శ్రి మోహవ రావుగారి పద్యాల ప్రేరణ తో, అందరి అందమైన
పదాలతో పద్యాన్ని వ్రాయ ప్రయత్నమిది. వాడుకున్న
పదాల వివరాలు ఇవి.
శ్రీ మోహన రావు గారిచ్చిన పది అందమైన పదాలు:
అల, ఆమని, చందమామ, బంగారు, మొగలి,
మోహన, రాగము, లాలి, వెలుగు, సంధ్య
శ్రీ కామేశ్వర రావు గారిచ్చిన పది అందమైన పదాలు:
అమ్మ, అలక, ఏరువాక, చిలిపి, నెలవంక,
పల్లవి, పరికిణి, పాపాయి, వెన్నెల, సొగసు.
నా పది పదాలు :
అక్షరము, అమ్మ, కమ్మని, తేట, ప్రపంచము,
బంగారు, రస, లలిత, లాలి, సుధ
తప్పులున్నచో దయచేసి చెప్ప మనవి.
------------ అందమైన తెలుగు ---------------------
చం. తెలుపగ శక్యమా తెలుగు తీపిని దీప్తిని యక్షరంబులన్
అలలుగ లేచు అందమది ఆమని కోయిల రాగ మాధురై
పిలిచెడి పాప నవ్వులకు ప్రేమతొ పొంగెడు యమ్మ డెందమై
కలువలు దాల్చు వల్వలుగ కావ్యపు కన్నియ పట్టు పర్కిణై
తొలకరి యేరువాక గన తొత్తర పాటున చిందు జల్లులై
చిలిపిగ చందమామ గొన చిన్నగ దాగెడు సంధ్య కాంతులై
అలకను గొన్న ప్రేయసికి హాయి నిడన్ నెలవంక వెన్నలై
మొలకపు నవ్వులా మొగలి మోహన మోమున సోయగమ్ములై
సులలిత భక్తి భావ రస శోభల పోతన పద్య మాలలై
కలియుగ వేంకటేశునికి కమ్మని జోలను పాడు లాలియై
శిలలను పుల్కరించు స్వర సిద్ధిగ త్యాగయ పాట పల్లవై
వెలుగిడి బాట చూపగను వేమన నోటను తేట మాటలై
తే.గీ. పలికి నంతలోనె మనసు పరవశించు
పంచు సుధల నిధులను ప్రపంచమందు
శక్తి సొగసులన్నియు సేవ సల్ప నిడుచు
నిలచు బంగారు తల్లిగ నిజము నిలను
విధేయుడు
-Srinivas Nagulapalli
_________________________________________________________________
Add photos to your e-mail with MSN 8. Get 2 months FREE*.
http://join.msn.com/?page=features/featuredemail
Courtesy: http://www.kanneganti.com/
>తెలుగులో అందమైన పది పదాలు ఏవో?
>నా పట్టిక క్రింద ఇస్తున్నాను. మీరు కూడ
>ఇవ్వగలరా?
>
>అల
>ఆమని
>చందమామ
>బంగారు
>మొగలి
>మోహన
>రాగము
>లాలి
>వెలుగు
>సంధ్య
పది మాత్రమే చెప్పమంటే, పది తారలనే ("సినీ"తారలనే కాదు,
అంతరిక్షాన్ని అలరించే కంతి తారలు) గుర్తించమన్నంత, లేక
సముద్రంనుంచి పది ముత్యాలనే ఏరుకోమన్నంత కష్టము. ఎన్ని చెప్పినా,
ఇంకేన్నో చెప్పలేదనే అసంతృప్తి మాత్రము తప్పదు!
అయినా, నాకు నచ్చినవి, తోచినవి ఇవి. అయితే కొన్ని మీరిచ్చిన
పట్టికలోకూడా ఉన్నవే.
అమ్మ,
కమ్మని,
లలిత,
లాలి,
బంగారు,
సుధ,
రస,
ప్రపంచము,
అక్షరము,
తేట
వీటిలో, "ప్రపంచము", "అక్షరము" పదాల ఉత్పత్తి, తలచినప్పుడల్లా
నన్ను ఆశ్చర్యపరుస్తుంది. "ప్రపంచము", "పంచ" భూతాత్మకము అనే
లోతైన తత్త్వాన్ని చిన్న పదంలో నిక్షిప్తపరచడం భాష
ఘాంభీర్యానికి, తాత్వికతకు చిన్న ఉదాహరణ మాత్రమే.
"క్షతి" లేనిది, "అక్షరము" అని చెప్పడము కూడా చాలా ఆస్చర్యపరుస్తుంది
నన్ను. భాష సైతం అంతమొందినా, "అక్షరాల" కు క్షతి లేదు- క్షతి
లేని శబ్దస్వరూపాలు అని ఆ పదం ఎంతో అర్థవంతంగానూ, అద్భుతంగానూ
తెలుపుతుంది. నిత్యమైన సత్యస్వరూపాన్ని కూడా "అక్షర" మనే
అంటారు. ఇక పిల్లలకు "అక్షరాభ్యాసము" అనే పేరుతో
చదువు మొదలుపెట్టడము కూడా ఎంతో సముచితంగా, లోతైన ఆశయాన్ని
ఆ పేరులోనే ధ్వనింపజేయడం భాషనూ, సంస్కృతినీ ఒక్క పదంలోనే
అద్దం పట్టినట్లనిపిస్తుంది.
విధేయుడు
-Srinivas Nagulapalli
_________________________________________________________________
The new MSN 8: advanced junk mail protection and 2 months FREE*
http://join.msn.com/?page=features/junkmail
Courtesy: http://www.kanneganti.com/
incidentally those are the only four that do not provoke antonyms
(from me).
-viplav-
"I was born innocent, language vilified me"
--- In racch...@yahoogroups.com, "J. K. Mohana Rao" <rao@n...> >
> meeru kooDa ivvagalaraa?
>
Courtesy: http://www.kanneganti.com/
నేను ఇచ్చిన పది అందమైన పదాలను దత్తపదిగా
తీసికొని వ్రాసిన ఉత్పలమాల క్రింద ఇవ్వబడినది.
అందమైన పదాలు-
అల, ఆమని, చందమామ, బంగారు, మొగలి,
మోహన, రాగము, లాలి, వెలుగు, సంధ్య
ఉత్పలమాల-
తూరుపు దిక్కులో తెరలి
తోచెను పున్నమి చందమామ బం-
గారపు వన్నెలన్ వెలుగు
కాల్వల నామని సంధ్య కెంపులో
బూరిత మయ్యె నెల్లెడల
మోహన రాగపు రమ్యమౌ యలల్
తారస మయ్యె నా మొగలి
తావియు నూగెను మనస్సు లాలియై
శ్రీనివాస్ గారి అందమైన పదాలు-
అక్షరము, అమ్మ, కమ్మని, తేట, ప్రపంచము,
బంగారు, రస, లలిత, లాలి, సుధ
తేటగీతి-
అమ్మ - యీ ప్రపంచమునందు కమ్మని సుధ
యమ్మ - లలితాక్షర ద్వయ మక్షరమ్ము
తేట తెలుగులో రసమూరు మాట - యమ్మ
పాడి లాలించు బంగారు పాప నమ్మ
కామేశ్వర రావు గారి అందమైన పదాలు-
అమ్మ, అలక, ఏరువాక, చిలిపి, నెలవంక,
పల్లవి, పరికిణి, పాపాయి, వెన్నెల, సొగసు.
ఈ పదాలతో పద్యము వ్రాయుట చాల కష్టము.
ప్రతి పదము అందముగా నున్నా, ఈ అందమైన
పదాలకు పొత్తు కుదుర్చుట కష్టమే. అయినా
వృథా ప్రయత్నము చేసినాను. దాని ఫలితము-
తేటగీతి-
చిలిపి పాపాయి పరికిణిన్ చేయ తడిగ
గలుగు నలక యమ్మకు తీఱు ఘడియ పిదప
సొగసు వెన్నెల నెలవంక చూపు పిదప
పల్లవించు సస్యము లేరువాక పిదప
విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
Courtesy: http://www.kanneganti.com/
dawn, hush, lullaby, murmuring, tranquil,
mist, luminous, chimes, golden, and, melody.
తెలుగులో అందమైన పది పదాలు ఏవో?
నా పట్టిక క్రింద ఇస్తున్నాను. మీరు కూడ
ఇవ్వగలరా?
అల
ఆమని
చందమామ
బంగారు
మొగలి
మోహన
రాగము
లాలి
వెలుగు
సంధ్య
సుందర పదపుష్పాన్వేషకుడు