పైలీగ్లాట్ అన్నది ఒక జాల-ఆధారిత అనువాద పదకోశం. ఏదైనా ఆంగ్ల పదాన్ని అడిగితే, ఆ పదానికి సంబంధించి వివిధ స్వేచ్ఛా మరియు బహిరంగాకర ప్రాజెక్టులలో ఉన్న అనువాదాలను చూపిస్తుంది. ఇది
ఓపెన్-ట్రాన్ లాంటిదే.
అన్నట్టు
లాంచ్‌ప్యాడ్ అనువాదాలు,
ట్రాన్స్‌లేట్‌వికీ,
ఫర్టాల్ వంటివి ఇప్పటికే అనువాద కోశం నుండి సలహాలను చూపిస్తాయి. కానీ, పైలీగ్లాట్ మరియు ఓపెన్-ట్రాన్ వంటి సేవల వల్ల వివిధ ప్రాజెక్టులలోని అనువాదాల నియతత్వత (consistency) ఎంతో తేలికగా చూడవచ్చు.
మైక్రోసాఫ్ట్ ఉత్పాదనల్లో ఉపయోగించిన తెలుగు పదాలను
వారి భాషా నెలవులో చూడవచ్చు.
మీ స్థానికీకరణలో ఈ సేవలను ఉపయోగించుకోండి.
ఇట్లు,
వీవెన్.