Re: మనకంటూ ఒక ప్రేమ కావ్యం

115 views
Skip to first unread message

lylayer

unread,
Dec 7, 2004, 3:14:53 PM12/7/04
to racch...@yahoogroups.com

--- In racch...@yahoogroups.com, "Avineny N. Bhaskar"
<avineny@y...> wrote:
>
>
> ఇలా భాషకొక కన్నీరు నిండిన వలపు కావ్యాలు ఉండగా, మనకంటూ
> తెలుగులో ఒక వలపు కావ్యం ఎందుకు లేదు?
>

> కన్నీళ్ళు లేవన్న బెంగతో
> -అవినేని.
>

ఏకవీరా may be one such telugu romance. A double tragedy at
that.

భగ్న హ్రిదయము - ప్రియ వియొగుం - though not necessarily a
kaavyamu has beautiful and moving poems by Duvvuri Ramireddy when he
lost his wife in 1925. I cried a few times over these poems, and the
tragedy behind them.

i am giving two poems below.


ఇరువురకు తప్ప నితరుల కెఋగ రాని,
మన రహస్యంబు లెవరితో ననుదు నింక?
హ్రిదయ మంజూష నా చెత నిడి యదేల
తాలంపు జెవి నీ యొడి దాచినావు?


తెలివి నశిమ్చినప్పుడొక తేప నినుం గను కోర్కె తోడ నే
వెలుపల కేగి, కాటి దరి వెచ్చగ నూర్చుచు కూరుచుండి నీ
లలిత మనోహరాక్రుతి నిలాతలమందున పాఋఅ జూడ బొ
గ్గుల మసి భగ్న శల్యములు గోచరమయ్యె నికేమి జెప్పుదున్!

పానశాల that we love so much is the result of deep sorrow and
loss D.R experienced. He had immersed himself in Khayyam on many
sleepless nights and found solace in reading him and eventually
translating him.

" marapu rAnI bAdha kannA madhuramE lEdU
gatamu talacI vagacE kannA soukyamE ledU " - great words.

while some of you mull over these and sigh and cry I am going to
write my next post. :-(

lyla.


Courtesy: http://www.kanneganti.com/

Avineny N. Bhaskar

unread,
Dec 7, 2004, 3:31:41 AM12/7/04
to racch...@yahoogroups.com


ఆంగలంలో "రోమియో-జూలియట్"
బెంగాలిలో "దేవడాస్"
ఉరుదూలో "లైలా-మజ్ను"
అరవంలొ "అంభికాపతి-అమరావతి"

ఇలా భాషకొక కన్నీరు నిండిన వలపు కావ్యాలు ఉండగా, మనకంటూ
తెలుగులో ఒక వలపు కావ్యం ఎందుకు లేదు?

బహుశ, తెలుగు వాళ్ళు వలపులో గెలవడమే తప్ప ఓటమి ఎఱుగరేమో?

మన యెంకీ నాయుడు బావలు కూడా, సరదాగ సరసమాడి పాటలు పాడారు
తప్ప, విషాద సాగరంలో పడవలు నడపలేదనుకుంటాను!


కన్నీళ్ళు లేవన్న బెంగతో
-అవినేని.


Courtesy: http://www.kanneganti.com/

Uday Bhaskar

unread,
Dec 7, 2004, 4:36:42 PM12/7/04
to racch...@yahoogroups.com

> తెలుగు కావ్యములు చాలవఱకు సంస్కృత కావ్యముల
> లక్షణములను అనుసరించినవి. సంస్కృతములో
> కావ్యము విషాదాంతము కాదు. మరణమును కూడ
> నాటకములలో చూపించరు. భాసుడు మాత్రము దీనికి
> విరుద్ధముగా నడచిన కవి. శృంగారము రెండు
> విధములు- సంభోగము, విప్రలంభము. వియోగమును
> బాగుగా పోషించబడిన కావ్యములు- కాలిదాసుని
> విక్రమోఋవశీయము, భవభూతి ఉత్తరరామచరితము.
> శాకుంతలములో కూడ ఈ రసము చక్కగా చూపబడినది.
> తెలుగులోని కథలు- సారంగధర, విప్రనారాయణ,
> ఇత్యాదులు.
>
> చిత్తగించ మనవి.
> విధేయుడు - మోహన
>

I agree that traditional Telugu literature is dominated by the
Sanskrit లాక్షణిక శాస్త్రం approach. But more importantly, IMHO,
Telugu literature has been more fascinated by the dramatic element of
a story, rather than on passion and romantic love. I agree with
Bhaskar that we dont have lovers with the iconic status like Laila
Majnu or a Romeo Juliet, other than of course యెంకీ నాయుదు బావ.
Even the Telugu examples you suggest like సారంగధర and
విప్రనారాయణ are more stories in Sydney Sheldon's genre, where the
denouement of the protogonist's character and the psycho drama
involved in their ethical and intellectual struggles is more
important than the romance of the man woman relationship.

Although all well known legendary lovers across all cultures met with
tragic ends, I am not sure that tragedy is a necessary condition to
immortalize love. And may be (just may be) this is where we Telugus
can be proud of our unique contribution to the history of romantic
love ;-). Our best lovers did not have tragic ends, be they
రంగనాయ్కమ్మ గారి విమల, బుచ్చిబాబు or ముళ్ళపూడి వారి రాధా
గోపాలం.

Regards,

Uday

Courtesy: http://www.kanneganti.com/

Uday Bhaskar

unread,
Dec 7, 2004, 1:19:03 PM12/7/04
to racch...@yahoogroups.com

>
> మన యెంకీ నాయుడు బావలు కూడా, సరదాగ సరసమాడి పాటలు
పాడారు
> తప్ప, విషాద సాగరంలో పడవలు నడపలేదనుకుంటాను!
>


"ఇంతేనటే సంద్రమెంతో అనుకొంటి
మనకి సూరీడికీ మద్దెనుందేనా!
...
నా నీతి నా జాతి నా వారే పోనాడ
మరిగి నా మది సాగరమాయెనన్నారు
ఇంతేనటే సంద్రమెంతో అనుకొంటి
మనకి సూరీడికీ మద్దెనుందేనా!"

సముద్రం తన దు:ఖంతో పోలిస్తే చాలా చిన్నదనిపించిందట యెంకికి.
యెమ్కి పాటల్లో విషాదమెందుకు లేదు సార్!

కానీ మొత్తానికి భలే మంచి topic మొదలెట్టారు. తెలుగు వాళ్ళ కావ్య
నాయికలంతా నోరు తిరగని సంస్కృత సమాసాల మధ్య
ప్రభంధాలలోనూ, "అమలిన శృంగారపు" భావ కవిత్వపు ఊహా సుందరులగానూ
కనబడతారే కానీ జవ సత్వాలున్న జూలియట్లూ, హీర్లూ, మనకి
దర్శనమివ్వరు. ఒక్క "నమిలి మింగిన యెంకి" తప్ప.

బహుశా గిరీశం చెప్పినట్లు "మనవాళ్ళుట్టి వెధవాయ"లేమో!

రిగార్డులతో,

ఉదయ్

Courtesy: http://www.kanneganti.com/

J. K. Mohana Rao

unread,
Dec 7, 2004, 4:00:08 PM12/7/04
to racch...@yahoogroups.com

--- "Avineny N. Bhaskar" <avineny@y...> wrote:


> ఆంగలంలో "రోమియో-జూలియట్"
> బెంగాలిలో "దేవడాస్"
> ఉరుదూలో "లైలా-మజ్ను"
> అరవంలొ "అంభికాపతి-అమరావతి"
>
> ఇలా భాషకొక కన్నీరు నిండిన వలపు కావ్యాలు ఉండగా, మనకంటూ
> తెలుగులో ఒక వలపు కావ్యం ఎందుకు లేదు?
>

తెలుగు కావ్యములు చాలవఱకు సంస్కృత కావ్యముల
లక్షణములను అనుసరించినవి. సంస్కృతములో
కావ్యము విషాదాంతము కాదు. మరణమును కూడ
నాటకములలో చూపించరు. భాసుడు మాత్రము దీనికి
విరుద్ధముగా నడచిన కవి. శృంగారము రెండు
విధములు- సంభోగము, విప్రలంభము. వియోగమును
బాగుగా పోషించబడిన కావ్యములు- కాలిదాసుని
విక్రమోఋవశీయము, భవభూతి ఉత్తరరామచరితము.
శాకుంతలములో కూడ ఈ రసము చక్కగా చూపబడినది.
తెలుగులోని కథలు- సారంగధర, విప్రనారాయణ,
ఇత్యాదులు.

చిత్తగించ మనవి.
విధేయుడు - మోహన


__________________________________
Do you Yahoo!?
Yahoo! Mail - Find what you need with new enhanced search.
http://info.mail.yahoo.com/mail_250


Courtesy: http://www.kanneganti.com/

srini_nagul

unread,
Dec 7, 2004, 8:38:41 PM12/7/04
to racch...@yahoogroups.com

--- In racch...@yahoogroups.com, "Avineny N. Bhaskar"

<avineny@y...> wrote:>
>
> బెంగాలిలో "దేవడాస్"
>

> ఇలా భాషకొక కన్నీరు నిండిన వలపు కావ్యాలు ఉండగా, మనకంటూ
> తెలుగులో ఒక వలపు కావ్యం ఎందుకు లేదు?

అయ్యో "దేవదాసు" తెలుగు నుంచి, కాదు అక్కినేనిగారి నుంచి బెంగాలీలోకి
పోయిందనుకున్నాను :-) పోనీ లెండి అలాగే కానివ్వండి బెంగాలీ వాళ్ళని
బాధ పెట్టడమెందుకు! :-)

> బహుశ, తెలుగు వాళ్ళు వలపులో గెలవడమే తప్ప ఓటమి ఎఱుగరేమో?
>
> మన యెంకీ నాయుడు బావలు కూడా, సరదాగ సరసమాడి పాటలు
> పాడారు తప్ప, విషాద సాగరంలో పడవలు నడపలేదనుకుంటాను!

ఇవేవీ పుట్టకమునుపే, వెయ్యేళ్ళకిందే నన్నయ్య గారు నల దమయంతుల
గురించి ఆర్ద్రంగా, అద్భుతంగా ఇప్పటికీ నిలిచేలా చెప్పేసారు.

నలదమయంతు లిద్దఱు మనః ప్రభబానల బాధ్యమానులై
సలిపిరి దీర్ఘవాసర నిశల్ విలసన్నవ నందనంబులన్
నిలిన దళంబులన్ మృదుమృణాళములన్ ఘనసారపాంసులం
దలిరుల శయ్యలన్ సలిలధారల జందన చారుచర్చలన్

నలదమయంతులు ఇరువురూ మన్మథ తాప బాధితులై, నందనవనాల్లాంటి
తోటలో, తామరపూలరేకులలో (నళిన దళంబులన్ ), మెత్తనైన
తామర తూండ్లలో (మృదు మృణాళములన్ ), కర్పూర దూళితో (ఘనసార
పాంసులన్ ), చిగురుటాకుల సెజ్జలపై (తలిరుల శయ్యలన్ ),
పన్నీటి జల్లులతో (సలిల ధారలన్ ), మంచి గంధపు పూతలతో
(చందన చారు చర్చలన్ ) గడిపారట (సలిపిరి). మామూలు రేయి పవళ్ళు
కాదట, "దీర్ఘ వాసర నిశల్", చాలా దీర్ఘమైన రాత్రులు, పవళ్ళట.
వాచికంగా చెప్పే భావమే కాదు, పద్యం చదువుతుంటే ఆ విశేషణాలు
ఒకదానికొకటి పెనవేసుకొని, నల దమయంతుల అన్యోన్యతా భావాన్ని
స్ఫురించేలా ధ్వనింపజేయడం ఒక ఆకర్షణ. ఇక పంచేంద్రియాలను
ఆహ్లాదపరిచే సామగ్రంతా చొప్పించి, శబ్ద, రూప, రస, గంధ,
స్పర్శాదుల్లో, "రూప, రసా" లను మాత్రం వర్ణించే విశేషణాలను
ప్రత్యేకంగా చెప్పకుండానే చెప్పడం చమత్కారమనిపిస్తుంది. ఎందుకంటే
ఆకట్టుకునే రూపం ఒకరికి ఇంకొకరైపోయినట్టు, ఇక రసస్వాదన వారి
మాటలో, ఏమిటో చెప్పకుండానే చిత్రీకరించినట్టుంది. కాబాట్టి వాటికి
మాత్రం ప్రత్యేక విశేషణాలను చెప్పకపోవడంలోనే
ఔచిత్యమనిపిస్తుంది.

ఈ విధంగా, ఇంకెన్నో విధాలుగా చెప్పిన తరువాత దమయంతి నోట

"హా! మహా రాజ! మహా మహీ రక్షణ! దక్ష దక్షిణ బాహుదండ!
...నన్నిట్లు వీత దయుండవై విడిచి చనగ దగునె? ....ఎటు వోదు?
ఇంకెట్లు గాంతు నిన్ను ఉగ్ర కాననమున?" అని హృదయ విదారకంగా
విలపించడం కన్నులకు కట్టినట్లు చూపించడమే గాక,
"ఎట్లు గాంతు ఉగ్ర కాననమున" అని అనన్య సామాన్యమైన ఉపమ వాడడం
విశేషం. ఇప్పటికి కూడా దిక్కులేని వేదనను "అరణ్య రోదన" అని
అనడం వింటుంటాము. దమయంతిది భయంకర(ఉగ్ర) అడవి(కాననము)
లోనీ దీనాలాపన అని చెప్పడానికి ఇంతకంటే ప్రస్తుతమైన పోలిక
స్ఫురించడం కష్టం!

అయితే నల దమయంతుల కథ సంస్కృతంలోనిది, తెలుగువాళ్ళదెట్లా
అవుతుందంటే, నన్నయ చేసింది కేవలం అనువాదము కాదు. మూలంలోని
కథలో మార్పులు చేర్పులు చేయడం, మూలంలోని వైరుధాన్ని తొలగించి,
ఔచిత్యాన్ని పెంచడము, పోషించడము లాంటివెన్నో ఆ కథకు బలాన్ని,
రసాన్నే కాక, సొంతగా నిలిచే, మెలగే స్థాయిని కూడా నన్నయ
కలిగించాడు.

> కన్నీళ్ళు లేవన్న బెంగతో

మీరన్నది ఆలోచింపదగ్గదే! అయితే ఒక సందేహం.
కన్నీళ్ళు కారుతే కవిత్వం రాస్తారా? :-)
గొంతు రుద్ధమైతే శృతిబద్ధంగా గానం చేస్తారా, "దేవదాసు" లాగా :-)
ఏమో శోకంలోంచి శాపాలు, అవే శ్లోకంలా, కవిత్వంలా తరువాత
అనిపిస్తాయేమో కాని, అప్పుడు మాత్రం కవిత్వమనే స్పృహే ఉండదని
అనుకుంటున్నాను !

-Srinivas


From jkmrao@y... Tue Dec 07 18:43:47 2004
Return-Path: <jkmrao@y...>
Received: (qmail 57921 invoked from network); 8 Dec 2004 02:43:47 -0000
Received: from unknown (66.218.66.216)
by m21.grp.scd.yahoo.com with QMQP; 8 Dec 2004 02:43:47 -0000
Received: from unknown (HELO n20a.bulk.scd.yahoo.com) (66.94.237.49)
by mta1.grp.scd.yahoo.com with SMTP; 8 Dec 2004 02:43:47 -0000
Received: from [66.218.69.1] by n20.bulk.scd.yahoo.com with NNFMP; 08 Dec 2004 02:43:36 -0000
Received: from [66.218.66.142] by mailer1.bulk.scd.yahoo.com with NNFMP; 08 Dec 2004 02:43:36 -0000
X-Sender: jkmrao@y...
X-Apparently-To: racch...@yahoogroups.com
Received: (qmail 55547 invoked from network); 8 Dec 2004 01:55:04 -0000
Received: from unknown (66.218.66.216)
by m3.grp.scd.yahoo.com with QMQP; 8 Dec 2004 01:55:04 -0000
Received: from unknown (HELO web41609.mail.yahoo.com) (66.218.93.109)
by mta1.grp.scd.yahoo.com with SMTP; 8 Dec 2004 01:55:04 -0000
Received: (qmail 63391 invoked by uid 60001); 8 Dec 2004 01:55:00 -0000
Comment: DomainKeys? See http://antispam.yahoo.com/domainkeys
DomainKey-Signature: a=rsa-sha1; q=dns; c=nofws;
s=s1024; d=yahoo.com;
b=f4PcHSfASYJvyPpUH/LxVDwTsD3ev/nco3nKrE2t09a2rgyBxBPXHj32hEa49J5fLneoezfGvdZ37/HhYvF8IP3MG40tI5RPsb/j2qzztd/33EkLTgIWstwmx7nvU+x42b7RZ1U1SHunHFxx8waMPAg7RRy7u8JkDOaEzAhcz10= ;
Message-ID: <20041208015500.63389.qmail@w...>
Received: from [129.43.253.45] by web41609.mail.yahoo.com via HTTP; Tue, 07 Dec 2004 17:55:00 PST
Date: Tue, 7 Dec 2004 17:55:00 -0800 (PST)
To: chan...@yahoogroups.com, racch...@yahoogroups.com
MIME-Version: 1.0
Content-Type: text/plain; charset=us-ascii
X-eGroups-Remote-IP: 66.218.93.109
From: "J. K. Mohana Rao" <jkmrao@y...>
Subject: 60 మాత్రలు - 23 - కమలదళము
X-Yahoo-Group-Post: member; u=61114904
X-Yahoo-Profile: jkmrao
X-Yahoo-Newman-Property: groups-system
X-eGroups-Approved-By: vcjampala <cjampala@g...> via web; 08 Dec 2004 02:43:05 -0000
X-eGroups-Remote-IP: 66.94.237.49
X-RB-Message-Num: 11269

60 మాత్రలు - 23 - కమలదళము

ఈ రోజు అరవై మాత్రలతో ఒక క్రొత్త
విధమైన పద్యమును చెబుతాను. ఇది
అతికించిన రెండు మణులవలె నుండును.
చిత్రము లేక చెప్పుట కష్టము. కాని
ప్రయత్నించెదను. రెండు ముప్పది మాత్రల
మణులు చేరిన అఱువది మాత్రలు మనకు
లభించును. ఇది రెండు కమల దళములను
లేక రెండు డయమండ్ ఆకారములను
చేర్చినట్లుండును. మూడు, నాల్గు, ఐదు,
ఆఱు, ఐదు, నాల్గు, మూడు మాత్రలు ఒక్కొక్క
దళములో నుండును. ఈ సంఖ్యల మొత్తము
ముప్పది. రెండు దళములు చేరు చోటులో
అక్షరము ఒకటిగా నుండవలయును.
రెండు మణులను మార్చి వ్రాసినను అర్థముతో
నుండవలయును. దీనికి కమలదళము అని
పేరుంచినాను. ఉదాహరణ-

కమల మమత
దళముల లహరుల
కనులు గల ముంచి యీ
రమణునిన్ స మయమున ర
దమలునిన్ సమయమై
సుమముల జేయగ
గొలుతు బిలుతు

చదువుటకు అనుకూలముగా నుండుటకై క్రింది
విధముగా వ్రాయుచున్నాను. అమరికలోని మాత్రల
సంఖ్య కుండలీకరణములలో తెలిపినాను-

కమల (3)
దళముల (4)
కనులు గల (5)
రమణునిన్ స- (6)
దమలునిన్ (5)
సుమముల (4)
గొలుతు (3)
మమత (3)
లహరుల (4)
ముంచి యీ (5)
సమయమున ర- (6)
సమయమై (5)
జేయగ (4)
బిలుతు (3)

పద్యమువలె వ్రాయవలయునన్నయెడల, క్రింది
విధముగా వ్రాయవలయును. ఇట్లు వ్రాసినప్పుడు
ప్రాసలుండవలసిన స్థలములు తెలియును.
రెండవ, ఐదవ పాదమూలోని మొదటి చివరి
అక్షరములు మాఱవలయును, అనగా రెండవ
పాదములోని మొదటి అక్షరము, ఐదవ పాదములోని
చివరి అక్షరముగా, రెండవ పాదములోని చివరి
అక్షరము ఐదవ పాదములోని మొదటి అక్షరముగా
నుండవలయును. ఈ చోటులలో రెండు దళములు
చేరును.

కమల దళముల కనులు గల
రమణునిన్ స-
దమలునిన్ సుమముల గొలుతు
మమత లహరుల ముంచి యీ
సమయమున ర-
సమయమై జేయగ బిలుతు

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

__________________________________
Do you Yahoo!?
Yahoo! Mail - Helps protect you from nasty viruses.
http://promotions.yahoo.com/new_mail


Courtesy: http://www.kanneganti.com/

Uday Bhaskar

unread,
Dec 7, 2004, 11:00:49 PM12/7/04
to racch...@yahoogroups.com


>
> మీరన్నది ఆలోచింపదగ్గదే! అయితే ఒక సందేహం.
> కన్నీళ్ళు కారుతే కవిత్వం రాస్తారా? :-)
> గొంతు రుద్ధమైతే శృతిబద్ధంగా గానం చేస్తారా, "దేవదాసు" లాగా :-)
> ఏమో శోకంలోంచి శాపాలు, అవే శ్లోకంలా, కవిత్వంలా తరువాత
> అనిపిస్తాయేమో కాని, అప్పుడు మాత్రం కవిత్వమనే స్పృహే ఉండదని
> అనుకుంటున్నాను !
>
> -Srinivas


ఏమోనండీ!

"బాధ కవిత్వానికి పర్యాయ పదం" అన్న మహాకవి నానుడి నిజమనుకుంటే,
ప్రేమ సంగతేమో కానీ, కవిత్వానికి మాత్రం కన్నీళ్ళే సృజనాత్మక ఊటకి
నాందని ఒప్పుకోక తప్పదు.

మరిపోతే, నల దమయంతుల ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఒకమాట చెప్పక
తప్పదు. నలుడు దమయంతి పట్ల గానీ, దమయంతి నలుడి పట్ల గానీ,
వ్యక్తపరచిన ప్రేమ తెలుగువాళ్ళ సాంస్కృతిక జీవనంలో భాగం
కాలేకపోయింది. తెలుగు వాళ్ళ దైనందిన జీవనంలో నలుడు కానీ,
దమయంతి కానీ, నిజమైన ప్రేమకి దృష్ట్యాంతరం కాలేకపోయారు. అదే
కదండీ మన దురదృష్టం?

ఇవాళ లైలా మజ్నూల ప్రస్తావన వస్తే దానికి టీకా తాత్పర్యాలక్కర్లేదు.
అలాగే రోమియో జూలియట్ల ప్రేమ గురించి గానీ, "What's in a Name, if a
Rose be Called by any other name, will it smell any less Sweet?"
అన్న వాక్యాన్ని గానీ ఎవరికీ వివరించాల్సిన అవసరం లేదు. అదే
నలదమయంతుల విషయంలోగానీ, మరే ఇతర ప్రబంధ నాయకా నాయికల
విషయంలోగానీ మనం చెప్పలేము.

నిజంగా నాకనిపించేదేమిటంటే, నిస్సందేహంగా విడదీయరాని అనురాగానికి
ప్రతీకగా ప్రతి తెలుగు వ్యక్తీ అంగీకరించే జంట మాత్రం ఒక్క యెంకీ
నాయుడు బావా మాత్రమే. నేనిందాకా ప్రస్తావించిన విమలా, బుచ్చిబాబూ, లేదా,
రాధా గోపాలం కూడా యేదో మాటవరసకి ప్రస్తావించవలిసిన జంటలే
తప్ప, నిజంగా immortal symbols of love అంటారా శ్రీనివాస్ గారూ?

విధేయుడు,

ఉదయ్


From srini_nagul@y... Wed Dec 08 05:31:43 2004
Return-Path: <srini_nagul@y...>
Received: (qmail 29574 invoked from network); 8 Dec 2004 13:31:42 -0000
Received: from unknown (66.218.66.218)
by m16.grp.scd.yahoo.com with QMQP; 8 Dec 2004 13:31:42 -0000
Received: from unknown (HELO n15a.bulk.scd.yahoo.com) (66.94.237.32)
by mta3.grp.scd.yahoo.com with SMTP; 8 Dec 2004 13:31:42 -0000
Received: from [66.218.66.59] by n15.bulk.scd.yahoo.com with NNFMP; 08 Dec 2004 13:31:38 -0000
Received: from [66.218.67.137] by mailer8.bulk.scd.yahoo.com with NNFMP; 08 Dec 2004 13:31:37 -0000
X-Sender: srini_nagul@y...
X-Apparently-To: racch...@yahoogroups.com
Received: (qmail 41963 invoked from network); 8 Dec 2004 11:21:11 -0000
Received: from unknown (66.218.66.216)
by m21.grp.scd.yahoo.com with QMQP; 8 Dec 2004 11:21:11 -0000
Received: from unknown (HELO n13a.bulk.scd.yahoo.com) (66.94.237.24)
by mta1.grp.scd.yahoo.com with SMTP; 8 Dec 2004 11:21:11 -0000
Received: from [66.218.69.3] by n13.bulk.scd.yahoo.com with NNFMP; 08 Dec 2004 11:21:06 -0000
Received: from [66.218.67.188] by mailer3.bulk.scd.yahoo.com with NNFMP; 08 Dec 2004 11:21:06 -0000
Date: Wed, 08 Dec 2004 11:20:52 -0000
To: racch...@yahoogroups.com
Message-ID: <cp6o2...@eGroups.com>
In-Reply-To: <cp5u9h...@eGroups.com>
User-Agent: eGroups-EW/0.82
MIME-Version: 1.0
Content-Type: text/plain; charset=ISO-8859-1
Content-Length: 1831
X-Mailer: Yahoo Groups Message Poster
X-Yahoo-Newman-Property: groups-system
X-eGroups-Remote-IP: 66.94.237.24
From: "srini_nagul" <srini_nagul@y...>
X-Originating-IP: 65.40.9.75
Subject: Re: మనకంటూ ఒక ప్రేమ కావ్యం
X-Yahoo-Group-Post: member; u=136275963
X-Yahoo-Profile: srini_nagul
X-eGroups-Approved-By: mvmachavaram <mvmachavaram@y...> via web; 08 Dec 2004 13:31:32 -0000
X-eGroups-Remote-IP: 66.94.237.32
X-RB-Message-Num: 11272

--- In racch...@yahoogroups.com, "Uday Bhaskar" gAru wrote:
>
> "బాధ కవిత్వానికి పర్యాయ పదం" అన్న మహాకవి నానుడి
> నిజమనుకుంటే, ప్రేమ సంగతేమో కానీ, కవిత్వానికి మాత్రం కన్నీళ్ళే
> సృజనాత్మక ఊటకి నాందని ఒప్పుకోక తప్పదు.

చక్కని quote ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఆ మహాకవి ఎవరో గాని
నిజం చెప్పారు. కాని కొన్ని "కవిత"లను చూస్తే పొరపాటున వారన్నది
"బాధించడం కవిత్వానికి పర్యాయ పదం" అని చదువుకున్నారేమో అన్న
భయం కలగడం నాకొక్కనికే కాదని అనుకుంటాను !

> మరిపోతే, నల దమయంతుల ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఒకమాట
> చెప్పక తప్పదు. నలుడు దమయంతి పట్ల గానీ, దమయంతి నలుడి
> పట్ల గానీ, వ్యక్తపరచిన ప్రేమ తెలుగువాళ్ళ సాంస్కృతిక జీవనంలో
> భాగం కాలేకపోయింది. తెలుగు వాళ్ళ దైనందిన జీవనంలో నలుడు కానీ,
> దమయంతి కానీ, నిజమైన ప్రేమకి దృష్ట్యాంతరం కాలేకపోయారు. అదే
> కదండీ మన దురదృష్టం?

ఉన్నమాటే అన్నారు. కాని అది నేను దురదృష్టమని అనుకోవడంలేదు.
కొన్ని నెలల కింద ఇక్కడ శ్రీ శాయి గారు చెప్పిన విషయమొకటి
గుర్తుకొచ్చింది. మన సంక్సృతిక జీవనంలో "సీతారాముల" జంట ఎంత
భగం అయిపోయిందో చెబుతూ వారు మన వాళ్ళు ఆ పేర్లు వ్రాసేటప్పుడు కూడా
వాటి మధ్య ఎడం ఉంచకుండా "సీతారాము"లని వ్రాస్తుంటారన్నారు!

> నిజంగా నాకనిపించేదేమిటంటే, నిస్సందేహంగా విడదీయరాని
> అనురాగానికి ప్రతీకగా ప్రతి తెలుగు వ్యక్తీ అంగీకరించే జంట మాత్రం
> ఒక్క యెంకీ నాయుడు బావా మాత్రమే. నేనిందాకా ప్రస్తావించిన విమలా,
> బుచ్చిబాబూ, లేదా, రాధా గోపాలం కూడా యేదో మాటవరసకి
> ప్రస్తావించవలిసిన జంటలే తప్ప, నిజంగా immortal symbols of
> love అంటారా శ్రీనివాస్ గారూ?

"ప్రతి" తెలుగు వ్యక్తీ అని మీరనలేరేమో అని భయంగా, బాధగా ఉంది.
ఎంకీ నాయుడు బావలు "అన్న" దానికన్నా, వారి "గురించే" ఎక్కువగా
తెలియడమే బాధ. దానికి తోడు ఈ "బావ" వరస ఒకటి. శాస్త్రపరంగా
ఈ వరసల చర్చల నీడ దానిపై పడిందంటే అవాస్తవం కాదు.

విధేయుడు

Srinivas

Courtesy: http://www.kanneganti.com/

Hemantha Kumar

unread,
Dec 11, 2004, 2:44:43 PM12/11/04
to racch...@yahoogroups.com

కదిరిలో చంద్రవదన మరియు మొహియార్ ల కథ ఉంది కానీ అది దురద్రుష్టవసాథూ బహుళ ప్రాచుర్యం పొందలేదు. లేక పోతే మనకీ ఓ కథ ఉంది. కాక పోతే ఈకథ కూడా దుఖాంతమే.

మీ
హేమంత కుమార్ పామర్తి

Uday Bhaskar <uday_n@s...> wrote:

<snip>

I agree with Bhaskar that we dont have lovers with the iconic status like Laila Majnu or a Romeo Juliet, other than of course యెంకీ నాయుదు బావ.

<snip>
Regards,

Uday


---------------------------------
Do you Yahoo!?
The all-new My Yahoo! – Get yours free!

[Non-text portions of this message have been removed]

Courtesy: http://www.kanneganti.com/

Hemantha Kumar

unread,
Dec 12, 2004, 6:13:29 AM12/12/04
to racch...@yahoogroups.com

As much as I know of the story, it is like this.

Chandravadana was a beautiful "yavvani" and a daughter of the local Hindu Palegar named Ranga Naidu. Mohiyar is a Mussalman and a wanderer who had stumbled into Kadiri. As is wont of any love story, Mohiyar happens to just see Chandravadana and falls in love with her, at first sight. Apparently, over a period of time, even Chandravadana reciprocates. Mohiyar also ends his wandering and settles down in Kadiri.

But because of the differences in their religions and for fear of ostracization (hope the spelling is right) they could not be united and a lot of defiance was put up from both sides. As the defiance mounted, it becomes more and more difficult for the lovers to see each other. Mohiyar dies yearning to be united with Chandravadana.

Upto here it is like any other love story. But the interesting aspect of the story is this.

When Mohiyar died and the local people wanted to take his body for burial in a "Janaza" (last journey) his body would not budge and any number of people could not lift it. Only when Chandravadana, who heard of the death of Mohiyar, comes sobbing and weeping and touches the body of Mohiyar, could it (the body) be moved nad lifted.

The people of the place, witnessing this scene, conclude that their love is even acceptable to God (!) Chandravadana who could not bear the death of Mohiyar gets herself also buried alive along with the body of Mohiyar.

In Kadiri, even today, one may witness the "Samadhi" of Mohiyar.

Best wishes
Hemantha Kumar

"J. K. Mohana Rao" <jkmrao@y...> wrote:

<snip>


--- Hemantha Kumar <andhraputhra@y...> wrote:
> కదిరిలో చంద్రవదన మరియు మొహియార్ ల కథ ఉంది కానీ అది
> దురద్రుష్టవసాథూ బహుళ ప్రాచుర్యం పొందలేదు.

ఎవ రా చంద్రవదన? ఏమా కథ?

- మోహన


---------------------------------
Do you Yahoo!?
Yahoo! Mail - Easier than ever with enhanced search. Learn more.

J. K. Mohana Rao

unread,
Dec 12, 2004, 9:12:01 AM12/12/04
to racch...@yahoogroups.com

--- Hemantha Kumar <andhraputhra@y...> wrote:

>
> As much as I know of the story, it is like this.
>

Thanks hEmaMta gArU for the story.

Coming back to love stories, don't we have also
the love story of bhAgamati and Qutub shah?
The name bhAgyanagar (after bhAgamati) and
hyderabad (after her married name hydermahal)
arose out of this story, is it not? Can we
not consider this as our own love story?

Regards! - mOhana


__________________________________
Do you Yahoo!?
Yahoo! Mail - 250MB free storage. Do more. Manage less.

Reply all
Reply to author
Forward
0 new messages