అబ్యర్ధన : తెలుగు బాట కార్యక్రమమును కార్యకర్తల/ సాహాయకుల అవసరము కలదు .

4 views
Skip to first unread message

Kaśyap కశ్యప్

unread,
Aug 16, 2011, 3:42:13 AM8/16/11
to telug...@googlegroups.com, telug...@googlegroups.com




తెలుగు బ్లాగరుకు,  అభిమానులకు ,
ఆర్యా ,

తెలుగు వాడకం పెరగాలని ఆశిస్తూ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు కోసం  తెలుగు బాట    కార్యక్రమము తెలుగు భాషా దినోత్సవం అయిన ఆగస్టు 29న పెద్ద ఎత్తున జరుపుతున్నాము కదా!. దీనికి పొలిసు,  లలిత కళా తోరణం  వారి అనుమతులు లబించినవి  . ఈ   తెలుగు బాట    కార్యక్రమమును  కార్యకర్తల/  సాహాయకుల  అవసరము  కలదు  అత్యంత అవసరము .
ఈ సారి తెలుగు బాటకు ఐదువేల  కరపత్రములు , తెలుగు బాట స్టిక్కర్లు ముద్రించినాము ఇవి మాసాబ్ టాంకు లోని నా ఆఫీసులో కలవు కావసినవారు ఉదయం 8  నుండి సాయంత్రం ఆరు లోపల తీసుకోన వచ్చును

మన అవసరాలు
౧) తెలుగు బాటకు వచ్చిన వారికి పేరు సమోదు , వచ్చిన వారికి సహాయము చేయుట , కరపత్రముల పంపిణి మెదలగు అవసరములకు ఒక ముప్పై మంది సహాయము కావలెను
౨) తెలుగు సాంకేతికాలు ( తెలుగు రాయటం , బ్లాగులు .. ) వాటికి  సహాయము - వీరు లాపుటాపు తెచ్చుకొనవలసి ఉండును, ఇంటర్నెట్ సౌకార్యం ఉంటె మరి మంచిది.

గత సంవత్సరము  తెలుగుబాట కార్యక్రమము  విజయవతముగా నిర్వహించాము, స్పూర్తి తో సంవత్సరము కూడా ప్రజలందరూ పాల్గొనడానికి వీలుగా సెలవు రోజైన ఆదివారం ఆగస్టు 28 2011 ఉదయం 9 గంటల నుండి  హైదరాబాదులో: తెలుగు లలిత కళా తోరణం నుండి బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ వరకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.
కార్యకర్తలు  తెల్లవారుఘామున ఎనిమిది గంటలకు హాజరు కావలెను వస్త్ర ధారణ నియమములు ఏమీలేవు  . తెలుపు రంగు ,  తెలుగు సాంప్రదాయ ఆహార్యము అయితే మరీ మంచిది :) 
కార్యకర్త లకు బ్యాడ్జిలు,  కార్యక్రమ ప్రణాళిక అందచేయబడును  ,  కార్యకర్తలు  మధ్యానం  పన్నెండు గంటల వరకు  ఉండవలెను  
 
దయచేసి తెలుగుబాటకు సహాయపడు  ఔస్తాహికులు  నాకు  ఈ వివరములు మెయిల్  kasy...@gmail.com చేయగలరు.
పేరు                     :
ఫోను                    :
e  మెయిల్            :
సహాయము తరగతి :  నిర్వాహణ పరమైన / సాంకేతిక పరమైన  
 
మనకు రెండు వేల మంది దాక బాట సాగించుటకు అనుమతి కలదు , మన హైదరాబాదు బ్లాగరులు నాలుగు  వందల మంది పైన  ఉన్నాము , ప్రతిఒక్కరు  తమతో ఆరుగురిని తీసుకు వచ్చినా  మన తెలుగు బాట విజయవంతము అవుతుంది ! . మరిన్ని వివరాలకు   దయచేసి చూడండి    http://telugubaata.etelugu.org/ .ఈ కార్యక్రమమునకు రాలేని వేరే ప్రాంతముల వారు ,వారి హైదరాబాదు మిత్రులకు తెలుగు బాట కు వారిని ఆహ్వానించ గలరు  .
దయచేసి మీ పేరు వెంటనే సమోదు చేసుకోనగలరు 
మన తెలుగు వారందరము కలసి ఈ తెలుగు బాటను విజయవంతం చేద్దాం, దయచేసి మీకు తెలిసిన తెలుగు వారందరకు ఈ టపాను పంపండి. మన తెలుగు బాటకు ధన సహాయము  చేయగోరు వారు  ఈ శుక్రవారము లోపల మాకు తెలియపరచగలరు సాద్యమయినంత వరకు మీ దగ్గరకు వచ్చి రసీదు ఇచ్చి విరాళములు తీసుకోనగలము.    

ఇట్లు
కశ్యప్
9396533666
kaburlu.wordpress.com



Reply all
Reply to author
Forward
0 new messages