[racchabanda] సినిమా పాటలలో ఛందస్సు

101 views
Skip to first unread message

J. K. Mohana Rao

unread,
Mar 16, 2007, 12:53:59 PM3/16/07
to racch...@yahoogroups.com
|||||||||||||||||||||||||||||||||
ఛందస్సు అంటే ఏవో పురాతన కవులు వ్రాసిన పుస్తకాలలో
ఉన్న పద్యాలకు నమూనాలు అని చాల మంది పొరబాటు బడుతారు.
ఛందస్సు అంటే భాష. అది మన సంస్కృతి. దంపుళ్ళ
పాటలలో ఛందస్సు ఉంది, సినిమా పాటలలో కూడ ఛందస్సు ఉంది.
గొప్ప కవులు తెలుగు సినిమా పాటల్ను వ్రాయుట మనము చేసుకొన్న
గొప్ప అదృష్టమే. కృష్ణ శాస్త్రి, ఆత్రేయ, శ్రీశ్రీ,
సముద్రాల, సిరివెన్నెల, ఇత్యాది కవులు సినిమా పాటలను
వ్రాసినారు తెలుగులో.

ఆధునిక కవిత్వములో అంత్యప్రాసకు అవకాశము
ఇచ్చినది సినీపాటలే. ఏ రగడలలో తప్ప ప్రాచీన
తెలుగు కవిత్వములో అంత్యప్రాస అరుదు. కాని సినిమా
పాటలో, అంత్య ప్రాస లేని సినిమా పాటలు తక్కువే.

మాత్రాఛందస్సులోని సౌందర్యాన్ని జగత్తుకు చక్కగా
బహిర్గతము చేసినది కూడ సినిమా పాటలే. ఉదాహరణకు
ఒక సినిమా పాట, ఇది రాజమకుటము చిత్రములో లీల గారు
పాడినది, రచయిత దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు,
సంగీతము వేణు మాష్టారు.

సడి సేయకో గాలి సడి సేయబోకే
సడి సేయకో గాలి సడి సేయబోకే
బడలి ఒడిలో రాజు పవ్వళించేనే
సడి సేయకే

రత్న పీఠిక లేని రారాజు నా స్వామి
మణి కిరీటము లేని మహరాజు గాకేమి
చిలిపి పరుగుల మాని కొలిచి పోరాదే
సడి సేయకే

ఏటి గలగలలకే ఎగసి లేచేనే
ఆకు కదలికలకే అదరి చూసేనే
నిదుర చెదరిందంటె నేనూరుకోనే
సడి సేయకే

పండు వెన్నెల నడిగి పాన్పు తేరాదే
పీడ మబ్బుల దాగు నిదుర తేరాదే
విరుల వీవన పూని విసిరి పోరాదే
సడి సేయకో గాలి
సడి సేయబోకే
బడలి ఒడిలో రాజు పవ్వళించేనే
సడి సేయకే

ఇది పంచమాత్రలతో శోభిల్లే ఒక రసవత్తరమైన గీతము.

సడి సేయ కో గాలి సడి సేయ బోకే
బడలి ఒడి లో రాజు పవ్వళిం చేనే

రత్న పీ ఠిక లేని రారాజు నా స్వామి
మణి కిరీ టము లేని మహరాజు గాకేమి
చిలిపి పరు గుల మాని కొలిచి పో రాదే

ఏటి గల గలలకే ఎగసి లే చేనే
ఆకు కద లికలకే అదరి చూ సేనే
నిదుర చెద రిందంటె నేనూరు కోనే

పండు వె న్నెల నడిగి పాన్పు తే రాదే
పీడ మ బ్బుల దాగు నిదుర తే రాదే
విరుల వీ వన పూని విసిరి పో రాదే

మూడు పంచమాత్రలు, చివర ఒక చతుర్మాత్ర. ఆ చతుర్మాత్ర
పాడేటప్పుడు ఒక మౌనమాత్రతో పంచమాత్ర అవుతుంది. ఈ అమరికతో
గల వృత్తములు కోకొల్లలు. ఇట్టి అమరికగల జాతి పద్యమును
నేణు లైతగతి అని ఒకప్పుడు పరిచయము చేసియున్నాను.

ఇదే గతిలో లీలాశుకుని కృష్ణకర్ణామృతమునుండి ఒక పద్యము-

కరకమల-దల-కలిత లలితతరవంశీ
కలనినద-గలదమృత-ఘనసరసి-దేవే
సహబ-రసభర-భరితదరహసిత-విథీ
సతత-వహదధరమణి మధురిమణిలీయే

ఇందులో అన్ని పంచమాత్రలు లఘుభరితము, చివరి
చతుర్మాత్ర రెందు గురువులు.

కావున కాదేదీ కవిత కనర్హం! ఒప్పుకొంటారా?

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు



____________________________________________________________________________________
No need to miss a message. Get email on-the-go
with Yahoo! Mail for Mobile. Get started.
http://mobile.yahoo.com/mail


------------------------ Yahoo! Groups Sponsor --------------------~-->
Something is new at Yahoo! Groups. Check out the enhanced email design.
http://us.click.yahoo.com/kOt0.A/gOaOAA/yQLSAA/620olB/TM
--------------------------------------------------------------------~->

To Post a message, send it to: racch...@yahoogroups.com

Courtesy: http://www.kanneganti.com/

lylayer

unread,
Mar 17, 2007, 10:00:36 PM3/17/07
to racch...@yahoogroups.com
--- In racch...@yahoogroups.com, "J. K. Mohana Rao" <jkmrao@...>
wrote:

> mAtrAChaMdassulOni sauMdaryAnni jagattuku cakkagA
> bahirgatamu chEsinadi kUDa sinimA pATalE. udAharaNaku
> oka sinimA pATa,

> saDi sEyakO gAli saDi sEyabOkE
> saDi sEyakO gAli saDi sEyabOkE


Beautiful song. I always loved this song. I sing it often.


> ఎస్ జానకిగారు, లతగారు హిందోళరాగములో పాడిన వీనుల > విందైన
ఒక పాట జ్ఞప్తికి వస్తుంది...
>
> http://www.musicindiaonline.com/music/kannada/s/movie_name.2751/
> http://www.udbhava.com/udbhava/songs.jsp?id=704
>


Loved this song. Except don't know kannaDa, so could not appreciate
the meaning. You must be packing and getting ready for the travel to
India. So ofcourse, would not trouble you to tell us the meaning of
this song.:-)

Thank you immensely for taking the time to introduce us to many
beautiful subjects in Telugu language and literature, on rb. Thank
you for being such a wonderful friend.

దొరుకునా ఇటువంటి ప్రేమ! నమస్కారములు మోహనరావు గారు!

Have a wonderful time in India with your family and a safe return
back to USA.:-)


Regards
lyla.

------------------------ Yahoo! Groups Sponsor --------------------~-->

Yahoo! Groups gets a make over. See the new email design.
http://us.click.yahoo.com/hOt0.A/lOaOAA/yQLSAA/620olB/TM

Reply all
Reply to author
Forward
0 new messages