మాన్యశ్రీ
అర్యా,
e-తెలుగు అనేది కంప్యూటర్లలో మరియు అంతర్జాలంలో తెలుగును వ్యాపింపజేయాలనే ధ్యేయంతో పనిచేసే లాభాపేక్షలేని సంస్థ. తెలుగు వారందరూ తమ అవసరాలకి కంప్యూటర్లను , ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను మరియు అంతర్జాలాన్ని వాడుకోవాలి అనే ఉద్దేశ్యము తో e-తెలుగు సంస్థ కృషి చేస్తోంది. అందుకుగాను అనేక కార్యక్రమాలు చేస్తోంది. ఇటీవల జరిగిన హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో ఒక స్టాలుని నెలకొల్పి అంతర్జాలంలో తెలుగు గురించిన ప్రచారం కల్పించడమే కాక, కొన్ని తెలుగు సాఫ్టువేర్లను ఉచితంగా అందించింది వివిద వర్గాల ప్రజలకు ప్రయోజనకరంగా ఉండే వర్కుషాపులను చేపట్టింది. వివిధ అంశాలపై తగు సమాచారం ఇవ్వడమే కాకుండా అనేక సాంకేతిక, సాంకేతికేతర విషయాల్లో తక్షణ సహాయం అందించడం, అనేక తెలుగు సాంకేతిక సదస్సులు, ప్రచారములు గత ఐదు సంవత్సరముల నుండి మేము నిర్వహిస్తున్నాము. e-తెలుగు ఆంధ్రపదేశ్ సంఘము రిజిస్టర్ ల చట్టము 2001 (35) క్రింద నెం 624/2008 తో రిజిస్టర్ అయినది.
గత సంవత్సరము తెలుగుబాట కార్యక్రమము ఆగష్టు 29 2010 ఆదివారము ఉదయము మేము నెక్లెస్ రోడ్డు తెలుగుతల్లి విగ్రహము వద్దనుండి పివి జ్ఞానభూమి వరకు విజయవతముగా నిర్వహించాము, ఆ స్పూర్తి తో ఈ సంవత్సరము కూడా ప్రజలందరూ పాల్గొనడానికి వీలుగా సెలవు రోజైన ఆదివారం ఆగస్టు 28 2011 ఉదయం 9 గంటల నుండి హైదరాబాదులో: తెలుగు లలిత కళా తోరణం నుండి బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.
తెలుగుబాట కార్యక్రమము లో పాల్గొనుటకు ఎటువంటి రుసుములేదు , తెలుగు భాష మీద అభిమానము, తెలుగు వ్యాప్తికి అభిలాష చాలును!
మరిన్నివివరములు లకు http://telugubaata.etelugu.org చూడండి, మీరు ఇక్కడ మీ పేరు సమోదు చెసుకొవచ్హు.
ఈకార్యక్రమమునకు కరపత్రములు , టీషర్టు, వేదిక , ప్రచార ఉపకరణములకు కొరకు సహాయము కోరుతున్నాము , మాకు సహాయము చెసిన వారి పేరు , చిహ్నము మా ప్రచార ఉపకరణములలొ మరియు మీడియా వారికి ప్రముఖముగా తెలియపరచగలము . దయచేసి తెలుగుబాట కార్యక్రమమునకు సహాయ సహకారములు అందిచగలరు .
ధన్యవాదాలు
e-తెలుగు సంఘము