తెలుఁగులో ఇంచుమించుగా వాడబడే అక్షరాలు ఎన్ని వాటిని ఎంత తఱచుగా వాడతారు, అన్నది కనుగోడానికి ఒక పెర్లు స్కరిప్టు వ్రాసాను.
దీనిని
counter.tel.pl 0 <సంచయంపేరు>
అని పరుగెత్తిస్తే,
అది ఆ సంచయంలో (directory) ఉన్న txt, htm(l) ఫైళ్ళను తెఱచి వాటిలోని అక్షరాలను కనుగొని
ఒక్కొక్క అక్షరం ఎన్నిసార్లు వచ్చిందో చెబుతుంది.
నేను దీనిని బ్రౌను నిఘంటువు మీద నడిపాను. వచ్చిన ఫలితాలను అతికించిపంపుతున్నాను.
## వాడుక ##
# ఉభయాక్షరాలను ప్రత్యేకఅక్షరాలుగా భావించరాదు అనుకున్నప్పుడు
#
counter.tel.pl 0 సంచయంపేరు
# ఉభయాక్షరాలను ప్రత్యేకఅక్షరాలుగా భావించరాదు అనుకున్నప్పుడు
#
counter.tel.pl 1 సంచయంపేరు
counter.pl ఆంగ్లంలో వుంది, (తెలుగులో వ్యాఖ్యలు మాత్రమేవున్నాయి) utf-8 పత్రి (file)
counter.tel.pl పూర్తిగా తెలుగులో వ్రాయబడ్డది! utf-8 పత్రి (file)
lc_brown_0.csv బ్రౌణ్యంలో తెలుగు అక్షరాల పట్టి వాటి పౌనఃపున్యం (ఉభయక్షరాలు ప్రత్యేక అక్షరాలు కాదు)
lc_brown_1.csv బ్రౌణ్యంలో తెలుగు అక్షరాల పట్టి వాటి పౌనఃపున్యం (ఉభయక్షరాలు ప్రత్యేక అక్షరాలు)
మీ రాకేశ్వర.