ద్వితీయాధ్యాయం అద్వితీయమైన అధ్యాయం. 3 నుండి 18 అధ్యాయములకు సూక్ష్మ రూపం ఈ అధ్యాయం. ఇందులో
(1) 11 నుండి 30 శ్లోకం : దేహం-ఆత్మ గురించి. నువ్వు దేహాన్ని ధరించిన ఆత్మవు అనే భారతీయ వేదాంతాన్ని ఖచ్చితం చేయడం జరుగుతుంది
(2) 31 నుండి 38 శ్లోకం : ధర్మాష్టకం. సామాన్యమైన లౌకిక విషయం. యుద్ధం మానుకుంటే జరిగే నష్టాలను వివరించడం జరిగింది. ఇది కర్మయోగానికి పునాది.
(3) 39 నుండి 53 శ్లోకం : నిష్కామ కర్మ యోగం / బుద్ధి యోగం
(4) 54 నుండి 72 శ్లోకం : స్ధితప్రజ్ఞ లక్షణాలు (ఆత్మజ్ఞానానికి సజీవ రూపం)
మొదటి అధ్యాయం చివరి శ్లోకం సంజయ ఉవాచతో పూర్తై, రెండవ అధ్యాయం మొదటి శ్లోకం సంజయ ఉవాచతో మొదలవడం వెనుక అంతరార్ధం ఏమిటి ?
మొదటి అధ్యాయంలో భగవానుడు ఎందుకు జ్ఞానబోధ ప్రారంభించకుండా అర్జునుడి విషాదాన్ని వింటూనే ఉన్నాడు ? దాని వెనుక అంతరార్ధం ఏమిటి ?
Visit Discourses section of our website www.srichalapathirao.com to follow Discourses (Prakarana Texts, Bhagavad Gita, Upanishads, Brahma Sutras, Maha Bharatam, etc) in Order by way of Audio, Video or Ebook format.