వర్డ్‌ప్రెస్ స్ధానికీకరణ

22 views
Skip to first unread message

Veeven

unread,
Oct 5, 2012, 9:25:55 AM10/5/12
to telug...@googlegroups.com, teluguloc...@googlegroups.com
వర్డ్‌ప్రెస్ అనువాదాలు ఇంతకు మునుపు పలు చోట్ల (లాంచ్‌పాడ్, పూటిల్) జరిగేవి. గత కొంత కాలంగా, వర్డ్‌ప్రెస్ స్థానికీకరణ వారి స్వంత వేదిక గ్లాట్‌ప్రెస్ నందు జరుగుతూంది. పాత అనువాదాలను నేను చాలా వరకు దీనిలోకి ఎక్కించాను. కొత్తవి చేయడం కూడా మొదలుపెట్టాను. అలానే te.wordpress.org కూడా తయారవుతూంది.

గ్లాట్‌ప్రెస్‌లో అనువాదాలు చేయాలంటే మీకు వర్డ్‌ప్రెస్ తోడ్పాటు వేదికలో ఖాతా ఉండాలి (నమోదు ఫారానికి నేరు లంకె).

అనువాదానికి నేరు లంకెలు (వర్డ్‌ప్రెస్ తోడ్పాటు వేదిక లోని వాడుకరి పేరు మరియు సంకేతపదాలతో మీరు ఇక్కడ లాగిన్ అవ్వాలి).
వర్డ్‌ప్రెస్ 3.5 ప్రస్తుతం బీటా స్థితిలో ఉంది. అది విడుదలయ్యే సమయానికి మనం తెలుగు వెర్షనుని కూడా సిద్ధం చేద్దాం. రెట్టింపు ఉత్సాహంతో అందరూ ఈ స్థానికీకరణలో పాల్గొంటారని ఆశిస్తున్నాను.

ఇట్లు,
వీవెన్.
ఆనంద స్థానికీకరణం!
Reply all
Reply to author
Forward
0 new messages