దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు : “
ఇస్లాం సంప్రదాయం ప్రకారం కాకుండా వేరే మత సంప్రదాయం ప్రకారం ప్రమాణం చేసినవాడు తను ప్రమాణం చేసిన విషయం లాంటివాడే అవుతాడు (అంటే ఆ మతానికి చెందిన వ్యక్తిగానే పరిగణించబడతాడు).
తన శక్తి పరిధిలో లేని విషయం గురించి మొక్కుబడి చేసుకున్నవాడు అలాంటి మొక్కుబడి నెరవేర్చనవసరం లేదు.
ఆత్మహత్య చేసుకున్నవాడు ఇహలోకంలో తనను తాను ఏ వస్తువుతో హతమార్చుకున్నాడో ప్రళయదినాన అతడ్ని అదే వస్తువుతో శిక్షించడం జరుగుతుంది.
విశ్వాసిని హత్యచేయడం ఎంత ఘోరమైన పాపమో, అతడ్ని దూషించడం కూడా అంతే (ఘోరమైన) పాపకార్యమవుతుంది. అలాగే అతనిపై సత్యతిరస్కార (కుఫ్ర్) అపనిందను మోపడం కూడా అంతే (ఘోరమైన) పాపకార్యమవుతుంది. (*)
(*) ఇది ఒక హెచ్చరికగా, మందలింపుగా పేర్కొనబడింది. నవవి (రహ్మలై) గారి ప్రకారం మనిషి హృదయాలలో ఇస్లాం పట్ల నిజమైన విశ్వాసం ఉంటే అతను అవిశ్వాసి కాజాలడు. ఒకవేళ అతని హృదయంలో ఇస్లాం కి బదులు ఇతర ధర్మాల పట్ల ఔన్నత్యభావం ఉంటే అతను తప్పకుండా అవిశ్వాసి అవుతాడు.