేశభక్తులు /మువ్వన్నెల జెండాలు ఎవరికి కల్ప వ్రుక్షాలవుతున్నాయో గాని
ఒక యుద్ధ వితంతువుకి ఇంకోలా కనిపీం చవచ్చు.
కాబట్టి ప్రియ మిత్రులారా నాకవితని దాని వాస్తవ నేపధ్యం లో అర్ఢం
చేసుకోండి.
రాజ కీయాలు ముడి పెట్ట వద్దు.
నిజానికి ఆ కవిత పంపడానికి ముందు నేను ఎడిట చేసిన పాదాలు కొన్ని
వున్నాయి.అవి కూడా చదవండి.
"ఎత్తుకెళ్ళిన వెండి కిరీటాల, బాణాల, కత్తెర్ల లాఘవంతో
హుస్సేను సాగరపు టొడ్డున పౌరాణిక క్రిష్ణుడున్న చోట
ఆయుధాలు కుంభకకోణం చేసిన వాడి అమాంబాపతు వంశక్రీడలే
త్యాగధనుల చరిత్ర పుటలుగా చదువుకుంటున్న చోట
పెదవులున్న వాళ్ళంతా మాట్లాడుతారా?
హక్కులున్న వాళ్ళంతా ఆత్మ హననాల్నించి తప్పించు కుంటారా?"