దీనిని ఎలా పలకాలో నాకు తెలియదు గాని, దీనిని జ్ఞ కి బదులుగా
వాడుతున్నారు పురజనులు అని నేను గమనించాను. జ్ఞ కి ఙ్ఞ వాడకూడదనే జ్ఞానం
లేదా అంటే అబ్బే అలా కాదు, ఇది వారు తెలియక చేస్తున్న తప్పు. ఉదా- ది
బ్రాహ్మనికల్ ఆటిట్యూడ్ అనే సంవితర్కవ్యాసం వ్రాసేవారికి జ్ఞానంలో
వుండేది జ్ఞ అని తెలియకపోవడమేమిటి. అసలే ఉత్తరాది వారు జ్ఞకి గ్య ( ज्ञ
కి ग्य ) అనిపలుకుతూంటారు. (గ్యానం లేక). పాపం ఆవిడకు ఈ కొత్త కష్టాలు
ఎందుకు చెప్పండి.
కాబట్టి నేననుకోవండం, ఇది వారు వాడే టైపింగు పరికరం లోని లోపం
అయివుంటుంది. తెలుగులో నాకు నచ్చని ఒకే ఒక పదం టైపింగు పరికరం. మన భాషను
మనం వ్రాసుకోవడానికి అడ్డమైన పరికరాలెందుకో. తెలుఁగు కీబోర్డు
వాడండయ్యలారా అమ్మలారా.
ముందు ఆ ఙ్ఞ దిద్దుతున్న టైపింగు పరికరాన్ని పట్టి దాన్ని బహిష్కరించాలి.
రెండు, గూగుల్ ఇండిక్ వంటి పరికరాల్ని కూడా బహిష్కరించాలి. ఈ గూగుల్
ఇండిక్ అనేది ఏదో గూగుల్ వాడు మనమీదఁ ప్రేమతో ఇచ్చిన పరికరం కాదు. మన
భాషని రోమనులిపికి దాసోహం చేసేస్తాయి ఈ పరికరాలు. నేనేదో జాతీయాభిమానంతో
అనట్లేదు. Basic Information Theory principles గుఱించి
మాట్లాడుతున్నాను.
౧) 56 అక్షరాలూ, వాటిని కంప్యూటరులో వ్యక్తపరచడానికి 75 సింబళ్ళు వున్న
భాషను. 26 అక్షరాలు వాటిని వ్యక్తపరచడానికి 52 సింబళ్ళు వున్న భాషలో
వ్రాయడం Symbol Error Rate ని పెంచుతుంది, కాబట్టి అలా చేయకూడదు.
౨) పైపెచ్చు ఈ AI based learning algorithms తో అందరూ చేసే తప్పును
ఒప్పనుకునే ప్రమాదం వుంది. మన భారతీయ ప్రజాస్వామ్యం లాగా. కథని కదగా
మార్చేస్తాయి కొన్ని రోజులకు.
౩) రోమను కీబోర్డును టైపు రైటర్లు కనిపెట్టిన కొత్తలో టైపింగు వేగాన్ని
తగ్గించడానికి అనుగుణంగా తీర్చిదిద్దారు. వేగంగా టైపు చేస్తే అప్పటి టైపు
యంత్రాలు పాడయిపోయేవి. అంతటి దౌర్భాగ్యపు కీబోర్డును, పైపెచ్చు పరభాషా
కీబోర్డును, ఎక్కువ అక్షరాలున్న మన భాషను వ్రాసుకోవడానికి వాడుతున్నామా !
"Computer keyboards as we have them today were designed about 130
years ago. It is an interesting fact that earlier models permitted to
type faster, but would also cause the “hammers” to jam if the typist
was too fast. A clever engineer solved the problem by spreading out
commonly used keys and thereby slowing down every typist. For 130
years we have been stuck with that slow keyboard even if jamming is no
longer a issue."
పోనీ మీకు కీబోర్డు కొనుక్కునే, నేర్చుకునే ఓపిక లేదనుకుందాం. కనీసం one-
on-one mapping వున్న RTS వంటి పరికరాలను వాడండి. (RTS వాడమని నేను నా
నోటితో చెబుతానని నేననుకోలేదు. కోడలి రంకును వీధిలోనుండి దొడ్డిలోనికి
లాగుతున్నట్టుంది నా ఈ తంతు). RTS అనేది యూనీకోడు లేనప్పుడు తెలుగు
వీరౌత్సాహికులు తెలుగుని రోమనులో వ్యక్తపరచడానకి వాడుకున్న పరిభాష.
యూనీకోడు వచ్చిన తరువాత దాని కాలం చెల్లింది.
నేను ఏ ఒక్కరినో ఉద్ధేశించి మాట్లాడట్లేదు. ఎవరినీ కించపఱచట్లేదు. మంచి
పద్ధతులను వాడమని ప్రాధేయపడుతున్నాను అంతే.
Inscript ప్రచారనిమిత్తం త్వరలో ఒక సైటు వీవెన్ ఆవిష్కరించనున్నారు.
అక్కడ ఇలాంటి మరిన్ని వివరాలను పొందుపఱచనున్నాము.
- రాకేశ్వర
అందం (aMdaM కాదు అ-సున్న-ద-సున్న = అందం అంతే!).బ్లాగుస్పాటు.కామ్
I wish you didn't use వీరౌత్సాహికులు, whatever that word means.
> RTS అనేది యూనీకోడు లేనప్పుడు తెలుగు
> వీరౌత్సాహికులు తెలుగుని రోమనులో వ్యక్తపరచడానకి వాడుకున్న పరిభాష.
-- శ్రీనివాస్
P.S. If you haven't already, please check Suresh Kolichala's 2-part
writeup in the recent issues of "eemaaTa".
I feel that along with inscript web pages, we should also enhance
indic-input extension (https://addons.mozilla.org/en-US/firefox/addon/
3972 )
The only missing feature in it is language shifting keys (like alt
+shift in XP). With this feature it should be more or less complete
keyboard
I tried it but could not grasp the firefox plugin programming
concepts
నేను అప్పుడెప్పుడో తెలుగు ప్రతిభ అని ఒక సొంత సైటు మొదలెట్టాను. కానీ
content add చెయ్యటానికి time & effort spare చెయ్యలేక వదిలేసాను.
ఆ web pages www.geocities.com/jaya.bharath లో ఉన్నాయి.
వీవెన్ గారు,
మీరు కావలంటే అవి లేఖిని లో పెట్టండి.
I feel that along with inscript web pages, we should also enhance
indic-input extension (https://addons.mozilla.org/en-US/firefox/addon/3972 )
The only missing feature in it is language shifting keys (like alt
+shift in XP). With this feature it should be more or less complete
keyboard
నేను "నమస్కారము" అని ఇన్ స్క్రిప్ట్ ఉపయోగించి రాయలేకపోయాను. 'సా'
క్రింద 'క' ఎలా పెట్టాలో తెలియలేదు.
ఇన్ స్క్రిప్ట్ ఉపయోగించుకుని తెలుగులో రాయడానికి సహాయం ఎక్కడ
లభిస్తుంది?
ఏవైనా సాలిగూడులు ఉంటే వివరములు తెలుపగలరు.
భవదీయుడు,
చక్రం.
On May 17, 9:51 am, Veeven (వీవెన్) <vee...@gmail.com> wrote:
> 2009/5/17 manyav <manya...@gmail.com>
>
> > నేను అప్పుడెప్పుడో తెలుగు ప్రతిభ అని ఒక సొంత సైటు మొదలెట్టాను. కానీ
> > content add చెయ్యటానికి time & effort spare చెయ్యలేక వదిలేసాను.
> > ఆ web pages www.geocities.com/jaya.bharathలో ఉన్నాయి.
> > వీవెన్ గారు,
> > మీరు కావలంటే అవి లేఖిని లో పెట్టండి.
>
> మన్వవ్, నెనర్లు.
>
> > I feel that along with inscript web pages, we should also enhance
> > indic-input extension (https://addons.mozilla.org/en-US/firefox/addon/3972)
>
> > The only missing feature in it is language shifting keys (like alt
> > +shift in XP). With this feature it should be more or less complete
> > keyboard
>
> ఇండిక్ ఇన్‌పుట్ పొడగింతలో భాషల మధ్య మారడానికి *Ctrl + Space* వాడవచ్చు.
నమస్కారము.
నేను "నమస్కారము" అని ఇన్ స్క్రిప్ట్ ఉపయోగించి రాయలేకపోయాను. 'సా'
క్రింద 'క' ఎలా పెట్టాలో తెలియలేదు.
ఇన్ స్క్రిప్ట్ ఉపయోగించుకుని తెలుగులో రాయడానికి సహాయం ఎక్కడ
లభిస్తుంది?
On May 18, 2:31 pm, చక్రం <suneelsuns...@gmail.com> wrote:
> నమస్కారము.
>
> నేను "నమస్కారము" అని ఇన్ స్క్రిప్ట్ ఉపయోగించి రాయలేకపోయాను. 'సా'
> క్రింద 'క' ఎలా పెట్టాలో తెలియలేదు.
>
> ఇన్ స్క్రిప్ట్ ఉపయోగించుకుని తెలుగులో రాయడానికి సహాయం ఎక్కడ
> లభిస్తుంది?
>
> ఏవైనా సాలిగూడులు ఉంటే వివరములు తెలుపగలరు.
>
> భవదీయుడు,
>
did create couple of small tutorials in www.geocities.com/jaya.bharath/palaka.html
it helps you to learn finger-to-key mapping quickly. (I hope so :) )
On May 12, 10:54 pm, Sreenivas Paruchuri <anidampu...@gmail.com>
wrote:
> despite your disclaimer; "నేను ఏ ఒక్కరినో ఉద్ధేశించి మాట్లాడట్లేదు.
> ఎవరినీ కించపఱచట్లేదు. మంచి
> పద్ధతులను వాడమని ప్రాధేయపడుతున్నాను అంతే. "
>
> I wish you didn't use వీరౌత్సాహికులు, whatever that word means.
>
> > RTS అనేది యూనీకోడు లేనప్పుడు తెలుగు
> > వీరౌత్సాహికులు తెలుగుని రోమనులో వ్యక్తపరచడానకి వాడుకున్న పరిభాష.
>
> -- శ్రీనివాస్
నేను ఈ చర్చను చూసి చాలా రోజులు అయినది. నేను వీరౌత్సాహికులు అన్నది, ఈ-
తెలుగు కోసం కృషి చేసే వారనే చాలా మంచి అర్థంలోఁ.
అప్పటిలో తెలుఁగు టైపు చేసుకోవడానికి చదవడానికీ కంప్యూటర్లలో ఎలాంటి
సహకారమూ లేకపోయినా వారే ఒక పద్ధతిని కనుగొన్నారు కాబట్టి గొప్పవారని.
ఐనా RTS కి కాలం చెల్లింది. యూనీకోడు మఱియు Inscript రావడంతో. ఇఱవై
ఏండ్లలో కంప్యూటర్లలో చాలా సాంకేతిక అభివృద్ధి జరుగుతుంది కాబట్టి.
> Inscript Key Board.pdf
> 81KViewDownload