తమిళనాట ప్రభుత్వ ప్రచురణలు - పాఠ్యపుపొత్తాలతో సహా స్వేచ్ఛా లైసెన్సులలో

4 views
Skip to first unread message

రహ్మానుద్దీన్ షేక్

unread,
Aug 14, 2016, 3:48:53 AM8/14/16
to rahimanuddin shaik
తోటి తెలుగరులారా,
విజ్ఞానం అనేది నిర్బంధించి ఉంచరాదనే కనీస అవగాహనతో పాశ్చాత్య దేశాలవారు కాపీరైటుకి విరుద్ధంగా కాపీలెఫ్ట్ ఉద్యమాన్ని లేవదీసారు. కాపీరైటు చాటున అసలు హక్కుదార్ల నుండి పెద్ద మొత్తంలో హక్కులను కొనుక్కుని సొమ్ము చేసుకుంటున్న కార్పరేట్లకు విరుద్ధంగా ఈ ఉద్యమం జరిగింది, జరుగుతూంది.
ఐతే రచయితకుండాల్సిన కొన్ని హక్కులను ఉంచుతూ పూర్తి కాపీరైటులోని ఆంక్షలను, కాపీరైటేలేని కాపీలెఫ్టును కాకుండా మధ్యేమార్గే క్రియేటివ్ కామన్స్ లైసెన్సులొచ్చాయి. వీటి గురించి మరింత తెలుసుకునేందుకు creativecommons.org వద్ద చూడగలరు.
కాపీహక్కులున్న పక్షంలో ప్రతి రచనను వాడటంలో - ముఖ్యంగా నేటి ఇంటర్నెట్ శకంలో- చాలా కష్టం. ఎలాంటి లైసెన్స్ వివరాలు పొందుపరచని రచనలు వాటంతటవే కాపీరైటు పరిధిలోకి వస్తాయి, అంటే రచయిత వ్రాతపూర్వకంగా అనుమతి ఇవ్వనిదే ఆయా రచనలు వాడకూడదు. ఇది ఎన్నో విషయాలకి అడ్డంకి.
అదే రచయిత తన రచనను కొన్ని నిబంధనలతో ఎవరైనా వాడుకోవచ్చు అని ముందే ప్రకటించేస్తే? అలాంటి పరిస్థితినే క్రియేటివ్ కామన్స్ అందిస్తోంది.
రచయిత తన రచనని ఇతరులు సొమ్ముకి అమ్ముకోకుండా అరికట్టవచ్చు, రచన ఆధారంగా మరో రచనను సృష్టించకుండా అరికట్టవచ్చు. కచ్చితంగా ఈ రచన ఆధారంగా వచ్చే రచనలలో ఈ రచన పేర్కొనబడాలన్న నిబంధన పెట్టుకోవచ్చు. చట్టపరంగా ఇలాంటి వెసులుబాట్లను క్రియేటివ్ కామన్స్ ఇస్తున్నది.

ఆ విధంగా తమ రచన అని పేర్కొంటే చాలు, మూల రచనగా పేర్కొంటూ ఈ రచన ఆధారంగా వేరే పుస్తకాలు, పొత్తాలు అచ్చేయించుకోవచ్చు, సొమ్ముకి అమ్ముకోనూ వచ్చని, అయితే అలా రూపొందించే పొత్తాలు కూడా ఇదే లైసెన్సులో ఉండాలని తమిళనాడు ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. ఈ ప్రకటన తమిళ్ వర్చువల్ అకాడెమీ వారు రూపొందించగా, తమిళనాడు ప్రభుత్వ న్యాయ విభాగం వారు మంజూరు చేసి అన్ని ప్రభుత్వ సంస్థలకు అమలు పరచాలని ఆదేశాలు జారీ చేసారు.
ఈ ప్రకటన వలన తమిళనాట ప్రచురించబడిన అన్ని ప్రచురణలను అంతర్జాలంలో మనం స్వేచ్ఛగా పంచుకోవచ్చు. చట్టబద్ధంగానే ముద్రించుకొని అమ్ముకోవచ్చు కూడా! అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో సహా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, కళాశాలలు ఈ పరిధిలోకి రావటం వలన ఇది పరిశోధన రంగానికి ఎంతో మేలు చేయనుంది.
అయితే మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ దిశగా చొరవ తీసుకుంటాయని ఆశిద్దాం.

కొసమెరుపు : తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయమై చొరవ తీసుకోని పక్షంలో తెలుగు రాష్ట్రాలు ముద్రించే పాఠ్యపుస్తకాలకన్నా తమిళనాట ముద్రించబడే తెలుగు పాఠ్యపుస్తకాలు ఈ విధంగా అంతర్జాలంలో మరింత ప్రాచుర్యం పొందుతాయి.
తా.క. : ఈ ప్రకటన పూర్తిగా అరవంలోనే ఉంది!
--
With thanks & regards
Rahimanuddin Shaik
నాని
http://upload.wikimedia.org/wikipedia/meta/0/08/Wikipedia-logo-v2_1x.png

reachout
 
ఒక విశ్వాన్ని ఊహించండి, ఎక్కడయితే ప్రతి మనిషి ఒక సంపూర్ణ విజ్ఞానభాండారాన్ని అందరితో పంచుకోగలడో, ఆ విశ్వాన్ని ఊహించండి. అటువంటి విశ్వాన్ని నెలకొల్పడమే మా సంకల్పం.  
తెలుగు వికీపీడియా : http://te.wikipedia.org
A new address for ebooks : http://kinige.com
తెలుగువారికి సాంకేతిక సహాయం - http://techsetu.com
GoTN_Tamil_Development_Departments_order_on_creative_commons_cc_by_sa.pdf
Reply all
Reply to author
Forward
0 new messages