ఆంధ్రజ్యోతి దినపత్రికలో కొన్ని సంవత్సరాలక్రితం "సిటీ లైఫ్" పేరుతో
ఒక ఫీచర్ వచ్చేది. ఒక కార్టూను, దానితో బాటు ఒక మినీ కవిత.
అప్పటిరోజుల్లో హైదరాబాదులో ఉన్న వాళ్ళకి బహుశా గుర్తుండవచ్చు.
అదే రోజుల్లో హైదరాబాదులో ఎక్కడైనా సాహిత్య సభలుకానీ, పౌర హక్కుల
సభలుకానీ, జరిగినప్పుడల్లా, ఆ సభల్లో సన్నగా రివటలా ఉన్న ఒక
వ్యక్తి ఫోటోలు తీస్తుండే వాడు. ఆ సభలకి హాజరైన వాళ్ళకి బహుశా ఆ
వ్యక్తి గుర్తుండవచ్చు.
చిక్కడపల్లిలో చింతలతోపు వైపు తిరిగే మలుపు దగ్గర "చిత్రాలయ
స్టూడియో" అని ఒక ఫోటో స్టూడియో ఉండేది. పాస్ పోర్టు కోసమో, పెళ్ళి చూపుల
కోసమో, అక్కడ ఫోటోలు తీయించుకున్న వాళ్ళకి బహుశా ఆ కొట్టు
గుర్తుండవచ్చు.
ఇంతకీ ఆ స్టూడియో యజమానీ, ఆ ఫోటోలు తీసే వ్యక్తీ, "సిటీ లైఫ్" లో
కవితలూ కార్టునులూ రాసిన గీసిన వ్యక్తీ ఒకడే. అతని పేరు అలిశెట్టి
ప్రభాకర్. "రక్తరేఖ" పేరుతో ఇతని మినీ కవితల సంకలనం
అచ్చయింది. అట్టమీద కన్నీరెడుతున్న ఒక ఆడపిల్ల బొమ్మా, లోపల
illustrations కూడా అతనే వేసాడు. కలంతోటీ కెమేరాతొటీ మాత్రమే కాదు,
కుంచెతో కూడా మాటలాడ గలిగిన అద్భుత కళాకారుడు ఇతను.
చిక్కడపల్లి నించి బర్కత్పురా వెళ్ళే ఒక రోడ్డు ఉండేది. దాని పేరు
గుర్తులేదు కానీ, అక్కడ ఎక్కువగా వెదురుబుట్టలూ, కర్ర బొంగులతో
తయారుచేసే రకరకాల సామాన్లూ అమ్ముతుండే వారు. ఆ రోడ్డు మీదుగా వెళ్ళి
ఒక ఇరుకు సందులో తిరిగితే అక్కడ ఒక ఇంట్ళో మేడ మీద ఒక రెండు
గదుల వాటా ఉండేది. అందులో భార్యా పిల్లలతో నివసించే వాడు ప్రభాకర్.
గొప్ప కవే అయినా, ప్రతి రోజూ పొద్దున్నే దినపత్రికలో మనకందరికీ
మేలుకొలుపు పలికే కంఠమే అయినా, ఇతని ఇంట్లో ఎప్పుడూ ఏ వస్తువూ ఉండేది
కాదు. ప్రతి నెలా అద్దె కట్టాలన్నా, పిల్లలకి స్కూలు ఈజులు కట్టాలన్నా,
కటకటే. ఎప్పుడూ దగ్గుతూ, మూలుగుతూ ఉండే ఇతనికి మరి అంత ఓపిక ఎలా
వచ్చేదో, ఎక్కడ ఎటువంటి సభ జరిగినా హాజరయ్యే వాడు. నిజాం
కాలేజీలోనూ, ప్రెస్ క్లబ్బు ముందూ, తన పుస్తకాలనీ, బొమ్మలనీ
ప్రదర్శించి వచ్చే పోయే కుర్ర వాళ్ళకి వాటి గురించి చెబుతుండే వాడు.
పుస్తకం వెల ఎంతైతేనేం, వాళ్ళేమైనా ఇస్తే తీసుకునే వాడు. లేకపోతే
ఊరికే ఇచ్చేసేవాడు. డాక్టరు రాజగోపాలన్ దగ్గర చికిత్సకి వెళుతుండే
వాడు. తిండి దగ్గర అశ్రద్ధ చెయ్యొద్దని ఆయన చివాట్లెట్టే వాడు. పాపం
ఆయనకేం తెలుసు, ప్రభాకర్ budget లో తిండికీ, కుంచెలకీ మధ్య ఏదో
ఒకటే సాధ్యమని?
పేదరికమనే క్షయవ్యాధికి గురయి, ఇతను 1992లో మరణిమ్చాడు. అప్పుడా
చిక్కడపల్లీ ఇరుకు సందుకి సగం హైదరాబాదు నగరం తరలి వచ్చి
శ్రద్ధాంజలి సమర్పించింది.
కవి ఆశా రాజు ఆ సందర్భాంలో రాసిన కవితని కన్నెగంటి చంద్రశేఖర్
ఒకసారి తెలుసాలో pOst చేసారు. అదే కవితని మరో సారి ఇక్కడ నేను
post చేస్తున్నాను -
కవి మరణించాకే
------------------
నేల మీదా గోడలమీదా
షామియానా నీడ నిశ్శబ్దమ్గా కదులుతుంది
ఎండ పెనమ్మీదా గుండె కణమ్మీదా
చెమట బొట్లు నిశ్శబ్దమ్గా ఇంకిపోతాయి
మనుషుల్ని తాకీ తాకనట్లు
గాలి నిశ్శబ్దమ్గా వొణుకుతూ వీస్తుంది
మెట్లెక్కి రావడం
బూట్లు విప్పడం
కన్నీళ్ళకు కంటద్దాలు అడ్డుపెట్టుకోవడం
ఒకర్నొకరు ముఖాల్లేని మనుషుల్లా చూసుకోవడం
కరచాలనాల్లో గుండె బరువు దించుకోవడం
అంతా మూగవాళ్ళ గుంపులా
అందరూ సైగలు చేసుకుంటున్నట్టుగా
నిశ్శబ్దం నిశ్శబ్దం
శబ్దం చేయడమంటేనే
నిశ్శబ్దంగా ఉండటమన్నంత నిశ్శబ్దమ్గా నిశ్శబ్దం
అలసిపోయినట్టూ చుట్టూ ఉన్న పద్యాలూ నిశ్శబ్దం
కుంచెను పోగొట్టుకున్న రంగుల చిత్రాలూ నిశ్శబ్దం
కెమెరా పడిపోయీ ముక్కలయ్యీ రీలు తెగిపోయింది
బొమ్మ ప్రింటు కావల్సిన చోటా రక్తం ముద్ద ప్రింటయ్యింది
బెంచీ మీద దినపత్రికలూ
కుర్చీ మీద రక్తరేఖలూ
నల్లింకుతో మార్కు చేసి పెట్టిన సిటీ లైఫూ
శూన్యంలో తెల్ల గీతలు గీసినట్టూ
మౌనంగా తీగలు సాగుతున్న
అగరొత్తుల పొగ పరిమళం నిశ్శబ్దం
ఇంద్రధనుస్సు రాలిపోయినట్టున్న పూలదండ నిశ్శబ్దం
ఏడుపు నిశ్శబ్దం
పలకరింపులూ నిశ్శబ్దం
పరామర్శలూ నిశ్శబ్దం
నిశ్శబ్దమ్లో ఆకలని ఏడుస్తున్న
పసివాళ్ళ అమాయకత్వమూ నిశ్శబ్దం
ఎవర్ని చూసినా
ఖాళీ ఖాళీగానే కనపడతారు
గుండె ఆడుతుంది కానీ
గొంతు తీగె తెగిపోతుంది
ఎవరో పిలుస్తున్నట్టూ
ఎవరూ కనిపించనట్టూ
ఎవరి కోసం వారే వెతుక్కుంటూ
ఎవరి చుట్టూ వారే తిరుక్కోవటం
ఎండలో తడిసిపోయిన జనం
అలలు లేని సముద్రంలా నిశ్శబ్దం
అంతమంది చేరిన గుంపులో
ఎవ్వరూ మాట్లాడ్డం లేదు
అంతటి గంభీర నిశ్శబ్దమ్లో
అందరితో, శవమొక్కటే బతుకుని గురించి మాట్లాడుతుంది
తల దగ్గర వెలుగుతున్న దీపమొక్కటే మాట్లాడుతుంది
బహుశా, మరణించిం తర్వాతే
కవి బతకడం మొదలుపెడతాడనుకుంటాను
(కవి అలిశెట్టి ప్రభాకర్ చనిపోయినప్పటి దృశ్యానికి
అనువాదం)
జ్`నాపకాల కన్నీళ్ళతో,
ఉదయ్
From andhraputhra@y... Sat Dec 04 10:15:50 2004
Return-Path: <andhraputhra@y...>
Received: (qmail 10778 invoked from network); 4 Dec 2004 18:15:49 -0000
Received: from unknown (66.218.66.216)
by m17.grp.scd.yahoo.com with QMQP; 4 Dec 2004 18:15:49 -0000
Received: from unknown (HELO n22a.bulk.scd.yahoo.com) (66.94.237.51)
by mta1.grp.scd.yahoo.com with SMTP; 4 Dec 2004 18:15:49 -0000
Received: from [66.218.69.6] by n22.bulk.scd.yahoo.com with NNFMP; 04 Dec 2004 18:15:31 -0000
Received: from [66.218.66.113] by mailer6.bulk.scd.yahoo.com with NNFMP; 04 Dec 2004 18:15:31 -0000
X-Sender: andhraputhra@y...
X-Apparently-To: racch...@yahoogroups.com
Received: (qmail 6762 invoked from network); 4 Dec 2004 17:29:38 -0000
Received: from unknown (66.218.66.217)
by m25.grp.scd.yahoo.com with QMQP; 4 Dec 2004 17:29:38 -0000
Received: from unknown (HELO web60704.mail.yahoo.com) (216.109.117.227)
by mta2.grp.scd.yahoo.com with SMTP; 4 Dec 2004 17:29:37 -0000
Received: (qmail 1648 invoked by uid 60001); 4 Dec 2004 17:29:24 -0000
Comment: DomainKeys? See http://antispam.yahoo.com/domainkeys
DomainKey-Signature: a=rsa-sha1; q=dns; c=nofws;
s=s1024; d=yahoo.com;
b=kkQLgwdb3u0PhGMmixa6gRt1SYB+P+VD4PUj7KeJKuUllvk4lDyipT5+JHjVx7cfAhQOvZg17jfgHl6fWVUBjFlpMm++n4UHSqy/oWua9gnpLGg74q1kO5uXF/4dBgr61XhxKyP7zYIlfk9vGi7lTH1Gn7ag/Zy43NHSmPxv04s= ;
Message-ID: <20041204172924.1646.qmail@w...>
Received: from [219.65.102.37] by web60704.mail.yahoo.com via HTTP; Sat, 04 Dec 2004 09:29:24 PST
Date: Sat, 4 Dec 2004 09:29:24 -0800 (PST)
To: racch...@yahoogroups.com
In-Reply-To: <20041204143714.91218.qmail@w...>
MIME-Version: 1.0
X-eGroups-Remote-IP: 216.109.117.227
From: Hemantha Kumar <andhraputhra@y...>
Subject: Re: dEni ruci dAnidE [racchabanda] Tirukkural in Telugu? (was earlier arava paaTaLLO "aravaM" anE padam)
X-Yahoo-Group-Post: member; u=174005873
Content-Type: text/plain
Content-Transfer-Encoding: quoted-printable
X-eGroups-Edited-By: sreeniparuchuri <sreeni@g...>
X-Yahoo-Newman-Property: groups-system
X-eGroups-Approved-By: sreeniparuchuri <sreeni@g...> via web; 04 Dec 2004 18:15:14 -0000
X-eGroups-Remote-IP: 66.94.237.51
X-RB-Message-Num: 11241
వీటిలోవి దానిలో, దాంట్లోవి వీటిలో ఉన్నా, దేని రుచి దానిదే. బూరెలూ, అరిసెలూ ఒ=
కేలా అనిపించినా దేని రుచి దానిదే కదా. అలాగే.
=
నమస్సులతో
మీ
హేమంత కుమార్ పామర్తి
Immature Mature <gmcsfdc@y...> wrote:
<snip>
I have a doubt. Does Tirukural say anything not mentioned in Sumathi and Ve=
mana Satakams? Whenever people (Tamil or people from Hindi belt) mention ab=
out Tirukural, I wonder whether they are aware of S and V satakams.
Courtesy: http://www.kanneganti.com/