చంపకమాల సంస్కృతములో వేరు నామములతో ప్రసిద్ధము.
అవి- పంచకావలి, ధృతశ్రీ, శశివదన, చంపకమాలిక,
శైలనిధి, సరసి, సిద్ధక. ఇన్ని పేర్లు గల వృత్తము ఇంకొకటి
ఉందేమో నాకు తెలియదు. గణములు (న-జ-భ-జ-జ-జ-ర)
ఒకటే ఐనా, యతులు వేరు. చంపకావళికి యతి (1, 8, 15).
కొన్ని చోటులలో (1, 12) అని కూడ తెల్పబడినది.
చంపకావళి మఱియు చంపకమాలల యతులు సరి పోవు విధముగా
మూడు సంవత్సరములకు ముందు ఒక ఫ్రెండ్కు పంపిన పద్యమును
కొన్ని మార్పులతో ఇక్కడ మీకు సమర్పిస్తున్నాను.
చంపకమాల- న-జ-భ-జ-జ-జ-ర (1, 11)
చంపకావళి- న-జ-భ-జ-జ-జ-ర (1, 8, 15)
కనులను నింపుమా కళల కమ్మని నీ కమనీయ రూపమున్
తనువును నింపుమా తరళ తారల సుందర కాంతి తోడ సు-
స్వనముల నింపుమా వలపు పాటల గొప్పగ కర్ణ మోదమై
మనసును నింపుమా మహిత మంజులమౌ మధురంపు టూహలన్
విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
Courtesy: http://www.kanneganti.com/
> చంపకావళికి యతి (1, 8, 15)
పంచకావళి
> చంపకావళి మఱియు చంపకమాలల యతులు సరి పోవు విధముగా
పంచకావళి
> చంపకమాల- న-జ-భ-జ-జ-జ-ర (1, 11)
> చంపకావళి- న-జ-భ-జ-జ-జ-ర (1, 8, 15)
పంచకావళి
క్షమించాలి! - మోహన
Courtesy: http://www.kanneganti.com/