[Fwd: [chandassu] ఆటవెలది / ద్విపద]

35 views
Skip to first unread message

J. K. Mohana Rao

unread,
Jul 31, 2001, 8:23:07 AM7/31/01
to racch...@yahoogroups.com

/\ ఇంతకు ముందు మీకు తేటగీతిలో ద్విపదను
గర్భితము చేయు తీరును గురించి చెప్పినాను.
ఈ రోజు ఆటవెలదిలో ద్విపదను గర్భితము చేయు
విధమును గురించి చెప్పబోతున్నాను.

ఆటవెలది: మొదటి పాదము: సూ/సూ/సూ/ఇం/ఇం; యతి: [1.1, 4.1]
ఆటవెలది: రెండవ పాదము: సూ/సూ/సూ/సూ/సూ; యతి: [1.1, 4.1]
ద్విపద: ఇం/ఇం/ఇం/సూ; యతి: [1.1, 3.1]; ప్రాస: అవసరము.

ఆటవెలది:
మనసు లోపలి పలు *మధుర రసమ్ములు
నదిగ పారె మేలు *నడక తోడ
మనసు లోపలి పలు *మధుర రవమ్ములు
నెఱయు రాగ మూరు *నిగమ మాయె
మనసు లోపలి పలు *మధుర పదమ్ములు
నటన మాయె సౌరు *ననయుచుండ
మనసు లోపల గల *మరకత మూర్తివి
ననిట ముద్దులం *బెనయగ రమ్ము

ద్విపద:
మనసు లోపలి పలు *మధుర రసమ్ము-
లు నదిగ పారె మే*లు నడక తోడ
మనసు లోపలి పలు *మధుర రవమ్ము-
లు నెఱయు రాగ మూ*రు నిగమ మాయె
మనసు లోపలి పలు *మధుర పదమ్ము-
లు నటన మాయె సౌ*రు ననయుచుండ
మనసు లోపల గల *మరకత మూర్తి-
వి ననిట ముద్దులం *బెనయగ రమ్ము

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

__________________________________________________________
View చందస్సు messages in తెలుగు at
http://www.tiac.net/users/bisa/presents/cgi-bin/chandassu.cgi/messages/

To unsubscribe from this group, send an email to:
chandassu-...@yahoogroups.com

Your use of Yahoo! Groups is subject to
http://docs.yahoo.com/info/terms/

Courtesy: http://www.kanneganti.com/

Reply all
Reply to author
Forward
0 new messages