వర్డ్‌ప్రెస్
4 ఆపై విడుదలలో ఆటోమెటిగ్గా తెలుగు కూడా ఉండాలంటే, మనం తప్పనిసరిగా కొన్ని
అనువాదాలను 100% పూర్తి చెయ్యాలి. అవి, ఈ
వర్డ్‌ప్రెస్ తెలుగు ప్రాజెక్టుల లోని ఈ ఉప
ప్రాజెక్టులు:
* WordPress / Development
* WordPress / Administration
* WordPress / Network Admin
* Akismet / Development
(మీరు వర్డ్‌ప్రెస్ అనువాదాలకు కొత్తయితే, ముందుగా ఇక్కడ ఖాతా తెరుచుకోండి:
https://wordpress.org/support/register.php )
ప్రస్తుతం
తెలుగు వర్డ్‌ప్రెస్‌ను విడుదల చేయాలంటే ముందుగా దాన్ని మానవీయంగా
నిర్మించాలి. అయితే, ఈ ప్రక్రియ ఔత్సాహికులపై ఆధారపడటం వల్ల లేదా ఇతరత్రా
సాంకేతిక సమస్యల వల్ల జాప్యం జరిగే అవకాశం ఉంది.
వర్డ్‌ప్రెస్ 4
నుండి మానవీయ నిర్మాణానికి స్వస్తి చెప్పి, నేరుగా వర్డ్‌ప్రెస్ విడుదల
తోనే వివిధ భాషలను కూడా ఆటోమెటిగ్గా నిర్మించి విడుదల చేస్తున్నారు. అయితే,
ఆ సౌలభ్యం 100% అనువాదాలు పూర్తయిన భాషలకే పరిమితం.
మీరందరూ ఈ అనువాదాలలో చెయ్యివేస్తారని ఆశిస్తున్నాను. ఏమైనా సందేహాలుంటే నన్ను అడగండి.