Re: స్త్రీ పర్వము

54 views
Skip to first unread message

seshavadapalli

unread,
Nov 22, 2003, 2:35:40 AM11/22/03
to racch...@yahoogroups.com
--- In racch...@yahoogroups.com, "J. K. Mohana Rao" <rao@n...>
wrote:
>
...
...
> కవిబ్రహ్మ తిక్కన కూడ ఎనిమిది పద్యములనే భారతములో
> ఎక్కువగా వాడెను. కాని స్త్రీ పర్వములో మాత్రము కొన్ని వినూత్న
> సంస్కృత వృత్తములను వాడెను. స్త్రీ పర్వము చాల
> శోకమయమైన పర్వము. నిజముగా నిందులో కథ
> ఎక్కువ లేదు. చనిపోయిన పాండవ, కౌరవుల మృత
> కళేబరములను గుర్తుపట్టి, విలపించి, దహనము
> చేయుటయే ఇందులోని సారాంశము. మరి ఇట్టి పర్వములో
> అపరూపమైన వృత్తములను వాడుటలో కారణము ఏమో?
>
...
...
> విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
>

డాక్తర్ కేతవరపు వేంకటరామకోటిశాస్త్రి గారి
"తిక్కన - కావ్యశిల్పము" లోని
"ద్వితీయ ఖండము - అష్టమోన్మేషము - వృత్తౌచిత్య విచారము" నుంచి

----
కవిత్వము హృదయసంవాది యగుటకు ఛందస్సును
తగినంతిగా సహాయ పడుచున్నది. ఛందస్సనగా
పద్యముయొక్క గతి విధానము. క్షేమేంద్రుడు
సువృత్తతిలకమున సాంస్కృతికములైన వృత్తములలో
కొన్నింటియొక్క వినియోగమును నిష్కర్షించిపెట్టు
ప్రయత్నము చేసెను. పూర్వకవులు వ్రాసిన వృత్తములయందలి
లక్షణములను పురస్కరించుకొనియే ఆయన ఆ పని
చేసినను, అది సర్వధా సర్వత్ర వ్యాపనశీలయైన
సిద్ధాంతముగా కనిపించుటలేదు. వృత్తములు గణముల మీద
నిర్మింపబడినవి గనుక నా యా గణములవలన
పద్యములలో వచ్చు భేదము లేకపోయినను,
పరుషసరళాది, ద్విత్వసంయుక్తాది భేదములతో నున్న
వర్ణములయొక్క కూర్పువలన శ్రవణేంద్రియమున
కనుభవమునకు వచ్చు గతిభేదము పద్యములయం
దనివార్యము. ఛందస్సుయొక్క సూకష్మరూపము వర్ణన మని
చెప్పుటలోని ఆంతర్య మిదియే. అందువలన ఫలానా వృత్తము
ఫలానా విషయమునకు వ్యంజకము గనుక, ఆ వృత్తమా
విషయముననే వినియోగింప బడవలయుననిగాని, ఇంతకు
పూర్వమట్లే ఆ వృత్తము వినియోగింప బడినదని కాని
సిద్ధాంతము చేయుటకు వీలులేదు. కవియొక్క సామర్థ్యము
ననుసరించి వర్ణమాదిగా ప్రతిదియు
విశిష్టార్థస్ఫోరకముగా రూపొందగలదు.
తత్తత్ప్రకరణములను బట్టి, తత్తత్సంఘటనా
విశేషమునను పురస్కరించుకొని, సహృదయులు
విశేషార్థమును భావించుట కుపకరించు
బహువిషయములలో ఛందోగతి యొకటి. ఛందము శబ్దము
నాశ్రయించియున్నది. శబ్దములు వర్ణముల వలన నైనవి.
కనుక వర్ణములయొక్క సంయోజన వైలక్షణ్యమును బట్టి
పద్యము యొక్క నడక యున్నది. గణములను బట్టి లేదు.
స్థూలముగా నున్నట్లు కనిపించును. వృత్తముల విషయమే
ఇట్లున్నపుడు, ఆఫలానా గణములే వరుసగా రావలయునని
నియమము లేని మరియు మాత్రల లెక్కమీద ఆధారపడిన
జాత్యుపజాతుల విషయ మసలే నిర్ణయింప వీలు కానిది.
కనుక వృత్తౌచిత్యమన్నది ముఖ్యముగా నా యా
ప్రకరణమును బట్టి కించిత్తు గ్రహింప దగినదియే గాని,
ఫలానా వృత్తము ఫలానా విషయమును వర్ణించుటకే
ఉపయోగించుటను సిద్ధాంతము చేయుటకు నలవికాదు. ఏమనగా
క్షేమేంద్రుడు ఏ వృత్తమున కే వినియోగమును చెప్పినాడో, ఆ
వృత్తమట్లే సర్వకవుల గ్రంథముల యందును లేదు.
సంస్కృతకావ్యములయం దా విషయమెట్లున్నను తెనుగున
మాత్ర మాయన చేసిన నిష్కర్ష తూ చా తప్పకుండ
పాటింపబడలేదు. కొన్ని వృత్తముల విషయమున
క్షేమేంద్రుని సిద్ధాంతమున కనుగుణముగా సమర్థింప
వచ్చును. తిక్కనగారు వాడిన విశేష వృత్తము లీ
క్షేమేంద్రుని మతము ననుసరించి మరియు నన్నయాదుల
ననుసరించి విచారించినచో పై విషయము లన్నియు
స్పష్టము కాగలవు.

...
...

ఇక తిక్కనగారి భారతమునం దున్న విశేషవృత్తముల
వినియోగము విషయము వ్రాయబడును - భారతమునం దొక్క
సౌప్తిక పర్వమునను మరియు స్త్రీ పర్వమునను మాత్రమే
విశేషవృత్తములు వాడబడినవి. ఇందు కపవాదముగా
స్రగ్ధర, మహాస్రగ్ధర, తరువోజ, ఈ మూడును నితర
పర్వముల యం దొక అయిదు కనిపించవచ్చును.
విశేషవృత్తము లనగా, చంపకోత్పల శార్దూల
మత్తేభములు; కందము, సీసము, ఆటవెలది, తేటగీతి; అను
నీ యెనిమిది పద్యములును కానివి. మరి అట్టి
విశేషవృత్తము లా రెండుపర్వముల యందే తిక్కనగా రేల
వాడవలయును?

అశ్వత్థామ పాండవ శిబిరములను, దుర్యోధనుడు తొడలు
విరుగగొట్టబడిన నాటి రాత్రమున ప్రవేశించి సుప్తావస్థ
యందున్న జీవులమీదపడి సర్వసంహారము చేయుట
సౌక్తికపర్వము పథమాశ్వాసము నందలి విషయము.
స్వపుత్ర బాంధవమరణ దుః ఖితులైన పాండవు
లశ్వత్థామను వెంటాడి వాని శిరోమణి నపహరించి
తేజోవిహీనుని చేయుట రెండవయాశ్వాసమునందలి విషయము.
స్త్రీపర్వము ప్రథమాశ్వాసమున ధృతరాష్ట్రుడు గాంధారి
మొదలైన స్వజన మరణదుః ఖపీడితులు, తమ యా దుః
ఖమునకు మూలభూతులైన ధర్మరాజాదులను కలిసికొని
మాట్లాడుటయు ద్వీతీయాశ్వాసమున బీభత్సమును భయానకమును
నైన యుద్ధభూమిని తిరుగాడుచు గాంధారి మృతులను పేరు
పేర పేర్కొని గుండియలవియ నేడ్చుటయు విషయము.

అశ్వత్థామ చేసిన దొకవిధముగా యుద్ధముకాదు.
ఈవిషయమీ గ్రంథమున వెనుక నొకసారి చెప్పబడినది.
కాకపోయినను మరియొక విధముగా నది యుద్ధమే.
దుర్యోధనుడు తొడలు విరుగగొట్టబడి పడియున్నాడే కాని
ఇంకను మరణించలేదు. అశ్వత్థామ కాతడు
సేనాధిపత్యాభిషేకము చేయించి పాండవులమీదకు
పంపినాడు. దుర్యోధనుడు ప్రాణములు విడుచువరకు యుద్ధము
జరిగినట్లే లెక్క. యుద్ధమును ధృతరాష్ట్రునకు
వినిపించుటకుగాను వ్యాసుడు సంజయున కనుగ్రహించిన
వరము మహిమ వానిని విడిచి దుర్యోధనుడు ప్రాణములు
విడుచుటతో పోయినది. అశ్వత్థామ పాండవుల శిబిరములను
ప్రవేశించి శివావేశమున మైమరచి సర్వసంహారము చేసి
వచ్చి యిది యిట్లయిన దని చెప్పిన తరువాత దుర్యోధనుడు
ప్రాణములు విడిచినాడు. అందువలన నశ్వత్థామ చేసినది
యుద్ధమే. కాని తత్పూర్వము ప్రవర్తించిన యుద్ధము
వంటిది మాత్రము కాదు. తేజోరూపమున శివునిచేత
నావేశింపబడినవా డశ్వత్థామ. ధృష్టద్యుమ్నాదులు
సుప్తులు. అశ్వత్థామ వారిమీద విరుచుకపడి కుత్తుకలు
తెగకోసినాడు. మీదపడిన తరువాత మేల్కొని కొంచెము
పెనుగులాడుటయే కాని ధృష్టద్యుమ్నాదులయందు
యుద్ధసన్నద్ధత లేదు. ఇట్టి పరిస్థితి తత్పూర్వము
జరిగిన పదునెనిమిది దినముల యుద్ధమునం దెన్నడును
తటస్థపడలేదు. కనుక నశ్వత్థామ యుద్ధము
యుద్ధముకాదు. అట్లని యుద్ధము కాకను పోదు. అదియొక
విశేషమైన యుద్ధము. అందువలన తిక్కనగారు దాని
విశేషమైన తనమును స్ఫురింపజేయుటకుగాను, తత్పూర్వము
యుద్ధమును వర్ణించునప్పు డుపయోగించిన పద్యములు కాని
విశేషవృత్తములలో, నా యుద్ధము కాని యుద్ధమును
వర్ణించినట్లు కనిపించుచున్నది. రెండవ యాశ్వాసమునను,
అశ్వత్థామ సంరంభము, పాడవుల పుత్రశోకముతోడి
విజృంభణము మొదలైన విషయము లున్నందున విశేష
వృత్తము లుపయోగింపబడిన ట్లూహింపవలయును.
స్త్రీపర్వమున శోకము చిత్తస్థాయిగా వర్ణింపబడినది.
అది భారతమున ప్రధానమైన అంగరసము. అది
తత్పూర్వము ప్రవర్తించిన గ్రంథమునందలి
రసభావములకును, తత్పరమున ప్రవర్తింపనున్న
రసభావములకును విరోధమును పరిహరించు విశేషమైన
రసము. భారతమున దానివైశిష్ట్యము స్ఫురించునట్లుగా
తిక్కనగారు విశేషవృత్తములతో చిత్తస్థాయిగా తచ్ఛొకము
నభివర్ణించినట్లు తెలియవలయును. అనగా
పూర్వాపరములనుండి దేనిని విలక్షణముగా
స్ఫురింపజేయుటను తిక్కనగా రాశించిరో ఏతద్విషయ
వర్ణనమునకు విశేషవృత్తము లుపయోగించినట్లు
తోచుచున్నది. ఇంత కంటె విశేషవృత్తముల వినియోగమును
గురించి చెప్పగలిగినది కనిపించుటలేదు.
----

namassulatO,
V.S.T.Sayee.
http://www.andhrabharati.com


From kamesh_b@y... Sun Nov 23 07:59:18 2003
Return-Path: <kamesh_b@y...>
Received: (qmail 84182 invoked from network); 23 Nov 2003 15:59:17 -0000
Received: from unknown (66.218.66.167)
by m2.grp.scd.yahoo.com with QMQP; 23 Nov 2003 15:59:17 -0000
Received: from unknown (HELO n4.grp.scd.yahoo.com) (66.218.66.88)
by mta6.grp.scd.yahoo.com with SMTP; 23 Nov 2003 15:59:17 -0000
X-eGroups-Return: kamesh_b@y...
Received: from [66.218.67.249] by n4.grp.scd.yahoo.com with NNFMP; 23 Nov 2003 15:59:16 -0000
X-Sender: kamesh_b@y...
X-Apparently-To: racch...@yahoogroups.com
Received: (qmail 17770 invoked from network); 23 Nov 2003 13:40:06 -0000
Received: from unknown (66.218.66.218)
by m8.grp.scd.yahoo.com with QMQP; 23 Nov 2003 13:40:06 -0000
Received: from unknown (HELO web41014.mail.yahoo.com) (66.218.93.13)
by mta3.grp.scd.yahoo.com with SMTP; 23 Nov 2003 13:40:06 -0000
Message-ID: <20031123134006.96899.qmail@w...>
Received: from [202.54.64.9] by web41014.mail.yahoo.com via HTTP; Sun, 23 Nov 2003 05:40:06 PST
Date: Sun, 23 Nov 2003 05:40:06 -0800 (PST)
Subject: వృత్తౌచిత్యము పై శ్రీ కేరా గారి విమర్శనము(Re: స్త్రీ పర్వము)
To: chandassu <chan...@yahoogroups.com>
Cc: racch...@yahoogroups.com
MIME-Version: 1.0
Content-Type: text/plain; charset=us-ascii
From: "Kameswara Rao Bh." <kamesh_b@y...>
X-Originating-IP: 66.218.93.13
X-Yahoo-Group-Post: member; u=28833535
X-Yahoo-Profile: kamesh_b
X-eGroups-Approved-By: mvmachavaram <mvmachavaram@y...> via web; 23 Nov 2003 15:59:16 -0000
X-Originating-IP: 66.218.66.88
X-RB-Message-Num: 7729


శ్రీ కేతవరపు రామకోటిశాస్త్రి గారి వృత్తౌచిత్య
విచారములో వారు ప్రస్తావించిన కొన్ని విషయాలతో నేను
పూర్తిగా ఏకీభవించ లేకపోయాను.
క్షేమేంద్రుడు తన సువృత్తతిలకములో పేర్కొన్న
వృత్తౌచిత్యము, సర్వత్ర సర్వధా వ్యాపన శీలమైన
సిద్ధాంతము కాదనడంలో పెద్ద సందేహమేమీ లేదు. కానీ,
తర్వాత వారు చెప్పిన ఈ క్రింది విషయాలు కొంత
గందరగోళంగా ఉన్నాయి:
"వృత్తములు గణముల మీద నిర్మింపబడినవి గనుక నా యా
గణములవలన పద్యములలో వచ్చు భేదము లేకపోయినను,
పరుషసరళాది, ద్విత్వసంయుక్తాది భేదములతో నున్న
వర్ణములయొక్క కూర్పువలన శ్రవణేంద్రియమున
కనుభవమునకు వచ్చు గతిభేదము పద్యములయం
దనివార్యము. ఛందస్సుయొక్క సూకష్మరూపము వర్ణన మని
చెప్పుటలోని ఆంతర్య మిదియే."

వృత్తములు గణముల మీద నిర్మింపబడినవి అనడంలో శ్రీ
కే రా గారి ఆంతర్యము బోధపడలేదు. గణముల ఆధారంగా
వృత్తలక్షణము గుర్తుపెట్టుకోవడమొక పద్ధతి మాత్రమే.
అంతే కాని అవి గణములమీద నిర్మింపబడినవని
అనడమెంతవరకు సమంజసం? వృత్తాలు గురు లఘు క్రమం
మీద నిర్మింపబడ్డాయి కదా?
అది అలా ఉంచితే, శ్రీ కేరా గారి ఉద్దేశం ప్రకారం
పరుషసరళాది, ద్విత్వసమ్యుక్తాది భేదములు పద్యానికి
గతిభేదాన్నిస్తాయి. ఇది కూడా అంత సరియైనదని నాకు
తోచటం లేదు. గతి భేదాన్ని ఇచ్చేవి ప్రధానంగా గురు
లఘువులు కాని పరుష సరళాలు లేక ద్విత్వ సమ్యుక్తాలూ
కాదు. ఉదాహరణకి "ఏకడ నుండి రాక" అన్నా "ఎక్కడ
నుండి రాక" అన్నా ఒకటే గతి. "ఏ కడ" లో ద్విత్వంకాని
సమ్యుక్తంగానీ లేవు. "ఎక్కడ" లో ద్విత్వం ఉంది. అయినా
ఒకటే గతికి కారణం, రెండూ గురువు లవ్వడమే. సరే,
పరుష సరళాఉలకూ గతికీ సంబంధమే లేదు!
ఈ పరుష సరళాదులూ, ద్విత్వ సమ్యుక్తాలూ
భావస్ఫోరకాలు అవ్వవచ్చు కాని గతి నిర్దేశకాలు కావు.
ఛందస్సుకీ వీటికీ పెద్దగా సంబంధం లేదు.
"ఛందస్సుయొక్క సూకష్మరూపము వర్ణన మని
చెప్పుటలోని ఆంతర్య మిదియే" అన్న వారి వాక్యం నాకు
అర్థమే కాలేదు.
శ్రీ కేరా గారీ వ్యాసంలో పేర్కొన్న మరి కొన్ని విషయాలు:
"ఛందము శబ్దము
నాశ్రయించియున్నది. శబ్దములు వర్ణముల వలన నైనవి.
కనుక వర్ణములయొక్క సంయోజన వైలక్షణ్యమును బట్టి
పద్యము యొక్క నడక యున్నది. గణములను బట్టి లేదు.
స్థూలముగా నున్నట్లు కనిపించును. వృత్తముల విషయమే
ఇట్లున్నపుడు, ఆఫలానా గణములే వరుసగా రావలయునని
నియమము లేని మరియు మాత్రల లెక్కమీద ఆధారపడిన
జాత్యుపజాతుల విషయ మసలే నిర్ణయింప వీలు కానిది."

ఇది చాలా ముఖ్యమైన విషయం, చాలా ఆలోచించ
వలసినది కూడాను. "వర్ణములయొక్క సంయోజన
వైలక్షణ్యమును బట్టి పద్యము యొక్క నడక యున్నది.
గణములను బట్టి లేదు." ఇది చాలా వరకు సరియైనదీ,
చాలామంది గమనించనిదీ కూడాను. వృత్తాలలో గురు లఘు
క్రమం మాత్రమే నిర్దేశింపబడుతుంది. అంతేకాని,పదాలు
ఎలా విరగాలీ అన్న విషయాన్ని నిర్దేశించదు. శంస్కృతంలో
విరామ యతి కొంతవరకు ఈ పని చేస్తుంది కాని పూర్తిగా
కాదు. తెలుగులో సరే సరి! పద్యానికి వచ్చే నడక,
పదాల పొహళింపు మీద ప్రథానంగా ఆధారపడుతుంది.
ఉదాహరణకు, ఈ రెండు ఉత్పలమాల పాదాలను చూడండి:
"సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే"
"ఓ చతురాస్య వంశ కలశోదధి పూర్ణ సశాంక..."
రెంటి గతులలోనూ ఎంత భేదముంది!
అయితే ఈ గతి భేదం గణాలబట్టి, లేదా ఛందస్సు
లక్షణాన్ని బట్టి అసలే ఉండదని చెప్పడం పొరపాటే
అవుతుంది. ఎందుకంటే, కొన్ని కొన్ని వృత్తాలు, ఛందస్సులూ
ఒక విలక్షణమైన గతిని కలిగి ఉంటాయి. ఉదాహరణకు
మత్తకోకిల వృత్తాన్ని గానీ, ఆటవెలది ఉపజాతిని కానీ
తీసుకోండి. అందులో ఏ పద్యం చూసినా, వాటి వాటికున్న
ప్రత్యేకమైన నడక స్పష్టమ్గా తెలుస్తుంది. ఆ నడక
అసలే లేకుండా అలాటి పద్యాలు వ్రాయగలగడం అంత
సులువైన పని కాదు!
నడక అన్నది ప్రథానంగా ఒకే రకమైన శబ్దక్రమం
యొక్క ఆవృత్తి మూలంగా ఏర్పడుతుంది. ఈ ఆవృత్తి అన్నది,
పదాల పొందికలో ఉండవచ్చు, లేదా గురు లఘు క్రమంలో
ఉండవచ్చు. ఉత్పలమాల వంటి వృత్తాలలో, ఒకే రకమైన
గురు లఘుక్రమావృత్తి ఒక పాదంలో కనిపించదు (ప్రతి
పాదంలోను ఒకే క్రమం ఆవృత్తి అవుతుంది కాని, ఒకే పాదంలో
ఒక గురు లఘు క్రమం మరల మరల ఆవృత్తి అవ్వడం
లేదు). అందువల్ల వాటికి ప్రస్ఫుటమైన నడక
కనిపించదు. పదాల క్రమాన్ని బట్టి నడక
యేర్పడుతుంది. అదే మత్తకోకిల తీసుకుంటే, "UI UII"
అన్న గురులఘు క్రమం మళ్ళీ మళ్ళీ వస్తుంది. అలాగే
ఆటవెలది తీసుకుంటే "UI" లేదా "III" అన్న క్రమం
బేసి పాదాలలో మూడు సార్లూ, సరి పాదాలలో ఐదుసార్లూ
ఆవృత్తమవుతాయి. అందువల్ల వాటికి ఒక ప్రత్యేకమైన
నడక కలుగుతోంది.
కాబట్టి, నడక గురించి, "వృత్తముల విషయమే
ఇట్లున్నపుడు, ఆఫలానా గణములే వరుసగా రావలయునని
నియమము లేని మరియు మాత్రల లెక్కమీద ఆధారపడిన
జాత్యుపజాతుల విషయ మసలే నిర్ణయింప వీలు కానిది"
అని శ్రీ కే రా గారన్న మాటలు సరికావు.
నా పై వాదనలోని తప్పొప్పులు పెద్దలు నిర్ణయింతురు
గాక.

భవదీయుడు,
కామేశ్వర రావు.


__________________________________
Do you Yahoo!?
Free Pop-Up Blocker - Get it now
http://companion.yahoo.com/


Courtesy: http://www.kanneganti.com/

J. K. Mohana Rao

unread,
Nov 21, 2003, 11:42:10 AM11/21/03
to chan...@yahoogroups.com, racch...@yahoogroups.com

తెలుగులో వెలసిన పద్య కావ్యములలో సామాన్యముగా
ఎనిమిది రకములైన పద్యములను మాత్రమే వాడినారు.
అవి- చంపక, ఉత్పల మాలలు, శార్దూల, మత్తేభ
విక్రీడితములు, సీసము, కందము, ఆటవెలది, తేటగీతులు.
మిగిలిన వృత్తములను, జాత్యుపజాతులను కవులు
ఆశ్వాసాంతములలో మఱియు వారికి ఇచ్చ వచ్చిన చోటులలో
వాడినారు.

కవిబ్రహ్మ తిక్కన కూడ ఎనిమిది పద్యములనే భారతములో
ఎక్కువగా వాడెను. కాని స్త్రీ పర్వములో మాత్రము కొన్ని వినూత్న
సంస్కృత వృత్తములను వాడెను. స్త్రీ పర్వము చాల
శోకమయమైన పర్వము. నిజముగా నిందులో కథ
ఎక్కువ లేదు. చనిపోయిన పాండవ, కౌరవుల మృత
కళేబరములను గుర్తుపట్టి, విలపించి, దహనము
చేయుటయే ఇందులోని సారాంశము. మరి ఇట్టి పర్వములో
అపరూపమైన వృత్తములను వాడుటలో కారణము ఏమో?

మచ్చునకు ఉదాహరణలు-

మంజుభాషిణి- స-న-స-జ-గ (1, 9)
ధనమంతయు బొలియ దారుణంబుగా
దనయవ్రజంబు దెగ దైన్య మారగా
దన బంధు లందఱు మృతంబు బొంద నె-
వ్వని నైన శోక మను వహ్ని గాల్పదే

దోదకము- భ-భ-భ-గగ (1, 7)
దేవకృతంబులు ధీరులకైనన్
భూవర మాన్పగ బోలునె యెట్లుం
గావున శోకము గాఱియు దల్గం-
గా వలదే తుది గౌరవ మొప్పన్

ద్రుతవిలంబితము- న-భ-భ-ర (1, 7)
చనగ నాతడు సాత్యకి వాయునం-
దనుడు గాండివి దమ్ములు సూరెలం
జనిరి ద్రౌపది సంభృతశోకయై
చనియె జుట్టపు జానలు సుట్టరాన్

తోటకము- స-స-స-స (1, 9)
సతతంబును శిష్యులు సద్వినయా-
న్వితులై ప్రణమిల్లెడు వీరపద-
ద్వితయంబు గడుం జెడ దిన్నవి సూ-
చితె నక్కలు దైవము చెయ్ది గటా

తిక్కన ఈ పర్వములో వాడిన ఎనిమిది పద్యములకు
చెందని 38 పద్యముల పేరులు-

అంబురుహ, బంధుర, భాస్కరవిలసిత,
భుజంగప్రయాత, దోదక, ద్రుతవిలంబిత,
ఇంద్రవజ్ర, జలధర, కవిరాజవిరాజిత,
క్రౌంచపద, లయగ్రాహి, లయవిభాతి,
మాలిని, మానిని, మందాక్రాంత,
మంజుభాషిణీ, మంగళమహాశ్రీ, మణిగణనికర,
మణిమాల, మత్తకోకిల, మేదిని,
నర్కుట, ప్రహరణకలిత, ప్రణవ,
సరసిజ, శిఖరిణీ, స్రగ్విణీ,
శుద్ధవిరాటి, స్వాగత, తరల,
తరువోజ, తోదక, తోటక,
ఉపజాతి, ఉపేంద్రవజ్ర, ఉత్సాహ,
వనమయూర, వసంతతిల్కా.

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు


Courtesy: http://www.kanneganti.com/

J. K. Mohana Rao

unread,
Nov 24, 2003, 10:24:55 AM11/24/03
to racch...@yahoogroups.com, chan...@yahoogroups.com
"J. K. Mohana Rao" wrote:


> స్త్రీ పర్వములో మాత్రము కొన్ని వినూత్న
> సంస్కృత వృత్తములను వాడెను.

1) కవిబ్రహ్మ వ్రాసిన మహాభారతములోని పదునైదు
పర్వములలో నలుబదియొక విశేష వృత్తములను
వాడెను. అందులో ముపాదితొమ్మిది స్త్రీ పర్వములో
నున్నవి. సౌప్తిక పర్వములో స్రగ్ధర, మహాస్రగ్ధరలను
అధికముగా వాడెను.
2) క్షేమేంద్రుని సువృత్తతిలకము మిల్లియన్ బుక్
ప్రాజెక్ట్లో నున్నది. అతడు చెప్పిన వృత్తౌచిత్యము
సంస్కృత సాహిత్యమునకు చెందినది. దానిని తెలుగుకు
సమన్వయము చేయుట కొద్దిగా కష్టమే.
3) తిక్కన్ వ్రాసిన వృత్తముల పేరులకు అందులోని
విషయములకు సంబంధము చాల తక్కువ.
4) స్త్రీపర్వము కరుణరసము, శోకరసములతో
నిండిన పర్వము. ఆ పర్వములో మాత్రమే విశేష
వృత్తములను విశేషించి వాడుటకు కారణము ఏమో?
ఉదాహరణకు తోటకములో మధురాష్టకము, శ్రీ
వేంకటేశ్వర సుప్రభాతము వ్రాయబడినవి. నేను
ఉదాహరించిన తోటక వృత్తములో తన శిష్యులచే
అర్చింపబడు ద్రోణుని కళేబరపు పాదములను నక్కలు
తినినవి అని సూచించెను. ఈ విషయమును ఆటవెలది
లేక తేటగీతిలో కూడ చెప్పవచ్చు గదా, మరి తోటక
వృత్తమును ఉప్యోగించుటకు కారణము?
5) తిక్కన నాటకములను బాగుగా చదివి ఉండవలయును.
శోకరసపు ఆధిక్యత చదివే వారి హృదయములకు
ఎక్కడ ఎక్కువగా కష్టము కలిగించునో అని తలచి, దానిని
కొద్దిగా మరల్చుటకై విశెష వృత్తములను ఉపయోగించి
ఉండవలయును. This is just to divert the readers from
too much dramatic intensity in pathos. This style has been
used in dramas where the court jesters divert the attention
from the main drama. It is also quite often used in modern
day movies.
నా ఉద్దేశ్యములో తిక్కనయొక్క విశేష వృత్తముల
ఉపయోగము ఒక సమస్యయే (a riddle). అన్వేషకుల,
విమర్శకుల పరిశొధనకు ఇది ఒక మంచి అంగమే.

Reply all
Reply to author
Forward
0 new messages