[racchabanda] New Issue of eemaaTa available

12 views
Skip to first unread message

Suresh Kolichala

unread,
Nov 2, 2005, 6:31:58 AM11/2/05
to racch...@yahoogroups.com

Greetings!

The new issue of eemaaTa is available for your reading pleasure!
Below are the table of contents:


విషయ సూచి
హ్త్త్ప్://వ్వ్వ్.ఈమాత.చొం/ఇస్సుఎ40/దిరెచ్తొర్య్.హ్త్మ్ల్

కవితలు

నిద్ర - మూలా సుబ్రహ్మణ్యం
హ్త్త్ప్://వ్వ్వ్.ఈమాత.చొం/ఇస్సుఎ40/నిద్ర.హ్త్మ్ల్
చుక్కల పరుపుపై
మబ్బుల దుప్పటీ కప్పుకుని
చంద్రుడు

మిడిల్ డ్రాప్ - వెల్చేరు నారాయణరావు
హ్త్త్ప్://వ్వ్వ్.ఈమాత.చొం/ఇస్సుఎ40/మిద్ద్లెద్రొప్.హ్త్మ్ల్
అమ్మాయిల మనస్సుల్లా పక్కవాడి ఆట అర్థం కావడం లేదు
అరకు రాణీ వెక్కిరిస్తూ అవతలవాడి చేతిలో చిక్కింది

వైరుధ్యం - వి. ఆర్. విధ్యార్థి
హ్త్త్ప్://వ్వ్వ్.ఈమాత.చొం/ఇస్సుఎ40/వైరుధ్యం.హ్త్మ్ల్
జ్ఞాపకముందా?
చిన్నప్పుడు అమ్మ వేలు పట్టుకుని నువ్వు నడుస్తున్నప్పుడు
భూమ్మీద పరుచుకున్న వర్షపు నీటి అద్దాలు నీలి మైదానాలైతే
ఆ నీలి మైదానాల్లో పరుగెత్తే మబ్బు పిల్లలతో ఉరుకుడు పందెం కాచి
బొక్కాబోర్లాపడి తడిసిపోయింది

శాన్ఫ్రాన్సిస్కో - సాయి బ్రహ్మానందం గొర్తి
హ్త్త్ప్://వ్వ్వ్.ఈమాత.చొం/ఇస్సుఎ40/స్ఫొ.హ్త్మ్ల్
ప్రకృతి వికృతుల్ని
సమతుల్యంగా మోసే
స్వేచ్ఛ భుజమ్మీద
సప్తవర్ణాల పచ్చబొట్టు

ద్వంద్వాలు - యోగానంద్ సరిపల్లి
హ్త్త్ప్://వ్వ్వ్.ఈమాత.చొం/ఇస్సుఎ40/ద్వంద్వాలు.హ్త్మ్ల్
సుడి రేగి కుదిపేస్తోంది,
వేరు వదలకుంది!
మధ్యలో-
చెట్లు విరిగిపోతున్నాయి...

కథలు

ంఅకె ఫీచె - మొదటి భాగం - కనక ప్రసాద్
హ్త్త్ప్://వ్వ్వ్.ఈమాత.చొం/ఇస్సుఎ40/మకెపీచె.హ్త్మ్ల్
"దిస్సీజ్ మై వొయిఫ్ .... అన్నమేరి! అవర సన్ మేక్ పీస్!" అన్నాడు.
అలాగే మర్యాదగా ముభావంగా నవ్వి "నమస్తే ఆంటీ!" అని,
అంతలోకే తను తప్పు విందేమోనని సందేహంగా "బాబు
పేరేంటంకుల్ ?" అంది. ఆయన పెద్ద పెట్టె, చిన్న పెట్టె రెండు
చేతుల్తో ఎత్తి పట్టుకున్న కష్టం నిగ్రహించుకుంటూ "మేక్ పీస్ " అనే
అన్నాడు మళ్ళీ.

కేసు - విప్లవ్
హ్త్త్ప్://వ్వ్వ్.ఈమాత.చొం/ఇస్సుఎ40/కేసు.హ్త్మ్ల్
ఈ ఇప్లవం అనేటోళ్ళను జెయిల్ల పెడితె నా కొడుకు రాడు. ఆళ్ళు ఇప్పుడు
చెప్పినట్టే ఒక మనిషిని చంపితే ఇప్లవానికి పనికొస్తది అని
చెప్పకుండా ఆగరు.

నువ్వు నాకొద్దు - లైలా యెర్నేని
హ్త్త్ప్://వ్వ్వ్.ఈమాత.చొం/ఇస్సుఎ40/నువ్వునాకొద్దు.హ్త్మ్ల్
"ఐతే డాక్టర్ షామల్ , డేవిడ్ ఆర్థర్ చచ్చినా బట్టలు మాత్రం
విప్పేది లేదు . నీతో పరీక్ష చేయించుకునేది లేదు-అన్నాడు."

మార్పు - నోరి రాధిక
హ్త్త్ప్://వ్వ్వ్.ఈమాత.చొం/ఇస్సుఎ40/మార్పు.హ్త్మ్ల్
ప్రేమ వివాహాల్లో ఒకరంటే ఒకరికి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా
ఉండటం వలన. ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసునని ఒకరి మీద
ఒకరికి చాలా ప్రేమ ఉందని ఆ ప్రేమ వలన ఏ త్యాగమైనా
చేయటానికి ఎదుటివారు అనుక్షణం సిద్ధంగా ఉంటారని ఆశిస్తారు.
అవన్నీ నిజం కాదన్న చేరు రుచి తెలియగానే, ఇదిగో, మీ
ఇద్దరిలాగే తలక్రిందులౌతారు.

వ్యాసాలు

శిలాంతరాళలోలిత రేవతీదేవి - కొడవళ్ళ హనుమంతరావు
హ్త్త్ప్://వ్వ్వ్.ఈమాత.చొం/ఇస్సుఎ40/రెవతిదెవి.హ్త్మ్ల్
కొత్త గొంతుకతో శిలా హృదయాల్ని కదిలించే గీతాల్ని సృజించి,
తెలుగు నవలా సాహిత్యమ్లో ఒక మణిరత్నానికి
కారకురాలయిన "శిలాలోలిత" రేవతీదేవి

తెలుగుదనం - వేలూరి వేంకటేశ్వర రావు
హ్త్త్ప్://వ్వ్వ్.ఈమాత.చొం/ఇస్సుఎ40/తెలుగుదనం.హ్త్మ్ల్
తెలుగువారి అచ్చతెలుగుదనం తెలుగు వారి వంటకాల్లోనే ఉట్టిపడుతూ
ఉంటుంది.

హిందూస్తానీ సంగీతం - డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్
హ్త్త్ప్://వ్వ్వ్.ఈమాత.చొం/ఇస్సుఎ40/హిందుస్తని.హ్త్మ్ల్
హిందూస్తానీ గాత్రమ్లో విలంబిత్ ఖయాల్ విన్న తెలుగువాళ్ళు
కొందరు "ఇదేమిట్రా, పులితేన్పు లొచ్చినట్టుగా పాడుతున్నాడూ?"
అంటారు.

తెలుగు సినిమా? తెగులు సినిమా? - డా. పూడిపెద్ది శేషు శర్మ
హ్త్త్ప్://వ్వ్వ్.ఈమాత.చొం/ఇస్సుఎ40/తెలుగుసినిమా.హ్త్మ్ల్
మంచి సినిమా అంటే ఉన్నత భావాలను ప్రేరేపించేటట్టు ఉండాలి.
కాని ఈ నాటి తెలుగు సినిమా ప్రేరేపించేది చాలా మట్టుకు నీచ
భావాలే.

తెలుగు భాష వయస్సెంత? - సురేశ్ కొలిచాల
హ్త్త్ప్://వ్వ్వ్.ఈమాత.చొం/ఇస్సుఎ40/తెలుగువయస్సు.హ్త్మ్ల్
తెలుగుభాష గురించి చాలామంది భాషావేత్తలు ఒప్పుకునే
వివరాలను నాకు తెలియవచ్చినంత తేటపరచాలని ఈ
వ్యాసరచనా సాహసానికి పూనుకున్నాను.










------------------------ Yahoo! Groups Sponsor --------------------~-->
Get fast access to your favorite Yahoo! Groups. Make Yahoo! your home page
http://us.click.yahoo.com/dpRU5A/wUILAA/yQLSAA/4XQrlB/TM
--------------------------------------------------------------------~->

To Post a message, send it to: racch...@yahoogroups.com

Converted into Telugu script by Ramarao Kanneganti's program

Hanuma Kodavalla

unread,
Nov 5, 2005, 8:08:17 PM11/5/05
to racch...@yahoogroups.com
> Suresh Kolichala [suresh_k...@yahoo.com] November 02, 2005 3:32 AM

> The new issue of eemaaTa is available for your reading pleasure!


వేలూరి గారి పేరెత్తితేనే మా ఆవిడకి చిర్రెత్తుతుంది. ఆయన పుణ్యమా అని ఇంట్లో
ఏమూల చూసినా కనిపించే, చివరికి పడగ్గదిలో గూడా ప్రవేశించిన
నిఘంటువులంటే ఆవిడకి మహా కోపం.

చానాళ్ళ తర్వాత, ఇవాళ నా మీద దయ గలిగి పెసరట్లు వేసింది. ఎలా ఉన్నాయని
అడిగింది. సాహిత్యం గురించే కాక ఆహారం గురించి గూడా నిశ్చితాభిప్రాయాలు
ఉన్న వాడిని కావడాన, పెదవి విరిచాను. ఏమయిందని ముఖం చిట్లించింది.
వేలూరి గారి వ్యాసం వలన కలిగిన జ్ఞానం తో సాధికారంగా లోటుపాట్లని
వివరించాను. అగ్నికి ఆజ్యం తోడయినట్లయింది. ఇక ఈ ఇంట్లో పెసరట్లు వేయ
బడవు అని పెనం అవతల పడేసింది.

"బడవు" అంటే రామారావు గారు సమ్తసించినా, రంగనాయకమ్మ గారు ఆగ్రహిస్తారని
అందామనుకుని సందర్భం మంచిది కాదనుకొని, వేరే వ్యాసం చదవసాగాను.

తెలంగాణా-ఆంధ్ర-అట్లాంటా సురేష్ గారు, పగలు ప్రోగ్రామింగ్ పని చేసుకుంటూ,
రాత్రుళ్ళు రెండు PhDలకి సరిపడా భాషా శాస్త్రం చదివినట్లున్నారు. మన
భాష పుట్టు-పూర్వోత్తరాలు చక్కగా వివరించారు.

సురేష్ గారూ, మీరు తెలుగు పదాన్ని, సంస్కృత పదాన్ని కలిపి రాయగూడదన్నారు.
గిడుగు మీద సంభాషణలో, విప్లవ్ గారు, "In telugu it is hard to form new
words without borrowing from outside of the 'native' language." అన్నారు.

విప్లవ్ గారి మాటలు నాకాశ్చర్యం కలిగించాయి. తెలుగులో--పూవత్తి, పూస
గుచ్చినట్లు, వెన్నపూస, తెల్లపోయాడు, ప్రొద్దుపుచ్చు, ప్రొద్దుతిరుగుడుపువ్వు,
విసనకర్ర, కోడెత్రాచు, నెరజాణ--ఇలా ఎన్నో కొత్త మాటలు పాత మాటలనుండి
వచ్చాయి గదా! నేను విప్లవ్ గారన్నది తప్పు అర్థం చేసుకున్నానా? అరువు
తెచ్చుకోకుండా మన భాషలో కొత్త మాటలు సృష్టించటం కష్టమా?

తెలుగు సమ్స్కృతం నుండి పుట్టిన భాష కాదని నిరూపించడానికి ఇంకా మమ్చి
ఆధారాలు ఇస్తే బాగుండేది. "ఆమ్ధ్రుల సంస్కృతి-చరిత్ర" అనే పుస్తకమ్లో ఇలా
ఉంది: "ఒక భాష ఏ కుటుంబానికి చెందినదో నిర్ణయించేందుకు పండితులు
సర్వనామాలు, సంఖ్యావాచకాలు, శరీరాంగాల పేర్లు, బంధుత్వపు పిలుపులు
మొదలయినవి పోల్చిచూస్తారు. భిన్న భాషల మధ్య సంబంధాన్ని ఆ
భాషాపదాల, ధ్వనుల మధ్య ఉన్న క్రమ సంబంధాన్ని బట్టి నిర్ణయిస్తారు.
దీన్ని తులనాత్మక పరిశీలిన అంటారు. ఈ పరిశీలినబట్టి తెలుగు, తమిళం,
కన్నడం, కుయి భాషలు ఒకే కుటుంబానికి చెందినవని రుజువవుతూంది.
సంస్కృతానికీ వీనికీ పోలికే లేదు."

ఈ పుస్తకానికి మూలం "A Study of the History and Culture of the Andhras" by
Kambhampati Satyanarayana. దాంట్లో ముక్కు, నాలుగు, తల్లి లాంటి మాటలని
వివిధ భాషల్లో పోల్చి చూపారు. ఇది చదవదగ్గ పుస్తకం అని చెప్పేముందు
ఒక మాట చెప్పాలి, ఎమ్దుకంటే కొందరికి పట్టింపులుంటాయి కాబట్టి --
కంభంపాటి గారు కమ్యూనిస్టు. నేను చదివిన కొంచంలో మార్క్సిస్టు
మసిపూసిమారేడుకాయ చేసినట్లు అనిపించలేదు. కొత్త సచ్చిదానందమూర్తి గారు
కూడా మెచ్చుకున్నారు కాబట్టి, చదివితే ప్రమాదముండదనే నా అభిప్రాయం.:-)

ఆ పుస్తకం నుంచే కంద పద్యం గురించి తెలుసుకున్నాను. ఒక శనివారపు
సాయంకాలపు చదువుతో కూడిన మిడిమిడి జ్ఞానం. కందకీ గీతకీ ఇంకా తేడా
తెలియదు -- క్షమించండి.:-)

కొడవళ్ళ హనుమమ్తరావు

Suresh Kolichala

unread,
Nov 7, 2005, 5:14:34 PM11/7/05
to racch...@yahoogroups.com
--- In racch...@yahoogroups.com, "Hanuma Kodavalla" <hanumak@h...>
wrote:
>
> వేలూరి గారి పేరెత్తితేనే మా ఆవిడకి చిర్రెత్తుతుంది. ఆయన పుణ్యమా
> అని ఇంట్లో ఏమూల చూసినా కనిపించే, చివరికి పడగ్గదిలో గూడా
> ప్రవేశించిన నిఘంటువులంటే ఆవిడకి మహా కోపం.
>
> చానాళ్ళ తర్వాత, ఇవాళ నా మీద దయ గలిగి పెసరట్లు వేసింది.
> ఎలా ఉన్నాయని అడిగింది. సాహిత్యం గురించే కాక ఆహారం గురించి
> గూడా నిశ్చితాభిప్రాయాలు ఉన్న వాడిని కావడాన, పెదవి విరిచాను.
> ఏమయిందని ముఖం చిట్లించింది. వేలూరి గారి వ్యాసం వలన
> కలిగిన జ్ఞానం తో సాధికారంగా లోటుపాట్లని వివరించాను.
> అగ్నికి ఆజ్యం తోడయినట్లయింది. ఇక ఈ ఇంట్లో పెసరట్లు వేయ
> బడవు అని పెనం అవతల పడేసింది.

ఈ విషయమ్లో మా ఆవిడది కూడా మీ ఆవిడ జట్టే. వేలూరి గారు
అట్లాంట వచ్చినప్పటినుండీ ఇంట్లో భార్య పిల్లలలో ఆమాట, ఈమాట
మాట్లాడకుండా ఎప్పుడూ కంప్యూటర్ వైపు చూస్తూ ఈమాట, ఈమాట అని
వెర్రి కేకలు వేస్తున్నానని మా ఆవిడ కంప్లైంట్!!

> "బడవు" అంటే రామారావు గారు సమ్తసించినా, రంగనాయకమ్మ
> గారు ఆగ్రహిస్తారని

రంగనాయకమ్మ గారు "బడు/బడవు" ఇంగ్లీష్ భాష ప్రభావమంటు
రాసినట్లు రచ్చబండలో చదివాను. కానీ నన్నయ్య మహా భారతమ్లో
కూడ బడు/పడు ప్రయోగాలున్నాయని భద్రిరాజు గారంటున్నారు.
నన్నయ్యకు ఇంగ్లీష్ అంతగా రాదేమో అని నా అనుమానం. మీరేమంటారు?

> సురేష్ గారూ, మీరు తెలుగు పదాన్ని, సంస్కృత పదాన్ని కలిపి
> రాయగూడదన్నారు.

నేననలేదు, పూర్వ లాక్షణీకులన్నారు. కానీ తెలుగులో లిఖిత
సాహిత్యము రావటానికి ముందే ఎన్నో దుష్ట సమాసాలు వాడుకలో
ఉండేవి. ఉదా.: గర్భగుడి, ముమ్మూర్తులు.

> తెలుగు సమ్స్కృతం నుండి పుట్టిన భాష కాదని నిరూపించడానికి
> ఇంకా మమ్చి ఆధారాలు ఇస్తే బాగుండేది.

నిజమే! అనేక విషయాల్లో నా వ్యాసం అసంపూర్ణమే. (అసలు non-
writer అయిన నా వ్యాసాన్ని ప్రచురణకు అంగీకారించడం
ఆశర్యకరమైన విషయమే). క్లిష్టమైన భాష శాస్త్ర వివరాలు
రాస్తే పఠనీయత తగ్గిపోతుందని చాలా వివరాలని తొలగించాను.

ఉదాహరణకి పోతన రాసిన "ఎవ్వనిచే జనించు ... వానిన్ శరణంబు
వేడెదన్" అన్నది సమ్కృత భాషా ప్రభావం తో రాసిన పద్యమని
చెప్పిన వివరణలు ఆ వ్యాసమ్లో లేవు. దానికి వివరణ ఇది:

ద్రావిడ భాషల్లో సమ్స్కృత భాషలో లేని క్రియా విషేశాలు
ఉన్నాయి. సమ్కృత భాషలో "చేసిన వాడు" అని చెప్పాలంటే సూటిగా
చెప్పలేం. దాన్ని "యస్యకారస్య సః" (ఎవడు చేసాడో వాడు) అనాలి.
సమ్స్కృతమ్లో వీటిని యథ్+తథ్+అరకాలు అంటారు (యథ-తథ, జొ-వొ,
జహా-వహా). తెలుగు వంటి ద్రావిడ భాషలో మాత్రం "చేసిన
వాడు", "చేసెడి వాడు", "చేస్తున్న వాడు" అన్న క్రియా విషేశణాలతో
చెప్పటమే సహజమ్గా అనిపిస్తుంది. ఈ మధ్య వచ్చిన ఒక హింది సినిమా
లోని ఈ వాక్యాలను తెలుగులోకి అనువాదం చేయడానికి ప్రయత్నిస్తే
మీకా అసహజత్వం తెలుస్తుంది

యే వొ బంధన్ హై జొ కభి టూట్ నహిన్ సక్తా

యే పల్ హై వహీ, జిస్ మైన్ హై ఛుపీ



Regards,
Suresh.
PS: To those who wanted to know my native place, here are some hints:

1. The town I was born and brought up is in telangaaNa
2. The rounded numbers for latitude and longitude for this place are
both prime numbers.
3. The name of this place can be interpreted in acca telugu
as "sparkling town." There are varied sanskritic interpretations for
this name too.

V.R. Veluri

unread,
Nov 7, 2005, 8:10:16 PM11/7/05
to racch...@yahoogroups.com, vrve...@gmail.com
Y~YYQXQ~@#పెసరట్టు తినడానికి శిక్షణ, సాధన --- ఈ రెండూ కావాలని చెప్పిన
గుర్తు. శ్రీమతి కొడవళ్ళ గారు మీకు మంచి శిక్ష (ణ) ఇచ్చినట్టే కనపడుతూ
వున్నది. మీ సాధనలోనే లోపం కొట్టొచ్చినట్టు కనపడుతున్నది.
Practice makes a MAN perfect అని కదూ అన్నారు!
Good luck!
Regards, --- Veluri Venkateswara Rao
ps: It looks like my computer learned to send mail to RB even before I
finish typing! Isn't it a violation of Physics Principle, "Action-at-A-
Distance?"

On 11/5/05, Hanuma Kodavalla <han...@hotmail.com> wrote:
>
> > Suresh Kolichala [suresh_k...@yahoo.com] November 02, 2005 3:32 AM
>
> > The new issue of eemaaTa is available for your reading pleasure!
>
>
> వేలూరి గారి పేరెత్తితేనే మా ఆవిడకి చిర్రెత్తుతుంది. ఆయన పుణ్యమా అని ఇంట్లో
> ఏమూల చూసినా కనిపించే, చివరికి పడగ్గదిలో గూడా ప్రవేశించిన
> నిఘంటువులంటే ఆవిడకి మహా కోపం.
>
> చానాళ్ళ తర్వాత, ఇవాళ నా మీద దయ గలిగి పెసరట్లు వేసింది. ఎలా
> ఉన్నాయని
> అడిగింది. సాహిత్యం గురించే కాక ఆహారం గురించి గూడా నిశ్చితాభిప్రాయాలు
> ఉన్న వాడిని కావడాన, పెదవి విరిచాను. ఏమయిందని ముఖం చిట్లించింది.
> వేలూరి గారి వ్యాసం వలన కలిగిన జ్ఞానం తో సాధికారంగా లోటుపాట్లని
> వివరించాను. అగ్నికి ఆజ్యం తోడయినట్లయింది. ఇక ఈ ఇంట్లో పెసరట్లు వేయ
> బడవు అని పెనం అవతల పడేసింది.
>
> [స్నిప్]


[ణొన్-తెకష్త్ పొర్తిఒన్స్ ఒఫ్ థిస్ మెస్సగె హవె బీన్ రెమొవెద్]






------------------------ అహూ! ఘ్రౌప్స్ శ్పొన్సొర్ ---------------------->
ఘెత్ ఫస్త్ అచ్చెస్స్ తొ యౌర్ ఫవొరితె అహూ! ఘ్రౌప్స్. ంఅకె అహూ! యౌర్ హొమె పగె
హ్త్త్ప్://ఉస్.చ్లిచ్క్.యహూ.చొం/ద్పౄ5ఆ/వూఈళాఆ/య్ళ్శాఆ/4ర్ల్భ్/ట్ం
--------------------------------------------------------------------->

టొ ఫొస్త్ అ మెస్సగె, సెంద్ ఇత్ తొ: రచ్చబందయహూగ్రౌప్స్.చొం

Hemantha Kumar

unread,
Nov 8, 2005, 12:36:22 AM11/8/05
to racch...@yahoogroups.com
#అయ్యా ఇవి ఇంటింటి రామాయణ గాధలు స్వామీ. "అసలే ఊళ్ళు తిరిగే ఉద్యోగంతో ఇంటిపట్టున ఉండేదే కొద్ది సేపు. ఆ కాస్త సమయంలోనూ పిచ్చ బొంద లాగా ఎప్పుడు ఆ రచ్చబండ మీదే కాలక్షేపం చేస్తే ఎట్లా?" అని మా కుటుంబాలలో కూడా వింటూనే ఉన్నా, ఈ బండ మీద నుమ్చి వచ్చే విషయాలతో, చిరు విసుర్లతో, చక్కటి కవితా పవనాలతో కలిగే మత్తులోంచి బయటకి రావటానికి మనసొప్పటం లెదు మరి.

మీ
హేమంత కుమార్ పామర్తి

Suresh Kolichala <suresh_k...@yahoo.com> wrote:

<snip>

Ayana puNyamA ani iMTlO EmUla chUsinA kanipiMchE, chivariki paDaggadilO gUDA pravESiMchina nighaMTuvulaMTE AviDaki mahA kOpaM.


<snip>

ii vishayamlO maa aaviDadi kooDaa mii aaviDa jaTTE. vEluuri gaaru aTlaanTa vaccinappaTinunDii inTlO bhaarya pillalalO aamaaTa, iimaaTa maaTlaaDakunDaa eppuDuu kampyUTar vaipu cuustuu eemaaTa, eemaaTa ani verri kEkalu vEstunnaanani maa aaviDa kamplainT!!

<snip>


---------------------------------
Yahoo! FareChase - Search multiple travel sites in one click.

[Non-text portions of this message have been removed]
Reply all
Reply to author
Forward
0 new messages