తెలుగు బాటకు నినాదాలు

4,691 views
Skip to first unread message

kasyap

unread,
Aug 22, 2010, 11:25:22 AM8/22/10
to తెలుగు బాట
ప్రియ తెలుగు మిత్రులారా
మన తెలుగు బాటకు నినాదాలు ఎలాంటివి అయితే బాగుంటుంది
" తెలుగు కై నడుద్దాం .. తెలుగును నిలబెడదాం"
"తేనెల తేటల మూట , మన తెలుగు మాట "
"తెలుగు జాతి మనది - నిండుగ వెలుగు జాతి మనది "
" తెంగ్లిష్ వద్దు - తెలుగే ముద్దు"
" కొత్త తెగులు వద్దు - మన తెలుగే ముద్దు "
"మమ్మీ కన్నా - అమ్మనే మిన్న"
ఇంకా ఎమన్నా ....


--
మీ శ్రేయోబిలాషి
కశ్యప్
kaburlu.wordpress.com
9396533666

koutilya choudary

unread,
Aug 23, 2010, 2:34:03 AM8/23/10
to తెలుగు బాట
బాగున్నాయ్ కశ్యప్ జీ...మేం కొత్తవేమీ చెయ్యలేం కాని, మీ వెంట ఉండి గొంతు
కలుపుతాం.. :-)

Kiran Kumar Chava The Oremuna

unread,
Aug 25, 2010, 12:14:52 AM8/25/10
to తెలుగు బాట
వీటిల్లో రెండింటి పై నాకు అభ్యంతరం ఉంది. అవి మమ్మీ కన్నా అమ్మనే మిన్న
(మమ్మీ కూడా తెలుగు పదమే నా దృష్టిలో, తెలుగు భాష మరో పదం ఇముడ్చుకోలేదా
ఏమిటి, మమ్మీ అని పిలిచినంత మాత్రాన అమ్మ ప్రేమ తేడా వస్తుందా ఏమిటి)

తెగులు అనే పదం వాడ కుండా ఉండటమే శ్రేయస్కరం, అది మరీ నెగటివ్ గా ఉంది.

---

నా నినాదం
తెలుగే రాజ భాష, తెలుగే దేవ భాష, తెలుగే పూర్ణ భాష.

On Aug 22, 8:25 pm, kasyap <kasya...@gmail.com> wrote:

koutilya choudary

unread,
Aug 25, 2010, 3:08:54 AM8/25/10
to తెలుగు బాట
కశ్యప్ జీ...మమ్మీ డాడీ పిలుపులు వద్దు- అమ్మా నాన్నా పిలుపులే
ముద్దు.....ఇది నా పైత్యం కాదు..ఒక స్నేహితుడి సూచన..

On Aug 22, 8:25 pm, kasyap <kasya...@gmail.com> wrote:

> kaburlu.wordpress.com9396533666begin_of_the_skype_highlighting              9396533666      end_of_the_skype_highlighting

వీవెన్

unread,
Aug 26, 2010, 11:56:24 PM8/26/10
to తెలుగు బాట
మరిన్ని (శిరీష్, సతీష్, శ్రీనివాసరాజు, శ్రీనివాస కుమార్ గార్ల
సౌజన్యంతో):

* "నా మాట తెలుగు మాట- నా బాట తెలుగు బాట"
* "ప్రతి నోటా తెలుగు మాట- ప్రతి ఇంటా తెలుగు కోట"
* "ప్రాచీనతను సాధించాం- ఆధునికతను సాధిద్దాం"
* "జీతం కోసం పర భాష- జీవితం కోసం అమ్మ భాష"
* "జీతం కోసం ఇంగ్లీష్ మాట- జీవితం కోసం తెలుగు బాట"
* "తల్లి భాషను కాదంటే తల్లిని కాదన్నట్లే- జననిని కాదంటే జగతిన
ఉన్నా లేనట్లే"
* "కళ్ళజోడు ఉందని కళ్ళు పొడుచుకుంటామా?- ఇంగ్లీషు వచ్చని తెలుగు
వద్దనుకుంటామా?"
* "కన్న తల్లి, జన్మ భూమి, మాతృభాష---- మరువకండి...మరువకండి.... ఇదే
మన బాస"

ఈ నినాదాలని నడకలో ప్లకార్డుగా ప్రదర్శించవచ్చు. సభ్యులు తమ వీలుని
బట్టి, తెలుగు గురించి తమకు నచ్చిన నినాదాలని కార్డు ముక్కలపై లేదా
ఇతరత్రా తయారుచేసి తీసుకురావలసిందిగా మనవి.

ఇట్లు,
వీవెన్.

Sirish Kumar Tummala

unread,
Aug 27, 2010, 1:39:53 AM8/27/10
to telug...@googlegroups.com
"జీతం కోసం పర భాష- జీవితం కోసం అమ్మ భాష"
ఇది ఇలాక్కాదు -
"జీతం కోసం ఆంగ్ల భాష- జీవితం కోసం అమ్మ భాష"
లేదా,
"జీతం కోసం పర భాష- జీవితం కోసం మన భాష"
అయితే బాగుంటుంది.
- తుమ్మల శిరీష్ కుమార్
-----------
నా బ్లాగు: http://chaduvari.blogspot.com
బ్లాగులన్నీ: http://koodali.org, http://jalleda.com


2010/8/27 వీవెన్ <vee...@gmail.com>
Reply all
Reply to author
Forward
0 new messages