అల్లాహ్ ఏ దాసుడిని అయినా అభిమానిస్తే జిబ్రయీల్ (అలైహిస్సలాం) ని పిలిచి “అల్లాహ్ ఫలానా వ్యక్తిని అభిమానిస్తున్నాడు కనుక నీవు కూడా అతడ్ని అభిమానించు” అని అంటాడు. అందుచేత జిబ్రయీల్ (అలైహిస్సలాం) అతడ్ని అభిమానించడం ప్రారంభిస్తారు. తరువాత ఆయన ఆకాశంలో ఒక ప్రకటన గావిస్తూ “అల్లాహ్ ఫలానా వ్యక్తిని అభిమానిస్తున్నాడు. కనుక మీరంతా అతడ్ని అభిమానించండి” అని అంటారు. దాంతో ఆకాశవాసులంతా (అంటే దైవదూతలందరూ) అతడ్ని అభిమానించడం మొదలెడతారు. చివరికి భూమిపై కూడా అతనికి ప్రజాదరణ లభిస్తుంది.