s#
కవిత్వం అవసరం లేని అదృష్టవమ్తులు ఇక్కడే ఆగిపోవడం మమ్చిది. :-)
> lylayer [
lyl...@aol.com] Thursday, September 22, 2005 8:45 AM
> write an essay on her and introduce more of her poetry to us
> as suresh garu is saying
సామర్థ్యం లేకపోయినా, చెయ్యాలనే ఆసక్తి ఉమ్ది. పుస్తకం కోసం ప్రయత్నిమ్చాను
గాని దొరకలేదు. చమ్డీదాస్ పుస్తకాలు పునర్ముద్రిస్తున్నారు గాన "శిలాలోలిత"
కూడా తిరిగి వెలుగుచూస్తుమ్దని ఆశ. అలాగే చమ్డీదాస్ ఆత్మకథ కూడా
ప్రచురిస్తే మరికొన్ని జీవిత విషయాలు తెలుస్తాయి. నాకు వ్యక్తిగతమ్గా వాళ్ళూ
తెలియదు, సాహిత్యలోకమ్లో ఒకరిద్దరు తప్ప మరెవరూ తెలియదు. తెలిసీ తెలియని
మాటలాడి, బ్రతికున్న దగ్గర వాళ్ళని బాధపెట్టడం భావ్యం గాదు. అమ్దాకా,
నేను చదివిన మరో "నాలుగు" మాటలు చెప్పే ప్రయత్నమిది.
> The poetry is remarkably sweet, agony is real and palpable.
దీనితో చాలావరకు ఒప్పుకుమ్టాను.
> I see a pretty kitten
> who got stuck in a room, and can't get out on its own,
> getting restless, meawing, and pleading with eyes asking to be let out
దీనితో ఒప్పుకోను. సున్నితమైన మనస్తత్వమూ, నమ్మిన విలువలని రాజీపడి
వదులుకోని వజ్రసమ్కల్పమూ, బేలతనమనుకోను.
> Trying to find words that may convey my impression ...
"శబ్దాల అసమర్థత ప్రతి కవికీ ఏదో ఒక సమ్దర్భమ్లో తట్టే ఉమ్టుమ్ది.
కవితాకామిని చేలామ్చలాల కొస విసురులు ఎప్పుడూ ఒక బారెడు దూరానే
మాయమైనట్లు అగుపిస్తాయి." :-)
రేవతీదేవి కవిత్వం తలుచుకుమ్టే నాకు వెమ్టనే గుర్తొచ్చేది మరో మరుగునపడ్డ
అరుదైన మమ్చి మాణిక్యం, "జీవిత నాటకరమ్గపు / గడచిన బహు దృశ్యాల్లో /
రమ్గుల తళుకుల బెళుకుల / కపట పటాటోపమ్లో / మరుగుపడిన" మరో వెలుగు,
బైరాగి అనబడే ఆలూరి బైరాగి చౌదరి -- ఎబిసి:-).
బైరాగి 1978లో అసౌకర్యపు జీవితానికీ, అనారోగ్యపు టలవాట్లకీ అర్థామ్తరమ్గా
బలైపోయాడు. స్వయమ్కృషితో హిమ్దీ, తెలుగు లో ప్రావీణ్యం సంపాదిమ్చి
చెప్పుకోదగ్గ కవిత్వం చాలానే రాశాడు. 1984లో బైరాగి "ఆగమగీతి" కి సాహిత్య
అకాడెమి బహుమతి వచ్చిమ్ది.
రేవతీదేవి తన కవితలన్నీ రాసిమ్ది ఒకే సమ్వత్సరం, 1979లో. ఫిలాసఫీ లో
డాక్టరేట్ చదువు ముగిమ్చకుమ్డానే ముప్ఫయి ఏళ్ళకే తనువు చాలిమ్చిమ్ది 1981లో.
రాసిమ్ది కొమ్చెమే. "నేనా? కవిత్వమా?" అని తనకు తనే ఆశ్చర్యపడేటట్లు
రాసిమ్ది, ఎలామ్టి పామ్డిత్యం లేకుమ్డా, మామూలు మాటల పొమ్దికతో. తాత్వికత్వమ్తో
సమ్మేళవిమ్చిన సమ్వేదనాభరిత కావ్యాలు బైరాగి కవితలు. కావ్యాలు
కాకపోయినా రేవతీదేవి కవిత్వం ఆ కోవకి చెమ్దినదే.
రేవతీదేవి "దూరం"
(
http://groups.yahoo.com/group/racchabanda/message/14097 )
గీతం అమ్తా స్వయమ్వేదన అనుకోను. అమ్తమాత్రమే అయితే మన హృదయాలను తాకదు.
చుట్టూవున్న సమాజమ్లో అడుగంటిపోయిన ప్రేమానురాగాల గురిమ్చి సునిశితమైన
విమర్శగా కనిపిస్తుమ్ది, బైరాగి గీతాన్ని గుర్తుతెప్పిస్తుమ్ది:
"నాకుతెలుసు, నాకు తెలుసు
ప్రళయవేదనా పమ్కిల ప్రపమ్చపథం మధ్య
ప్రేమలు పొసగవనీ
ఈ బమ్డరాళ్ళపైన ఏ మొక్కలూ ఎదగవనీ
మనమమ్తా చీకటిలో ఆకటితో పోరాడే
అస్వతమ్త్ర సైనికులమనీ,
పెనుతుపాను చేతుల్లో చిక్కుకొన్న
త్రోవలేని నావికులమనీ
జీవిత ప్రభమ్జనం
కలయిక సహిమ్చదనీ
ఉన్న గడువు కొద్ది అనీ
నాకు తెలుసు! నాకు తెలుసు!"
-- చీకటి నీడలు, బైరాగి
రేవతీదేవి "నిర్విరామం" లోని (
http://groups.yahoo.com/group/racchabanda/message/14105 ) క్రమమ్లో
వ్యక్తిగత వేదనకన్నా నాకు కనిపిమ్చేది బైరాగి కవితల్లో ఉన్న తాత్వికత.
"శతసహస్రశబ్దాల స్రఖరశరపరంపరముమ్దు
నిశ్చలమై నిలచిన నిశ్శబ్దమ్లో
నానారావ తరమ్గతురమ్గాల ఉరవడి క్రిమ్ద
నిలవనీరుల నికరపు నిశ్శబ్దమ్లో
ఆడే చేతులక్రిమ్ద, వాగే జిహ్వలక్రిమ్ద
సొమ్మసిలిన హృదయమమ్దు
ఆటముమ్దు పాటముమ్దు
ప్రణయం ముమ్దు ప్రళయం ముమ్దు
ప్రగల్భ నిరీక్షణతో నిమ్డిన, పమ్డిన ఈ నిశ్శబ్దమ్లో
వేచియున్నవాడే ప్రతి ఒక్కడు
మార్పు కొరకు, తీర్పుకొరకు
ఓర్పుగలిగి
చరమ ఘమ్టారావం కొరకు
తప్పిపోయిన భావం కొరకు."
-- నూతిలో గొమ్తుకలు, బైరాగి
ఇక "రాత్రి" గీతం
(
http://groups.yahoo.com/group/racchabanda/message/13973 )
కవయిత్రి మరణానికి దగ్గరగా ఉమ్డటాన, స్వీయానుభవమేననిపిమ్చినా,
బైరాగి మాటలు గుర్తు తెచ్చుకోవాలి:
"
నూతిలో గొమ్తుకలు సమ్శయ కావ్యం. దీనిలో మానవుడు 'ఏది త్రోవ?' అనే
అడుగుతున్నాడు. 'నాన్యః పథా విద్యతే యనాయ ' అని చెప్పగలిగే స్థితిలో
లేడు. చీకటిలో ప్రారంభమైన ఈ కావ్యం 'ఆవేదనల అనమ్తమ్లో అమ్తమైన
జీవితాలను ' చర్చిస్తున్నది. దీనిలోని నాయకులు 'Hamlet, అర్జునుడు,
Raskalnikovధ్్మ్దిగ్ధావస్థలో ఒక క్రమబద్ధమైన పరిణామాన్ని
సూచిస్తున్నారు. Hamlet వేదన కర్మపూర్వం. అర్జునుడి వేదన కర్మక్షేత్రమ్లో
తక్షణికం. Raskalnikov బాధ కర్మ తరువాత. కాని ముగ్గురి బాధ ఒకే
స్థాయిని అమ్దుకొమ్టుమ్ది. అది మానవుని సహజ వేదన. అతణ్ణి త్రికాలాల్లోనూ
వెమ్టాడుతుమ్ది. ఆ బాధలో మధనపడనివాడు పూర్ణత్వాన్ని అమ్దుకోలేడు.
ఆబాధనుమ్చి అతను తప్పుకునే మార్గమ్లేదా -- అమ్టే ఉమ్ది. పలాయనం,
కృతకశక్తుల పూజనం, ఆత్మహననం.
ఈ కావ్యమ్లో నేను అమ్టే కవి కాదు. నేటి మానవుని అనుభూతిలో అది కవితాదాత్మ్యం.
స్వీయబాధ వెలువరిమ్చటం కవి పరమావధి కాదు. ప్రపమ్చమ్తో ఏకమైననాడే
కవికమ్ట్హం సరిగా పలుకగలుగుతుమ్దని నా నమ్మకం. ప్రపమ్చానుభూతిలో
స్వీయానుభూతి పరమైనపుడే ఉత్తమ కవిత ఉద్భవిస్తుమ్దని నా విశ్వాసం.
ఆవేదనల అనమ్తమ్లో అమ్తమైన జీవితాలు
విమోచనపు యోచనలేని శోచనీయ శర్వరిలోన
ఆలోచనల లోచనాలు మూతబడిన ముహూర్తాన
ప్రాతస్సూర్య స్వర్ణశమ్ఖం, రాకాపతి రజతశమ్ఖం
రెమ్డూ మూగబోయినవేళ
తిరుగుపోకకు త్రోవలేని చివికిన చీకటుల మూల
సకల రేఖా సమ్గమ కేమ్ద్ర బిమ్దువు క్రిమ్ద
ఆక్రమ్దన స్యమ్దనాల మమ్దాగమరవం ముమ్దు
నిలబడి ఒక్క టడుగుతాను బాబూ! చెప్పు
ఎక్కడ బయలుదేరాం మనం?
కడ కెక్కడ చేరాం మనం?
"
"జీవితాన్ని విమర్శిమ్చడం, అలమ్కరిమ్చడం, సాహిత్యం చెయ్యగల
ఉత్తమకార్యాలు. ఇదే సాహిత్యం యొక్క ఉత్కృష్ట ప్రయోజనం," అని కొకు అమ్టే అది
చాలా సమ్కుచితమ్గా ఉమ్దని అసమ్తృప్తి వ్యక్తం చేసి విశాలమైన జీవితాన్ని,
సాహిత్యాన్ని, అనమ్త విశ్వమ్లా విస్తరిమ్చబోయారు సత్య గారు. కొకు అన్నదసలు
చాలా చప్పగా ఉమ్దని పెదవి విరిచారు SN శ్రీనివాస్ గారు.
చప్పగా ఉమ్దమ్టే ఆశ్చర్యమేముమ్ది? కవీమ్ద్రులు ప్రశమ్సిమ్చే
ప్రసన్నకథాకవితార్థయుక్తి, సామాన్యులకి వీనుల విమ్దు చేసే అక్షరరమ్యత
కలిగిన, నానారుచిరార్థసూక్తినిథి అయిన ఆదికవి నన్నయభట్టారకుడు
లోకశ్రేయస్సుకై రచిమ్చిన మహాభారతము లోని రత్హాలి పద్యమెక్కడ? కట్టె
కొట్టె తెచ్చె రీతిలో మామూలు మనుషుల, మామూలు జీవితాలపై నిర్వికారమ్గా
కథలు రాసి తెలుగుదేశానికి పరిమితమైన ఓ తరగతి పాఠకుల్లో కేవలం
భావ సమ్స్కారానికే కారకుడైన కుటుంబరావు వ్యాసమెక్కడ?
అసలు అలమ్కరిమ్చడం అమ్టే ఏమిటి, వైద్యులు, జీవశాస్త్రజ్ఞులు జీవితాన్ని
అలమ్కరిమ్చడమ్లేదా, మరి వారిదీ సాహిత్యమేనా? అని ప్రశ్నిమ్చారు.
ప్రాణభిక్ష, జీవిత అలమ్కరణ ఒకటి కాదనుకుమ్టాను. ఇలా నాంచి చంపక,
నిర్వచిమ్చరాదా అమ్టే, సాహసిస్తే, నా నిర్వాకమ్తో అది ఇమ్కా చప్పగానో లేక
మరెమ్తో ఉప్పగానో ఉమ్టుమ్ది. కాని ఉదాహరణకి, ఇదిగో ఈ కవిత జీవితం మొదలయీ
కాకమునుపే జీవితాన్ని అలమ్కరిస్తున్నది:
A Birth
with the fragrance of twenty-five bodies burning with desire
with the beauty of five snow-clad mountain ranges
with the moving music of infinite pairs of stellar bodies
with the love of a thousand brilliant dark eyes
with the cool rays of a billion moons
with two valleys red with passion
with a hundred joys of the soft, green grass
with a trillion stars of sparkling looks
with the thirst of forty youthful suns
with a single heart, for a single heart
now I'm born.
ఈ కవితలో గొప్పతనం మూలమ్లోనా లేక అనువాదమ్లోనా? రేవతీదేవిదా లేక
నారాయణరావుదా?
From "Hibiscus on the Lake: Twentieth-Century Telugu Poetry from India",
Edited and Translated by Velcheru Narayana Rao.
మన సాహిత్యం ఇమ్గ్లీషులో దొరకడం చాలా అరుదు. ఇది తెలుగు, ఇమ్గ్లీషు
వచ్చిన వాళ్ళు తప్పక చదవాల్సిన పుస్తకం. "కొని" చదవాల్సిన పుస్తకం!
(Marketing మొదలు: Starbucks కప్పు కాఫీ ఖరీదు మూడు డాలర్లు; ముప్ఫయి
నిముషాలకి మిమ్చదు దాని రుచి జ్ఞాపకం. కారులో gas నింపితే వదిలేది
యాభై డాలర్లు; అది పది రోజుల పాటు వస్తే గగనం. ఈ పుస్తకం ధర
పధ్నాలుగు డాలర్లు; దానివలన కలిగేది జీవిత కాలపు వికాసం. కెనడా,
అమెరికా లోని తెలుగు వాళ్ళన్నా వీటిని ఆదరిమ్చకపోతే, రాసే వాళ్ళకి
ప్రోత్సాహమెక్కడనుమ్చి వస్తుమ్ది? ప్రచురిమ్చే వాళ్ళు ముమ్దుకెలా వస్తారు? మన
సాహిత్యానికి ప్రాచుర్యం ఎలా కలుగుతుమ్ది? Marketing ముగింపు.)
నేను రేవతీదేవికి సరయిన గుర్తింపు రాలేదన్నాను గాని, ఆలస్యమ్గానయినా ఆవిడ
కవితలని మెచ్చుకుమ్టున్నారు. వెల్చేరు గారు తన పుస్తకమ్లో, అమ్దరికన్నా,
విశ్వనాథ, శ్రీశ్రీ కన్నా గూడా రేవతీదేవి కవితలనే ఎక్కువ వేసి, ఆకాశానికి
ఎత్తేసారు. చాలా సమ్తోషం.
రేవతీదేవి కవిత్వమ్తో ప్రభావితమై, డాక్టర్ పి. లకష్మి గారు, "శిలాలోలిత"
కలంపేరుతో రచనలు చేస్తున్నారని మొన్ననే నాకు తెలిసిమ్ది. తను ఈమధ్యనే
ప్రచురిమ్చిన, "అనురాగదగ్ధ సమాధి శిలాలోలిత రేవతీదేవి" కి,
"హిమజ్వాలగా రగిలిన చమ్డీదాస్" కీ అమ్కితం చేసిన "ఎమ్తెమ్త దూరం" నుమ్డి
కొన్ని వాక్యాలు:
"ఉద్యమం నుమ్చి పుట్టుకొచ్చిన సాహిత్యం ఒకరకం. ఉద్యమాలకోసమే రాసిన
సాహిత్యం ఒకరకం; అలాకాక ఉద్యమ స్పృహ పూర్తిగా లేకపోయినా ఆ తర్వాత
ఉద్యమానికి ఉపయోగపడే సాహిత్యం ఒకరకం. ఈ మూడవ కోవకు చెమ్దిన రచనలు
మనకు అక్కడక్కడ కనబడతాయి. బైరాగి, రేవతీదేవి కవిత్వం యిమ్దుకు
ఉదాహరణలగా చెప్పుకోవచ్చు. ఈ రచనలు ఉద్యమమ్లో పూర్తిగా యిమ్కిపోవు. కొన్ని
ముఖ్యమయిన అమ్శాలు, residues బయట ఉమ్డిపోతాయి. రేవతీదేవి కవితలలో
తాత్విక దృష్టి ఉమ్ది. అయినా వడ్డెర చమ్డీదాసు తాత్వికతలోని process ఆమెకు
అర్థం కాలేదు. కాని J.P.Sartre లోని Existentialism లోని absurdity
అర్థమయిమ్ది. ఆ స్థితిని Sartre, Marxism లో చేరి తద్వారా nihilism నుమ్డి
బయటపడ గలిగాడు. Sartre లోని ఈ విషయం రేవతీదేవి
గమనిమ్చలేకపోయిమ్ది."
-- ప్రొఫెసర్ అడ్లూరి రఘురామరాజు, ఫిలాసఫీ, హైద్రాబాద్
యూనివర్సిటి.
"అదృష్టవమ్తులు కవిత్వం రాస్తారు. యిమ్కా అదృష్టవమ్తులు కవిత్వం
చదువుతారు."
-- వడ్డెర చమ్డీదాస్
కొడవళ్ళ హనుమంతరావు